newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

అమెరికాలో బతుకు క్షణం భయం – ట్రంప్ వైఖరే ఇందుకు కారణం!

08-08-201908-08-2019 12:28:20 IST
Updated On 08-08-2019 15:07:45 ISTUpdated On 08-08-20192019-08-08T06:58:20.659Z08-08-2019 2019-08-08T06:58:14.833Z - 2019-08-08T09:37:45.114Z - 08-08-2019

అమెరికాలో బతుకు క్షణం  భయం – ట్రంప్ వైఖరే ఇందుకు కారణం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అగ్రరాజ్యం అమెరికా అంటే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు నెలవు అన్న మాట ఇప్పుడు పాతబడిపోయింది. అమెరికాలో తుపాకి సంస్కృతి పెచ్చరిల్లి చాలా కాలమే అయినా...ఇప్పుడు ఈ సంస్కృతికి స్వయంగా అమెరికా అధ్యక్షుడే దన్నుగా నిలుస్తున్నారా అన్న అనుమానాలు కలిగేంతగా పరిస్థితి దిగజారిపోయింది. గతంలో చెదురుమదురు సంఘటనలుగా అప్పుడప్పుడు వ్యక్తిగత ఫ్రస్ట్రేషన్ కారణంగా కాల్పులకు తెగబడే వ్యక్తుల సంఘటనలు జరిగేవి. కానీ ఇటీవలి కాలంలో జాత్యాహంకారంతో, జాతీయ వాదంతో, అభిజాత్యంతో, గిట్టని తనంతో తుపాకుల మోత మోగిస్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. 

ఇటీవలి కాలంలో అతి స్వల్ప వ్యవథిలో అమెరికాలో కాల్పుల సంఘటనలు మూడు సార్లు జరిగాయి. మూడు సంఘటనల్లోనూ కూడా పరాయి దేశం నుంచి తమ దేశానికి వలస వచ్చిన వారి వల్ల తమ ఉపాధి అవకాశాలు కొల్పోతున్నామన్న దుగ్ధతో, ఆగ్రహంతో అమెరికేతరులపై ద్వేష భావంతో ఈ కాల్పుల ఘటనలు జరిగాయి. ఇందకు కారణమేమిటి? అన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలు, వ్యవహార శైలి, తెంపరితనం అనే సమాధానాలే వస్తాయి. ట్రంప్ తీరు, విధానాల కారణంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అలాగే స్వయంగా అమెరికన్లలోనూ ఆయన తీరు ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలి కాలంలో అమెరికా ఫస్ట్ పేరిట ట్రంప్ పలుమార్లు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలే తాజాగా కాలిఫోర్నియాలోనూ, ఒహియాలోనూ, టెక్సాస్ లోని ఎల్ పాసోలోనూ జరిగిన కాల్పుల ఘటన. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ సంఘటనలు అమెరికా సమాజంలో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. అమెరికాలో ప్రజా భద్రత ఎండమావిలో నీరులా తయారైందనడానికి ఎల్ పాసోలో జరిగిన సంఘటనే తార్కానం. అగ్రరాజ్యాధినేతగా ట్రంప్ ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయిస్తున్నట్లుగానే...ఆ దేశంలోని దురహంకారులు, అమెరికా జాతీయ వాదం పేరు చెప్పుకుని ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు లక్ష్యంగా మారణహోమానికి తెగబడుతున్నట్లుగా కనిపిస్తున్నది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా దేశంలో నిరసనకారులపై జరిగే హింసాకాండను సమర్ధిస్తామని ప్రకటించారు. వలస వచ్చేందుకు సరిహద్దుల్లో శరణార్థులుగా  వేచి ఉన్నవారిని కాల్చిచంపడమే మేలన్న అర్ధం వచ్చేలా ప్రసంగాలు చేశారు. ఎల్ పాసొలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పదుల సంఖ్యలో అమయాకుల ప్రాణాలు పోవడానికి కారకుడైన వ్యక్తి ఆగ్రహం మొత్తం దేశంలోని వలస వచ్చిన వారిపైనే కేంద్రీకృతమై ఉంది. స్థానికుల ఉద్యోగావకాశాలను కొల్లగొడుతున్నారన్న అక్కసుతో అతడీ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇటువంటి ధోరణి ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత అక్కడ ఎక్కువైందని పరిశీలకులు సైతం చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడంటే ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడానికి దొరికిన లైసెన్స్ గా భావిస్తున్నట్లుగా ట్రంప్ వ్యవహార తీరు ఉంది. 

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో భేటీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కాశ్మీర్ మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని ప్రకటించడం, తాను తలచుకుంటే ఆప్ఘనిస్థాన్ అనే దేశమే ఉండదని మాట్లాడటం ఇందుకు నిదర్శనలు. ట్రంప్ వ్యాఖ్యలు, ప్రకటనలను స్వయంగా వైట్ హౌస్ ఖండించాల్సిన పరిస్థితి రావడం అంటే ఆయన ఎంత ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇరాన్ విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న విధానం, దాడులతో, ఆంక్షలతో లొంగదీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, కాశ్మీర్ ను నెపంగా చూపి భారత్ పై పెత్తనం చెలాయించేందుకు ఉవ్విళ్లూరుతున్న తీరు అగ్రరాజ్యాధినేత అహంభావానికి నిలువుటద్దంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఆయన తీరు మారకుంటే...అమెరికా అగ్రరాజ్య హోదాకే ఎసరు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

ఢిల్లీలో రెడ్ అలర్ట్ .. ఉప్పొంగుతున్న యమున

ఢిల్లీలో రెడ్ అలర్ట్ .. ఉప్పొంగుతున్న యమున

   an hour ago


గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

   20-08-2019


మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

   20-08-2019


వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

   19-08-2019


నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

   19-08-2019


బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

   17-08-2019


రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

   17-08-2019


వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

   16-08-2019


రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

   16-08-2019


చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

   15-08-2019


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle