newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

ఇదోరకం పనిష్మెంట్ ..ఆకతాయిల ఆటకట్టు

20-05-202020-05-2020 12:32:12 IST
Updated On 20-05-2020 14:52:06 ISTUpdated On 20-05-20202020-05-20T07:02:12.524Z20-05-2020 2020-05-20T07:02:03.004Z - 2020-05-20T09:22:06.040Z - 20-05-2020

ఇదోరకం పనిష్మెంట్ ..ఆకతాయిల ఆటకట్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా లాక్ డౌన్ సందర్భంగా యువకులు పని లేకపోయినా విచ్చలవిడిగా రోడ్లమీదకు వచ్చి బలాదూర్ తిరిగేస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు వారికి కౌన్సిలింగ్ ఇస్తుంటే మరికొందరు తమదైన రీతిలో ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. గుంజీలు తీయించడం, అంబులెన్స్ లోకి ఎక్కించడం వంటివి చేస్తున్నారు. యూపీలో మాత్రం పోలీసులు ఇస్తున్న పనిష్మెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా హాపుర్ జిల్లాలో పోలీసులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. 

హాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు యువకులు రోడ్లమీదకు వచ్చారు. వీరిని చూసిన పోలీసులు విచిత్రమయిన శిక్ష విధించారు. మాస్కు లేకుండా రోడ్డుమీదకు రావడమే వారు చేసిన తప్పు. నడిరోడ్డుమీద, రైల్వే క్రాస్ దగ్గర రోడ్డుపై అటూ ఇటూ  బోర్లాపడుతూ దొర్లమంటూ ఆదేశించారు. అసలే ఎండాకాలం.. సూర్యుడు నడి నెత్తిమీద నాట్యం ఆడుతుంటే. కింద తారు రోడ్డు హీటెక్కిపోయి వుంది.

అలాగే అటు నుంచి ఇటు. ఇటు నుంచి అటూ పొర్లుదండాలు పెట్టినట్టుగా చేయమన్నారు. అంతే ఆ ఆకతాయిలకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. ఎండ వేడిమికి వారు తాళలేకపోయారు. రోడ్డుకి అటువైపున రైల్వే ట్రాక్ దగ్గర నిలబడ్డ జనం మాత్రం వీరి వైపు విచిత్రంగా చూడడం కనిపించింది. 

పోలీసులపై వలస కార్మికుల దాడి 

మరోవైపు కరోనా వైరస్ కట్టడి విధుల్లో వున్న పోలీసులపై అమానుషంగా ప్రవర్తించారు వలస కార్మికులు. ఢిల్లీ - గురుగ్రామ్‌ సరిహద్దులో విధుల్లో ఉన్న గురుగ్రామ్‌ పోలీసులపై వలస కార్మికులు రాళ్ల దాడి చేశారు. పోలీసులను అసభ్యకర పదజాలంతో దూషించారు. హర్యానాలోని ఉద్యోగ్‌ విహార్‌ ఏరియాలో పరిశ్రమలను తెరవడంతో.. ఢిల్లీలోని వలస కూలీలు.. గురుగ్రామ్‌కు వెళ్లేందుకు కాలినడకన బయల్దేరారు. అయితే వందలాది మంది వలస కూలీలను గురుగ్రామ్‌ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కూలీలు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఢిల్లీ పోలీసులు కూలీలకు అనుమతి ఇవ్వకపోయి ఉంటే బావుండేదని పోలీసు అధికారులు అంటున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle