newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

అవినీతి తిమింగలాలు ..ఆ ఎమ్మార్వో, వీఆర్వో

11-07-201911-07-2019 14:59:05 IST
2019-07-11T09:29:05.926Z11-07-2019 2019-07-11T09:29:04.309Z - - 20-10-2019

అవినీతి తిమింగలాలు ..ఆ ఎమ్మార్వో, వీఆర్వో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఏసీబీ అధికారులు దూకుడుతో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసిల్దార్‌ లావణ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ దాడిలో లావణ్య ఇంట్లో 93.5 లక్షలు, బంగారం పట్టుబడింది. మరో వైపు లావణ్య భర్త అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

తన భూసమస్య పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసిల్దార్ లావణ్య కాళ్ళు మొక్కుతున్న రైతు చెన్నయ్య దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ప్రతి పనికి లంచాలకు అలవాటు పడ్డ లావణ్య కోట్లకు పడగలెత్తారు. వీఆర్వో దారా లంచాలు తీసుకుంటున్న లావణ్య ఆగడాలకు అంతే లేకుండా పోయిందని గ్రామస్తులు, రైతులు ఏసీబీ అధికారులకు విన్నవించారు.

ఏసీబీ అధికారులు అందించిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కేశాయిపేట మండలం దత్తాయపల్లికి చెందిన మామిడిపల్లి చెన్నయ్యకు 12 ఎకరాల భూమి ఉంది. అందులో 9.7 ఎకరాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో అతని పేరు నమోదు కాలేదు. దీనిపై చెన్నయ్య కుమారుడు భాస్కర్‌ అనంతయ్యను సంప్రదించాడు. రూ.30 వేలు లంచం తీసుకొని ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేశారు. కానీ, గత నెల 18న ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసి 24న తొలగించారు.

దాంతో, భాస్కర్‌ మళ్లీ అనంతయ్యను సంప్రదించగా.. ఈసారి ఎకరాకు రూ.లక్ష చొప్పున 9 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేనని భాస్కర్‌ చెప్పడంతో రూ.8 లక్షలకు ఒప్పందం కుదిరింది. బాధితుడు భాస్కర్‌ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. బుధవారం కొందుర్గులో భాస్కర్‌ నుంచి అనంతయ్య రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.   

Image may contain: 1 person, sitting and indoor

వీఆర్వో.. తనతో పాటు రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ లావణ్యకు.. వాటా ఉందని చెప్పడంతో లావణ్యను విచారించారు. లావణ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. బీరువాలు,కప్ బోర్డులలో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. సుమారు మూడు గంటల్లోనే రూ. 93.50 లక్షల నగదు, 42 తులాల బంగారు ఆభరణాలు లభించాయి.

Image may contain: one or more people

అయితే రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఆమెను ఉత్తమ అధికారిణిగా గుర్తించడం విశేషం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లావణ్యను అరెస్టు చేశారు. తనిఖీల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్వోతో పాటు, వీఆర్ఓ ఇండ్లలో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle