newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

అబ్బురపరిచే అద్భుత సంపద సాలార్ జంగ్ మ్యూజియం

12-06-201912-06-2019 06:37:15 IST
Updated On 11-06-2019 18:11:05 ISTUpdated On 11-06-20192019-06-12T01:07:15.914Z11-06-2019 2019-06-11T12:35:53.725Z - 2019-06-11T12:41:05.340Z - 11-06-2019

అబ్బురపరిచే అద్భుత సంపద సాలార్ జంగ్ మ్యూజియం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చారిత్రాత్మకమయిన హైదరాబాద్ నగరం పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేవి చార్మినార్, మక్కామసీద్, గోల్కొండ కోట, బిర్లామందిర్, సాలార్ జంగ్ మ్యూజియం. దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి, వివిధ దేశాలనుంచి వచ్చిన పర్యాటకులు, రీసెర్చ్ స్కాలర్లు ఇష్టపడేది సాలార్ జంగ్ మ్యూజియం అంటే అతిశయోక్తికాదు. నైజాం రాజులు వందల ఏళ్ళనాటి అరుదైన వస్తువులు ఇక్కడ కొలువై వుంటాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ మ్యూజియం హైదరాబాద్‌కు చెందిన ఓ గొప్ప సంపదగా భావిస్తున్నారు. సాలార్ జంగ్-3చే 40 సంవత్సరాలపాటు దేశ విదేశాల నుండి సేకరించబడిన అనేక అద్భుతమైన కళాఖండాలు, శిల్పాలు, చిత్రాలు, పురాతన వస్తువులు, ఆయుధాలు, కార్పెట్స్, పెయింటింగ్స్, ఇంకా అనేక వస్తువులు ఈ మ్యూజియంలో భద్రపరిచారు. 

Image may contain: 1 person, standing

మ్యూజియం విశేషాల్లో్కి వెళితే ....సాలార్‌జంగ్‌ మ్యూజియం మొత్తం 3 భవనాలలో రెండు అంతస్తులలో కట్టబడి ఉంది. మొత్తం 38 గదులతో భారతీయ బ్లాక్‌, తూర్పు బ్లాక్‌, పశ్ఛిమ బ్లాక్‌గా విభజించారు. ఈ మొత్తం భవనాల్లో విలువకట్టలేని చారిత్రక సంపద ఉంది. అందుకే భద్రత విషయంలో అధికారులు చాలా అప్రమత్తంగా ఉంటారు. రోజూ వేలాదిమంది పర్యాటకులు సాలార్ జంగ్ మ్యూజియం సందర్శిస్తారు. ఏదో హడావిడిగా వెళితే మాత్రం ఆ అనుభూతిని పొందలేరు. మ్యూజియం మొత్తం చూడడానికి కనీసం ఐదారుగంటలు పడుతుంది. 

మ్యూజియంలో ఒక్కో గదికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో ఫౌండర్స్‌ గ్యాలరీ, భారతీయ చేనేత మరియు కంచు పరికరాలు, భారతీయ విగ్రహాలు, దక్షిణాది ఆర్ట్స్‌ విభాగాలు ఉంటాయి. అంతేకాదు భారతీయ చేనేత విభాగం, ఓ గదిలో దంతాలతో నిర్మించబడ్డ కోచ్‌ ఉంది. ప్రత్యేకంగా తొమ్మిది, పదవ గదులలో పిల్లల విభాగం ఉంది. దంతంతో చేయబడిన వస్తువులు, రెబక్కా, ఆయుధాల గ్యాలరీ, భారతీయ మోడరన్‌ పెయింటింగ్స్‌, భారతీయ సూక్ష్మ చిత్రాలు, మినియేచర్ పెయింటింగ్స్ కొలువై ఉన్నాయి. వీటిని చూస్తుంటే ఆనాటి రాజుల అభిరుచులు మనకు అర్థం అవుతాయి. 

Image may contain: outdoor

ఒక శిల్పంలో ఒకవైపు అబ్బాయి కనిపిస్తే.. వెనుకభాగం అమ్మాయి రూపం మనకు అక్కడ ఏర్పాటుచేసిన అద్దంలో కనిపిస్తుంది. ఆనాటి శిల్పకారుల అద్భుత ప్రతిభకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఇక్కడి అరుదైన గోడ గడియారాలను చూసి తరించాల్సిందే. అంతేకాదు మ్యూజియంలో అరుదైన బొమ్మలు, ఫ్లోరా మరియు ఫానా. భారతీయ వెండి సామాన్ల గ్యాలరీ ఉంది. మ్యూజియంలో మ్యూజికల్ క్లాక్, రెబెక్కా గ్యాలరీలు ప్రత్యేక ఆకర్షణలు అని చెబుతున్నారు మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఎ.నాగేంద్రరెడ్డి. 

Image result for salarjung museum

ఈ సాలార్ జంగ్ మ్యూజియం పీహెచ్ డీ, ఎంఫిల్ చేసే రీసెర్చ్ స్కాలర్లకు ఎంతో విలువైన సమాచారం అందిస్తుందంటున్నారు డైరెక్టర్ నాగేంద్రరెడ్డి. ఇక్కడ లైబ్రరీలో 8వేలు మాను స్క్రిప్ట్స్ విద్యార్ధులకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా తమ పరిశోధనకు అవసరమయిన సమాచారం  విద్యార్ధులు సేకరించుకోవచ్చు. పరిశోధనా విద్యార్దులు మ్యూజియం రిసెప్షన్లో పాస్ తీసుకుని లైబ్రరీకి వెళ్లవచ్చు. బుద్ధ జయంతి, గాంధీ జయంతి, సమ్మర్ క్యాంప్‌లలో పిల్లలకు ప్రత్యేక సెమినార్లు, చర్చలు నిర్వహిస్తున్నామని చెప్పారు డైరెక్టర్ డాక్టర్ ఎ.నాగేంద్రరెడ్డి. ఈ మ్యూజియం సందర్శించడం తమకెంతో అనుభూతిని కలిగించిందంటున్నారు సందర్శకులు.

Related image

ఈ తరం యువతీ, యువకులకు మ్యూజియం ఓ అద్భుత సంపద అంటున్నారు మరో పర్యాటకురాలు. ఇక్కడ ఏర్సాటుచేసిన మ్యూజికల్ క్లాక్ చూడడానికి పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. బంగారంతో తయారుచేసిన గ్లాసు కప్పులు, నైజాం రాజులు వాడిన మామూలు కత్తులు, వజ్రాల కత్తులు, నైజాం రాజులు వాడిన దుస్తులు, నైజాం రాజు గారి కోసం రాళ్ళతో తయారుచేసిన అద్భుతమయిన కళాఖండం చూస్తే తలతిప్పుకోలేరు.

సాలార్ జంగ్ 3 పెయింటింగ్ వేసిన చిత్రకారుడి ప్రతిభకు మనం సలాం కొట్టాల్సిందే. ..ఇలా చెప్పుకుంటే పోతూ గంటల గంటలు సరిపోదు.. అద్భుతమయిన అనుభూతి మీకూ సొంతం కావాలంటే ఓసారి సాలార్ జంగ్ మ్యూజియం చూసి వచ్చెయ్యండి. మ్యూజియం పనిచేయు వేళలు ఉదయం 10 గంటల నుండి సా.5 గంటల వరకు. ప్రతి శుక్రవారం సెలవు ఉంటుంది. ఇతర పండుగల సమయంలో మ్యూజియం మూసివేస్తారు. మిలాద్‌-ఉన్‌-నబి, డా॥ అంబేద్కర్‌ జయంతి, సాలార్‌జంగ్‌ వర్థంతి, రంజాన్‌, దసరా, బక్రీద్‌, మొహర్రం పండుగలకు మ్యూజియంని తెరవరు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle