newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

అమెరికన్ కాన్సులేట్ వద్ద భారీ భద్రత

09-01-202009-01-2020 13:22:55 IST
2020-01-09T07:52:55.444Z09-01-2020 2020-01-09T07:52:52.777Z - - 20-01-2020

అమెరికన్ కాన్సులేట్ వద్ద భారీ భద్రత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా, ఇరాన్, మధ్య ఉద్రిక్త వాతావరణం నెల‌కొన‌డంతో హైదరాబాద్  బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ ఆఫీసు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలు మోహరించడంతో అక్కడికి వెళ్లాలంటేనే సందర్శకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కార్యాలయానికి వస్తోన్న ప్రతీ ఒక్క‌రినీ క్షుణ్ణంగా తనిఖీ చేశాక లోపలికి అనుమతిస్తున్నారు.

యుఎస్ కాన్సులేట్ ఆఫీసు వద్ద భారీ భద్రత నేపథ్యంలో బేగంపేటలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అవుతోంది. ఇటు హైదరాబాద్ తో పాటు దేశం లోని ఇతర ప్రాంతాల్లోనూ అమెరికా రాయబార కార్యాలయాల వద్ద ఆయా దేశాల ప్ర‌భుత్వాలు గ‌ట్టి భద్రతను పెంచాయి.

మరోవైపు ఇరాక్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై 15 బాలిస్టిక్ క్షిపణులతో జరిపిన దాడులలో 80 మంది అమెరికా సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో అమెరికా మిలిటరీ చాపర్లు, ఇతర సామాగ్రి ధ్వంసమైనట్లు  ఇరాన్ తెలిపింది. ఈ యుద్ద వాతావరణంలో ఇరాన్, ఇరాక్ దేశాల గగనతలం ద్వారా విమాన ప్రయాణాలు ప్రమాదకరమని అమెరికా తన విమానయాన సంస్థలను హెచ్చరించింది. 

ఇరాన్ జనరల్‌ సులేమానీని అమెరికా హత్య చేసిన నేపథ్యంలో ఇరాక్ లోని అమెరికన్ సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులు కలకలం రేపుతున్నాయి. మరో వైపు ఇరాన్ దాడిని అమెరికా ఖండించింది. ప్రపంచంలో ఎవ్వరికీ లేని అత్యంత శక్తిమంతమైన మిలిటరీ వ్యవస్థ తమ వద్ద ఉందని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇరాన్ పై సరైన రీతిలో స్పందిస్తామన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle