‘అనంత’లో తల్లి అఘాయిత్యం...ఇద్దరు కూతుళ్ళతో ఆత్మహత్య
01-12-201901-12-2019 18:29:08 IST
Updated On 01-12-2019 18:29:06 ISTUpdated On 01-12-20192019-12-01T12:59:08.407Z01-12-2019 2019-12-01T12:58:28.825Z - 2019-12-01T12:59:06.163Z - 01-12-2019

చిన్న చిన్న మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ఏపీలోని అనంతపురంలో తల్లి ఇద్దరు కూతుళ్ళ ఆత్మహత్య కలకలం రేపుతోంది. అనంతపురం జాతీయ ఉద్యానవనం సమీపంలో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. ఆదివారం వేకువజామున ఇది జరిగింది. పాపంపేట ప్రాంతానికి చెందిన వెంకటేశు, పోలేరమ్మలు భార్యాభర్తలు. వీరు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్ళు. 17 ఏళ్ళ ఆర్తి, 11 ఏళ్ళ దీప చదువుకుంటున్నారు. పెద్ద కుమార్తె ఆర్తి ఇంటర్మీడియట్ పూర్తి చేసి, నర్సింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల పోలేరమ్మ తన ఆభరణాలను తాకట్టు పెట్టింది. ఈ ఆభరణాల విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. శనివారం పోలేరమ్మ ఇద్దరు కూతుళ్ళను తీసుకుని ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె, ఇద్దరు పిల్లల కోసం బంధువులు గాలించారు. కానీ వారి ఆచూకి దొరకలేదు. ఈ ముగ్గురూ రైలు పట్టాలపై కనిపించారు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఇద్దరు కూతుళ్ళు తిరిగి రానిలోకాలకు వెళ్ళిపోయారు.

బెంగాల్లో మరో దిశ తరహా ఉదంతం.. మహిళ సేఫ్.. ట్రక్ డ్రైవర్ అరెస్ట్
10 hours ago

ఆటవికులు మీరు!
10 hours ago

ఆగని దాడులు, కిడ్నాప్‌లు.. చిత్తూరులో ఇంటర్ స్టూడెంట్ కిడ్నాప్
13 hours ago

రెచ్చిపోతున్న కామాంధులు.. అడుగడుగునా అకృత్యాలే
04-12-2019

అశ్లీల దృశ్యాలను డౌన్లోడ్ చేస్తే అరెస్టు చేస్తారా?
04-12-2019

బెజవాడ కోర్టు సంచలన తీర్పు.. మృగాడైన తండ్రికి 20ఏళ్ళ జైలు
03-12-2019

దిశ ఘటనపై అసభ్యకర పోస్టులు.. ఒకరి అరెస్ట్
03-12-2019

బీజేపీ దిద్దుబాటు.. నందీశ్వర్ గౌడ్ తనయుడిపై వేటు
03-12-2019

మహిళను కాపాడిన.. ఎస్సై అర్జున్‌కు డీజీపీ ప్రశంసలు
03-12-2019

టీ కప్పు కోసం అలక.... గుర్రమా మజాకా!
02-12-2019
ఇంకా