newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

అడవిలో అలజడి...పోడు వ్యవసాయానికి వెన్ను పోటు

09-08-201909-08-2019 09:11:30 IST
Updated On 09-08-2019 11:22:55 ISTUpdated On 09-08-20192019-08-09T03:41:30.983Z09-08-2019 2019-08-09T03:41:27.548Z - 2019-08-09T05:52:55.187Z - 09-08-2019

అడవిలో అలజడి...పోడు వ్యవసాయానికి వెన్ను పోటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

1994 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆగస్టు9ను అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా నిర్ణయించింది. భారత దేశంలో 461 ఆదివాసీల తెగలున్నాయి. వీరిలో దాదాపు 92 శాతం మంది ఆడవిపైనే ఆదారపడి బతుకుతున్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వాల విధానాలతో పోల్చిచూస్తే అమానుష విధ్వంసకాండ, పాలక వర్గాలు ఆదివాసులపై చేస్తున్న కుట్రలు అనేకం.  ఆదివాసులకు విద్యా, వైద్యం, మౌళిక సదుపాయల కల్పనా విషయంలో పాలకులు పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పేరుతో వారి జీవన శైలీని, వారి బ్రతుకుల మీద ఆంక్షలు విధిస్తున్నారు.  ఇరాక్‌, ఆఫ్ఘనిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో కూడా ఆదివాసులు స్వేచ్ఛగా బతికిన సందర్బాలు లేవు. ఆదివాసుల ప్రాంతాల్లో లభించి ఖనిజ ముడి సరుకులను బహుళజాతి సంస్థలు దోచుకోవడానికి చేస్తున్న కుట్రలు  అనేకం. వారి జీవన శైలిని పట్టించుకోకుండా, వారికి మౌళిక సదుపాయాలు కల్పించకుండా తమ వ్యాపార లభం కోసం ఆదివాసుల బతుకులను కుక్కలు చింపిన ఇస్తరాకుల చేసి అడవుల్లో వదిలేస్తున్నారు.  ప్రత్యేక తెలంగాణ  రాష్ట్రంలో ఆదివాసీలకూ ఘోరమైన అన్యాయంజరుగుతంది. జల్‌ జంగిల్‌ జమీన్‌ కోసం పోరాడిన ఆదివాసీ విప్లవ పోరాట జ్వాలలు కొమరం భీం, భీర్సాముండా, సాయంగంగులు, రాంజీ గోండ్‌ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుందాం. ఆదివాసీ హక్కుల కోసం ఆదివాసీల స్వయం పాలన కోసం ఉద్యమించి కాకతీయులపై కత్తులు దూసిన అమరులైన సమ్మక సారలమ్మ వారసత్వాన్ని నిలబెట్టుకుందాం. ఆదివాసుల హక్కుల కోసం అంకిత భావంతో పోరాడుదాం. 

మిషన్‌ భగీరథ పేరుతో అడవులను నారికేస్తు, రోడ్లను తొవేస్తూన్నారు. అడవులు ధ్వంసమైన ప్రాంతాలో మొక్కల పెంచడానికి ఏ మాత్రం ఇష్టపడని ప్రభుత్వం హారితహారం పేరుతో గిరిజనుల పోడు భూములన లాక్కుంటున్నారు. గిరిజనులకు, అటవీ అధికారుల మధ్య చిచ్చు పెట్టి పైచాచిక ఆనందం పొందుతుంది. ఆదివాసుల అభివ ద్ధి కోసం, ఆదివాసుల గూడెలాలలో కనీస సౌకర్యం అయిన రోడ్లు, విద్యుత్తు, మంచినీటి సౌకార్యల కోసం మాత్రం అనుమతులు లేవని అడ్డకుంటున్నారు. గిరిజ ప్రాంతాలో విద్యుత్‌ కోసం వేయాల్సి స్తంబాలు, రహదారి వంటి కనీస అవసరాల కోసం చేస్తే అడవులను ధ్వంస చేస్తున్నారని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.  ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే బాధితులకు పరిహారం ఇవ్వకపోగా తగిన న్యాయం చేయకుండా, వాళ్ల భూములను లాక్కొని, ఊళ్లను ఖాళీ చేయించి అడవీలో వదిలేస్తున్నారు. అభివ ద్ధి పేరుతో ప్రాజెక్టులు, పవర్‌ ప్లాంట్‌, గనుల స్థానికుల కోసం ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేయించి వాళ్లకు ఎలాంటి పునరావసం చూపించకుండా వారి జీవనోపాధి మీద దెబ్బకొట్టి అడవీలో వదిలేస్తున్నారు. ఊళ్లు ఖాళీ చేయించి, ప్రజలను అడవిలో వదిలేయడమేనా రాష్ట్ర అభివృద్దా!

ప్రాజెక్టులు, పవర్‌ ప్లాంట్లు, గనుల నిర్వాహణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నియంత్రించకుండా,  చెట్లను పెంచకుండా కనీస నిబంధలను పాటించకుండా పర్యవరణాన్ని నాశనం చేస్తున్నారు. యురేనియం  గనుల నిర్వహణ వల్ల వచ్చే  దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతారు.  ఖనిజ అన్వేషణ ప్రతిపాదనకు తెలంగాణ వన్యప్రాణి మండలి, ఆ తర్వాత కేంద్ర సంస్థ కూడా సర్వేకి అనుమతి ఇవ్వాలంటే పూర్తి వివరాలతో ఫారం-సి సమర్పించాలని సూచించింది. అణుశక్తి సంస్థ.. సర్వే కోసమే పర్మిషన్‌ అడుగుతోందంటూ ఫారెస్ట్‌ అధికారులు అప్పట్లో లైట్‌ తీసుకున్నారు. యురేనియం తవ్వకాల వల్ల కలిగే ముప్పు తీవ్రతను ఊహించలేకపోయారు. దీనిపై స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మాత్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై అటవీ శాఖలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.

పోడు భూములపై ప్రభుత్వం రెండు రకాల వైఖరి అవలంబిస్తోంది. గిరిజనుల భూములకు రైతుబంధు, హక్కులు రావాలే. గవర్నమెంట్‌ వచ్చినంక ఆరు నెలల్లో ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తా. 2018 నవంబర్‌ 23న అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి గారు అన్న మాటలివి. ఎన్నికల ఎన్నికలు అయిపోయి అధికారంలో రాగానే... జంగిల్‌ బచావో, జంగిల్‌ బడావో నినాదంతో అధికారులు ముందుకెళ్లాలి. అడవిని కాపాడేందుకు కఠినంగా వ్యవహరించాలి. అంగుళం కూడా ఆక్రమణకు గురి కావొద్దు.  టీఆర్‌ఎస్‌ వాళ్లనయినా వదలొద్దు. పోలీసులు, అటవీశాఖ కలిసి పని చేయాలి. జనవరి 26న ప్రగతిభవన్‌లో ఫారెస్ట్‌ డిపార్టుమెంట్‌ రివ్యూలో సీఎం అన్న మాటలు.

ఓవైపు హక్కులు కల్పిస్తామని గిరిజన రైతులను ఊరిస్తూనే.. మరోవైపు అడవి భూములను సంరక్షించేందుకు ఉక్కుపాదం మోపాలని అటవీ శాఖను ఊసిగోల్పుతున్నారు. దీంతో అటవీ భూములు సాగు చేసుకుంటున్న రెండు లక్షల మంది గిరిజన రైతులు.. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్‌ సిబ్బందిల మధ్య వివాదాలకు దారి తీస్తుంది.  తమకు ఏ రోజైనా హక్కులు వస్తాయన్న ఆశతో  రైతులు దుక్కులు దున్నుతుంటే.. అవే భూముల్లో హరితహారం కింద అటవీ అధికారులు మొక్కలు నాటుతున్నారు. దీంతో అనేకచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. పోడు భూములన్నీ రణ క్షేత్రాలను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో రోజుకోచోట ఘర్షణలు జరుగుతున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల టైంలో పోడు భూముల సమస్య తీరుస్తానని సీఎం కేసీఆర్‌ స్వయంగా హామీ ఇచ్చారు. దీంతో త్వరలోనే తమకు హక్కు పత్రాలు వస్తాయని,  ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు సాయం అందుతుందని ఆశతో ఉన్నారు. కానీ ఇప్పటివరకు హక్కులిచ్చే ప్రతిపాదనలేమీ ప్రభుత్వం తయారు చేయలేదు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనే పోడు భూములపై స్పష్టత ఇవ్వకుండా దాటవేయటం సమస్యను మరింత పెంచింది. మరోవైపు అడవులను స్వాధీనం చేసుకునేందుకు కఠిన వైఖరి అనుసరిస్తుండడంతో రైతులు, ఫారెస్ట్‌ సిబ్బందికి మధ్య చిచ్చు రేగుతోంది. 

2006లో ఉమ్మడి ఏపీలో 1,83,107 మంది దరఖాస్తు చేసుకుంటే 93,494 మందికి పోడు భూములకు అటవీ హక్కు చట్టం ప్రకారం హక్కు పత్రాలు అందించారు. మరో 8,723 అప్లికేషన్లను పెండింగ్‌లో పెట్టారు. వారికి అప్పట్నుంచీ ఇప్పటివరకు హక్కు పత్రాలు ఇవ్వలేదు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించకుండా రైతుల ఆధినంలో ఉన్న 7.36 లక్షల ఎకరాల అటవీ భూములను వాటిని తిరిగి ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పోడు భూముల్లో హరితహారం కింద మొక్కలు నాటాలని ఆదేశించింది. అటవీ భూములు దున్నుకుంటున్న గిరిజన రైతుల ఆశలు పెరిగాయి. గిరిజనులతో పాటు గిరిజనేతరులు అడవులను సేద్యం చేసేందుకు పోటీ పడ్డారు. ఇటీవల ఏటూరు నాగారంలో పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతోనే తాము మొక్కలు నాటుతున్నామంటూ అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు, పోలీస్‌ కేసులు నమోదవుతున్నాయి. అనేకచోట్ల ఫారెస్ట్‌ సిబ్బంది తమ భూములను లాక్కుంటున్నారని తిరగబడేందుకు రైతులు వెనుకాడటం లేదు. 

ఇప్పటికీ కొన్ని జిల్లాలలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూమి హద్దుల పంచాయితీ సమసిపోలేదు. వేలాది మంది రైతులకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇచ్చారు. కానీ అవి చెల్లుబాటు కావని అటవీ శాఖ ఆధికారులు చెబుతున్నారు. ఇప్పుడికీ పహణీలో కాస్తు కాలమ్‌లోరైతుల పేర్లు, పట్టా కాలమ్‌లో ప్రభుత్వ భూమి అని చూపిస్తున్నాయి.  వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని నెల్లికుదురు మండలం నారాయణపురం గ్రామం మొత్తం అడవిలోనే  భూమిలోనే ఉంది. వందేళ్ల కిందట ఈ గ్రామంలోని రైతుల భూమి అంతా అటవీశాఖ పరిధిలోకి వచ్చింది. ఊరి ప్రజలంతా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు.

తాత ముత్తాతల కాలంలో పోడు చేసుకున్న భూమికి ఇప్పటివరకు ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందడం లేదు. కనీసం బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలన్న పాసు బుక్కులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పాసు పుస్తకాలు లేక గిరిజన రైతులు పంట అమ్ముకోలేకపోతున్నారు. పోడు భూముల్లో పంటకు దిగుబడి మంచిగనే వస్తోంది. కానీ హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోలేక పోతున్నారు. తక్కువ ధరకు దళారులకే అమ్మాల్సిన పరిస్థితి. 

 

 

నేడు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle