newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఆంధ్ర సంస్కృతీ వైభవం (వ్యాఖ్యానసహిత పద్యగాన లహరి)

08-11-201908-11-2019 18:58:49 IST
Updated On 08-11-2019 19:12:45 ISTUpdated On 08-11-20192019-11-08T13:28:49.591Z08-11-2019 2019-11-08T13:28:44.338Z - 2019-11-08T13:42:45.415Z - 08-11-2019

ఆంధ్ర సంస్కృతీ వైభవం (వ్యాఖ్యానసహిత పద్యగాన లహరి)
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ భాషలలో కెల్లా మధురాతి మధురం తెలుభాషా వాజ్మయం. సకల సాహితీ ప్రక్రియలలో కెల్ల మకుటాయమానం హృద్యమయిన తెలుగు పద్యం. జగత్ ప్రస్తుతమై రాజిల్లేది తెలుగువారి సంస్కృతీ వైభవం. సర్వజనులను, సకల ప్రాణులను రసజగతితో ఓలలాడించేది తీయనైన సంగీతం. ఈ నాలుగు అంశాల మేలైన సమ్మేళనమే ఆంధ్ర సంస్కృతి వైభవం అనే పద్యగాన విలాసం. 

శ్రీ చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి  పాలకొల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రధానోపన్యాసకులు. విద్యతః సంస్కృతాంధ్ర పండితులు. జన్మతః గాయకులు. ఆయన ఇటీవల ఆంధ్రుల చారిత్రక ప్రాభవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, తెలుగు జాతి దేశభక్తి నిరతిని, సర్వతోముఖ ప్రగతిని ప్రస్ఫుట పరుస్తూ తెలుగు సాహిత్య సీమలో లబ్ధ ప్రతిష్టులైన రాయప్రోలు, విశ్వనాథ, జాషువా, కరుణశ్రీ, తుమ్మల వంటి ఆధునిక కవి పుంగవులు ఆంధ్రుల పౌరుష ప్రతాపాలను, సాహిత్య సంగీత శిల్పకళా పోషణను, బహుముఖ ప్రజ్ఞా ధురీణతను, ఔన్నత్యాన్నీ ప్రస్తుతిస్తూ అందించిన పద్యాలలోని అమృత గుళికలు కొన్నింటిని ఏరి, శ్రోత్ర జనావళిని సమ్మోహన పరచేలా గానం చేసి ‘ఆంధ్ర సంస్కృతి వైభవం’ పేరిట వ్యాఖ్యాన సహితంగా అందించారు.

తన వాద్య బృందంతో శ్రీ ఫణి నారాయణ సంగీతం సమకూర్చిన ఈ పద్య గాన సంచికను , డాక్టర్ హేమమాలిని, శ్రీ చేగొండి అనంత శ్రీరాం గార్ల సౌజన్యంతో దీనిని రూపొందించారు. ఈ ఆంధ్రసంస్కృతీ వైభవం సీడీ సాహిత్య సంగీత కార్యక్రమం శ్రోతలను సమ్మోహితుల్ని, ఉత్తేజితుల్ని చేయడం ఖాయం. ఈ సీడీ నిర్మాతలు డాక్టర్ హేమమాలిని, అనంత శ్రీరాం. ఈ గానలహరిని మీరూ ఆస్వాదించండి.

 

ఆ టైంలో బయటకు రావద్దు.. వస్తే ప్రమాదం

ఆ టైంలో బయటకు రావద్దు.. వస్తే ప్రమాదం

   12 hours ago


కరోనా వైరస్‌తో కుదేలయిన హోటల్ ఇండస్ట్రీ

కరోనా వైరస్‌తో కుదేలయిన హోటల్ ఇండస్ట్రీ

   19 hours ago


గుప్త నిధుల కోసం ఘోరం..  మూగమహిళను బలిచ్చేందుకు యత్నం

గుప్త నిధుల కోసం ఘోరం.. మూగమహిళను బలిచ్చేందుకు యత్నం

   25-05-2020


ఓ రైతు సెల్ఫీ వీడియో కలకలం.. అసలేం జరిగింది?

ఓ రైతు సెల్ఫీ వీడియో కలకలం.. అసలేం జరిగింది?

   25-05-2020


అక్కడ బుసలు కొట్టిన శేషనాగు.. ఇక్కడ సరెండర్

అక్కడ బుసలు కొట్టిన శేషనాగు.. ఇక్కడ సరెండర్

   25-05-2020


తొలిపేజీ మొత్తంగా కరోనా మృతుల పేర్లు.. పాత్రికేయ చరిత్రలో అరుదైన ఘట్టం

తొలిపేజీ మొత్తంగా కరోనా మృతుల పేర్లు.. పాత్రికేయ చరిత్రలో అరుదైన ఘట్టం

   25-05-2020


ఖండాంతరాలకు వ్యాపించిన జ్యోతి సాహసం.. ఇవాంకా ప్రశంసలు

ఖండాంతరాలకు వ్యాపించిన జ్యోతి సాహసం.. ఇవాంకా ప్రశంసలు

   24-05-2020


మేఘాలలో తేలిపోయేలా... మేఘాలయా సీఎం సంగ్మా గిటార్ హాబీ

మేఘాలలో తేలిపోయేలా... మేఘాలయా సీఎం సంగ్మా గిటార్ హాబీ

   24-05-2020


ఈ దొంగ మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్ళబోయాడు

ఈ దొంగ మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్ళబోయాడు

   24-05-2020


వెండి నాణేల తుపాన్ ... అదనుచూసి ఎత్తుకెళ్లారు

వెండి నాణేల తుపాన్ ... అదనుచూసి ఎత్తుకెళ్లారు

   24-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle