newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

అన్నా నన్ను కాపాడు అనగానే ప్రాణాలకు తెగించాడు..!

08-12-201908-12-2019 08:01:35 IST
2019-12-08T02:31:35.113Z08-12-2019 2019-12-08T02:31:30.055Z - - 24-01-2020

అన్నా నన్ను కాపాడు అనగానే ప్రాణాలకు తెగించాడు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డాక్టర్ దిశపై హత్యాచారం యావద్దేశాన్ని కంపింప చేసింది. హెల్ప్‌ మీ.. హెల్ప్ మీ అంటూ ఆర్తనాదాలు చేస్తున్న ఒక అమాయక విద్యావంతురాలిని నాలుగు తోడేళ్లు పీక్కుతిని పాతికేళ్ల చిరుప్రాయాన్ని చిదిమేశాయి. మనిషిలోని పశుత్వానికి, క్రూరత్వానికి దిశ ఉదంతం పరాకాష్ట అయితే అదే సమయంలో చైనాలో 14 ఏళ్ల మైనర్ బాలుడు ప్రాణాలకు తెగించి బోరుబావిలో పడిన మూడేళ్ల పసిపాపను కాపాడాడు. వంద అడుగుల బోరుబావిలో పడిన పాపను కాపాడటానికి అన్ని ప్రయత్నాలూ విఫలమైన సన్నగా ఉన్న కుర్రాడిని బోరుబావిలోకి తాడుకట్టి దింపితే ఆరుసార్లు ప్రయత్నించి చివరకు ఆ పాపను బయటకు లాగిన బాహబలి అతడు.  

ప్రాణాలపై ఆశ వదులుకున్న ఆ పాప పైనుంచి చేయి వచ్చి తగిలితే గట్టిగా పట్టుకుని అన్నా నన్ను కాపాడు అంటూ ప్రాధేయపడింది. అందుకే వచ్చాను నువ్వు ధైర్యంగా ఉండమ్మా అంటూ గాలి పీల్చుకోవడానికి బయటకు వచ్చిన ఆ కుర్రాడు ఆరవ ప్రయత్నంలో ఎట్టకేలకు ఆ పాపను తీసుకొచ్చాడు. కాదు.. ప్రాణం పోశాడు. మనిషితనానికి ఇదీ అసలు నిర్వచనం.

ఇది చైనా బాహుబలి కథ. బోరుబావిలో పడిన పాపను కాపాడటానికి భూమిలోకి చేతులు చాచిన అపర బాహుబలి కథ. మన దేశంలో బోరు బావుల్లో పడిపోయిన పిల్లలను రక్షించడం ఎంత కష్టమో మనం చూస్తూనే ఉంటాం. అలాంటి సందర్భాల్లో చాలా తక్కువ సార్లు మాత్రమే పిల్లలు ప్రాణాలతో బయటకు వస్తుంటారు. చైనాలో కూడా ఇటీవల ఇలాంటి సంఘటనే జరగడంతో ఓ స్కూల్లో చదువుతున్న 14 ఏళ్ల మైనర్‌ బాలుడు సాహసించి మూడేళ్ల పాపను రక్షించారు. 

చైనా, హెనన్‌ రాష్ట్రంలోని జెన్‌ కౌంటీలో మిస్టర్‌ జావో అనే ఓ వ్యక్తి తన మూడేళ్ల పాపను ఓ ఫుడ్‌ కోర్టు పక్కనుంచి నడిపించుకుంటూ పోతుంటే తెరచి ఉన్న బోరు బావిలోకి పడిపోయింది. కళ్ల ముందు జరిగిన ప్రమాదాన్ని చూసిన ఆ తండ్రి, తన కూతురిని కాపాడమని కేకలు వేశారు. ఈ వార్త తెల్సిన అనతికాలంలోనే చైనా పోలీసులు ప్రమాద స్థలికి వచ్చారు. ఆక్సిజన్‌ సిలిండర్లను, అనుసంధాన పైపులను తీసుకొచ్చి ముందుగా ఆ బోరు బావిలోకి ఆక్సిజన్‌ను పంపించడం మొదలు పెట్టారు. 

వంద అడుగుల లోతుగల ఆ బావి మధ్యలో ఇరుక్కుపోయిన ఆ బాలికను ఎలా వెలికి తీయాలో పోలీసులకు తెలియలేదు. ఎవరైనా బక్క పలుచగా ఉన్న వ్యక్తిని తల కిందులుగా పంపిస్తే తప్పా, ఆ పాపను రక్షించలేమని వారు చెప్పారు. తనను అలా పంపించమంటూ ఆ పాప తండ్రి జావో ముందుకొచ్చారు. అయితే ఆ బోరు బావి వెడల్పు కేవలం ఎనిమిది అంగుళాలు మాత్రమే ఉందని, ఆయన్ని పంపించడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేశారు. 

అంతలో ప్రమాద స్థలికి వచ్చిన వాంగ్‌ క్వింగ్‌జున్‌ అనే వ్యక్తి తన 14 ఏళ్ల కుమారుడైన వాంగ్‌మిన్‌ రన్‌ అందుకు సమర్థుడంటూ అతన్ని పిలిపించారు. మైనర్‌ బాలుడి ప్రాణాలను రిస్క్‌లో పెట్టలేమని, అది నేరం అవుతుందని పోలీసులు వద్దన్నారు. తన కుమారుడు సమర్థుడు, సాహసవంతుడని, ఏ ప్రమాదం జరిగినా అందుకు తానే బాధ్యత వహిస్తానని ఆ తండ్రి హామీ ఇవ్వడం, అదే సమయంలో బోరు బావిలో పడిపోయిన పాప అరుపులు ఆగిపోవడంతో బాలుడి సహాయం తీసుకోవడానికి పోలీసులు ముందుకు వచ్చారు. మినరన్‌కు కొన్ని ముందు జాగ్రత్తలు చెప్పి తలకిందులుగా లోపలికి పంపించారు. లోపలికి వెలుతున్నప్పుడు దారి మరీ సన్నగా ఉండడంతో బాలుడిని బయటకు తీయాల్సి వచ్చింది. 

బాలుడు చెప్పిన సమాచారం ఆధారంగా బోరు బావిని పైనుంచి లోపల వెడల్పు చేశారు. నాలుగోసారి బాలుడిని పంపించినప్పుడు పాప చేయి బాలుడి చేతికందింది. ‘అన్నా నన్ను కాపాడు అంటూ ఆ పాప నా చేయి పట్టుకుంది. కాపాడడానికే వచ్చాను. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి, గుండెల నిండా ఆక్సిజన్‌ పీల్చుకోవడానికి మరోసారి బయటకు వచ్చాను. ఆరో ప్రయత్నంలో ఆ పాపను బయటకు తీసుకురాగలిగాను’ అంటూ తన అనుభవాన్ని ఆ బాలుడు మీడియాతో పంచుకున్నాడు. పాప ప్రాణాలను కాపాడినందుకు ఎంతో అనందంగా ఉందన్నాడు. అక్కడున్న వారంతా ఆ బాలుడిని, ఆ బాలుడి తండ్రిని అభినందించారు.

ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే మగతోడేళ్లు పీక్కుతింటున్న ప్రపంచంలో చిన్నారిని కాపాడేందుకు తన ప్రాణాలకు తెగించిన కుర్రాళ్లు ఉండటం ఈ ప్రపంచం చేసుకున్న పుణ్యం అంటూ కొనియాడుతున్నారందరూ..


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle