newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

ఈచింపాంజీ చాలా తెలివైంది.. బట్టలు కూడా ఉతికేస్తుంది

09-12-201909-12-2019 06:57:40 IST
2019-12-09T01:27:40.358Z09-12-2019 2019-12-09T01:27:17.607Z - - 11-08-2020

ఈచింపాంజీ చాలా తెలివైంది.. బట్టలు కూడా ఉతికేస్తుంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సాధారణంగా బట్టలు ఉతికేది మనుషులో, వాషింగ్ మెషీన్లో. కానీ అక్కడ మాత్రం చింపాంజీలు కూడా ఎంచక్కా బట్టలు ఉతికేసి ఆరేస్తాయి. నురగ వచ్చేలా సబ్బుతో రుద్ది మరీ బట్టలు ఉతికేస్తాయి.ఇంతకీ బట్టలుతికేది ఎక్కడనేగా మీ డౌట్.

మన పక్కనే వున్న చైనా దేశంలో చింపాంజీలు బట్టలుతకడం చేస్తున్నాయి. 18 ఏళ్ళ చింపాంజీ బట్టలుతికేది చూస్తే అచ్చం మనుషులు ఉతుకుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

ఈ చింపాంజీ పేరు యూహై. దీని వయసు 18 ఏళ్ళు. సౌత్ వెస్ట్ చైనాలోని చోంకింగ్ లేహె లేడు థీమ్ పార్కులో ఈ చింపాంజీ బట్టలు ఉతుకుతోంది. బండ కేసి బట్టల మురికిని వదలగొడుతోంది.

మనం ఒకసారి బట్టలు ఎలా ఉతుకుతామో గమనించి చాలా తెలివిగా ఆ పని అచ్చుగుద్దినట్టుగా చేసేస్తుంది. బ్రష్, బార్ సోప్ సాయంతో బట్టల్ని ఉతుకుతుండడంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బట్టలు బయట భాగంలోనే కాదు, ఏకంగా లోపలి భాగాలను కూడా బాగా శుభ్రపరుస్తుంది. మంచి పనితనం చూపిస్తోంది. 

టీషర్టులు, ప్యాంట్ లు ఇచ్చి నీరు బాగా వచ్చే చోట కూర్చోబెడితే యజమాని చెప్పినట్టుగా ఈ చింపాంజీ బట్టలుతికేస్తోంది. అది కూడా చాలా ఓపికగా ఉతకడం చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. అరగంట పాటు బట్టలు ఉతికింది చింపాంజీ. చాలా తెలివిగా, పద్దతిగా చింపాంజీ బట్టలుతకడం యజమానికి ఎంతో సంతోషాన్నిస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle