newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఇవాళ తొలి చంద్రగ్రహణం.. ఏ రాశులవారికి శుభకరం

10-01-202010-01-2020 10:11:00 IST
Updated On 10-01-2020 10:15:28 ISTUpdated On 10-01-20202020-01-10T04:41:00.691Z10-01-2020 2020-01-10T04:37:10.759Z - 2020-01-10T04:45:28.586Z - 10-01-2020

ఇవాళ తొలి చంద్రగ్రహణం.. ఏ రాశులవారికి శుభకరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనవరి 10.. ఇవాళ చంద్రగ్రహణం. ఇవాళ్టి చంద్రగ్రహణానికి ఎంతో ప్రత్యేకత ఉందంటున్నారు. ఈ ఏడాదిలో ఇదే మొదటి గ్రహణం కావడం విశేషం. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.37గం.లకు ఏర్పడే చంద్రగ్రహణం ఏర్పడి తెల్లవారుజామున 2.42 గంటల వరకు కొనసాగుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.

ఈ చంద్రగ్రహణం భారత్‌తో పాటు ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలలో గ్రహణం దర్శనమిస్తుంది. జనవరిలో సంభవించే ఈ చంద్ర గ్రహణాన్ని ఇంగ్లిష్‌లో వోల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్ అని అంటారు. వోల్ఫ్ అంటే తోడేలు అని అర్థం. ఇవాళ పౌర్ణమి కావడంతో దీనిని అత్యంత ప్రాధాన్యత ఉందంటున్నారు. అమెరికా ప్రజలకు ఈ గ్రహణం కనిపించదు.సంపూర్ణ చంద్రగ్రహణం లేదా చలికాలంలో వచ్చే మొదటి సంపూర్ణ చంద్రగ్రహణంగా పరిగణిస్తారు. ఓవైపు మంచు,మరోవైపు చలి నడుమ తోడేళ్ల సమూహాలు అర్థరాత్రి గ్రామాల వైపు తిరుగుతుంటాయని ఈ పేరు పెట్టారు.

శాకాంబరి పౌర్ణమి నాడు గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని నమ్మకం. ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.37గం.లకు ఏర్పడే చంద్రగ్రహణం తెల్లవారుజామున 2.42 గంటల వరకు కొనసాగుతుంది. దీనిని మామూలుగా చూడవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు.

ఈ చంద్రగ్రహణం తర్వాత కొన్ని రాశుల వారికీ రాజయోగం పట్టబోతోందంటున్నారు. ఈ దశాబ్దపు తొలి చంద్రగ్రహణం కావడంతో అందరూ దీనిని చూడాలని అంటున్నారు.  

ఈ ఏడాది మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడుతున్నాయి. జ్యోతిషం ప్రకారం ఈ గ్రహణం పునర్వసు నక్షత్రం మిథున రాశిలో సంభవిస్తుంది. జన్మరాశి నుంచి 3,6,10,11 రాశులలో గ్రహణమైన శుభప్రధం 2,5,7,9 రాశులందు గ్రహణమైన మధ్యమంగా భావిస్తారు.

చంద్ర గ్రహణం మిధున రాశిలో ఏర్పడుతుంది కనుక ఆ రాశి వారు గ్రహణాన్ని చూడకుండా వుంటే మంచిది. పైగా ఈ రాశి వారిపైన గ్రహణం ప్రభావం తీవ్రంగా వుంటుందంటున్నారు. కర్కాటకం, సింహ, తుల, మకర రాశులపైన కూడా ప్రభావం వుంటుంది. మేషం, కన్య, వృశ్చిక, మీన రాశుల వారికి శుభం. తుల, వృషభ, ధనుస్సు, కుంభ రాశులవారికి మధ్యమ ఫలితం వుంటుందంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle