newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆహారపు అలవాట్లు, మందుల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోలేం..

01-08-202001-08-2020 08:18:37 IST
Updated On 01-08-2020 08:22:55 ISTUpdated On 01-08-20202020-08-01T02:48:37.307Z01-08-2020 2020-08-01T02:48:28.412Z - 2020-08-01T02:52:55.089Z - 01-08-2020

ఆహారపు అలవాట్లు, మందుల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోలేం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా నేపథ్యంలో పోషకాహారం కోసం పలాని పండ్లు, పలాని కూరగాయలు, పలాని ఆహార పదార్థాలు తీసుకోవాలని, శక్తికోసం విటమిన్ ట్యాబ్లెట్లను వాడాలని చాలామంది చాలారకాలుగా చెబుతున్నారుు. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మార్కెట్లలో రకరకాల పండ్ల జ్యూస్‌లు, విటమిన్‌ ట్యాబ్లెట్లు వాడుతున్నారు. నిజంగా ఆహారపు అలవాట్లు, విటమిన్‌ ట్యాబ్లెట్లతో కరోనాను నివారించవచ్చా అనే ప్రశ్నను సంధిస్తున్నారు ఇమ్యునాలజీ నిపుణులు. రోగనిరోధక శక్తి అనేది సంక్లిష్టమైన అంశమని, ప్రజలకు ఇంకా పూర్తిగా ఈ అంశంపై అవగాహన రాలేదని ఆహారపు అలవాట్ల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోలేమని, ఆరోగ్యంపై విటమిన్‌ సీ, జింక్‌ ట్యాబ్లెట్లు ఏ మాత్రం ప్రభావం చూపవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరస్‌ దెబ్బతో ప్రపంచంలో అన్ని దేశాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ) పెంచుకోవడమే ఏకైక మార్గమని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు రోగనిరోధకశక్తిను పెంచుకునేందుకు మార్కెట్లలో రకరకాల పండ్ల జ్యూస్‌లు, విటమిన్‌ ట్యాబ్లెట్లు వాడుతున్నారు. నిజంగా ఆహారపు అలవాట్లు, విటమిన్‌  ట్యాబ్లెట్లతో కరోనాను నివారించవచ్చా తెలుసుకుందాం. 

రోగనిరోధక శక్తి అనేది సంక్లిష్టమైన అంశమని, ప్రజలకు ఇంకా పూర్తిగా ఈ అంశంపై అవగాహన రాలేదని సీఎస్‌ఐఆర్‌ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్‌ ఇండస్ట్రియల్ రీసెర్చ్) మాజీ డైరెక్టర్‌, ఇమ్యునాలజీ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా మనిషి తీవ్రంగా రోగగ్రస్తులను చేసే యాంటిజన్స్‌(వ్యాధి కారకం)ను ఎదుర్కొనేందుకు సహజసిద్దంగా శరీరంలో యాంటిబాడీస్‌(యాంటీజన్స్‌ను ఎదుర్కొనేవి) ఉంటాయి. మరోవైపు సహజ రోగనిరోధక శక్తి  మానవుని నిరంతరం కాపాడుతూ ఉంటుంది.

సహజ రోగనిరోధక శక్తిలో తెల్లరక్తకణాల, న్యూట్రోఫిల్స్‌, టీసెల్స్(కణాలు)‌, బీసెల్స్(కణాలు)‌, యాంటిబాడీస్‌లతో కూడిన రక్షణాత్మక వ్యవస్థ కాపాడుతూ ఉంటుంది. కాగా ఈ కణాలను సైటోకైన్స్‌ ఉత్పత్తి చేస్తాయి. సైటోకైన్స్‌ అనేది ప్రొటీన్‌ ఇమ్యూన్‌ కణాలకు సిగ్నలింగ్‌ వ్యవస్థ లాంటిది. ఆహారపు అలవాట్ల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోలేమని ఇమ్యునాలజీ నిపుణులు అన్నారు. 

మెడికల్ షాపులు వద్దు.. ఇంటివైద్యమే ముద్దు..

సాధారణంగా కొందరు తమకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని చెబుతుంటారు. వారికి ఎక్కువగా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. విటమిన్‌ సీ, జింక్‌ ట్యాబ్లె‌ట్లతో రోగనిరోధకశక్తి పెంచుకోవచ్చనే అపోహలు ఉన్నాయి. మరోవైపు ఈ ట్యాబ్లెట్ల ద్వారా కిడ్నీ, లివర్‌ తదితర వ్యాధులతో చాలా మంది సతమతమవుతున్నారని తెలిపారు. 

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే మేలైన మార్గమని రోగనిరోధక శక్తి శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.  1962లో నోబెల్‌ బహుమతి పొందిన పాలింగ్‌ కూడా విటమిన్‌ సీ, జింక్‌ ట్యాబ్లెట్లు ఏ మాత్రం ప్రభావం చూపవని తెలిపారు. కానీ మరోవైపున ఆహారం ద్వారానే రోగనిరోధక శక్తి లభిస్తుందని ప్రకృతి, ఆయుర్వేద నిపుణులు గట్టిగా చెబుతున్నారు.

కానీ అందరూ ఏకీభవించేది మాత్రం వ్యాయామం. జీవనశైలి మార్పులతో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చని అందరూ ఏకీభవీస్తున్నారు. మానవ శరీరంలో రక్షణాత్మక వ్యవస్థను బలంగా ఉంచే సైటోకైన్స్‌, న్యూట్రోఫిల్స్‌, టీకణాలు, బీకణాలు.. వ్యాయామంతో బలోపేతమవుతాయని అల్లోపతి, ఆయుర్వేద, అన్ని రంగాల నిపుణులు ఏకీభవిస్తున్నారు. రోజుకు ఒక గంట వ్యాయామంతో రక్షణాత్మక వ్యవస్థను బలోపేతం చేసే అన్ని కణాలు ఉత్తేజితమవుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle