newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వ హేమ సుందర్ అరెస్ట్

16-07-201916-07-2019 16:43:25 IST
Updated On 16-07-2019 17:20:54 ISTUpdated On 16-07-20192019-07-16T11:13:25.911Z16-07-2019 2019-07-16T11:13:18.161Z - 2019-07-16T11:50:54.035Z - 16-07-2019

అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వ హేమ సుందర్ అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అగ్రిగోల్డ్ కేసులో కొత్త కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థలో డైరెక్టర్ గా వ్యవహరించిన అవ్వ హేమ సుందర వరప్రసాద్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. బినామీ పేర్లతో 7.32 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కొన్నట్లు గుర్తించిన సీఐడీ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా జిల్లాలో పటమట, గుండాల, నూజివీడు, గన్నవరం, కంకిపాడు ప్రాంతాల్లో 7 రకాల స్థిరాస్తులను సీఐడీ గుర్తించింది. అగ్రిగోల్డ్ స్కాంలో వరప్రసాద్ ఏ6 నిందితుడిగా ఉన్నారు. వరప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మెట్రో పొలిటియన్ సెషన్స్ జడ్జ్ ఎదుట హాజరుపరచి.. జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

వరప్రసాద్.. అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ రామారావు సోదరుడు. జనాలను అడ్డంగా ముంచేసిన యాజమాన్యం.. అగ్రి గోల్డ్‌ ఆస్తులను తిరిగి కొట్టేసేందుకు రంగంలోకి దిగింది. ఆస్తులను వేలం వేసి వచ్చే డబ్బుతో బాధితులకు డబ్బు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఆస్తులను ఏదో రకంగా కొట్టేసేందుకు అగ్రి గోల్డ్‌ యాజమాన్యం ప్రయత్నిస్తోంది.

జైలు నుండి బైటకు వచ్చి మరీ.. ఆస్తులను బినామీ పేర్లతో అగ్రిగోల్డ్‌ యాజమానులు అమ్ముకుంటున్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను బినామీ పేర్లతో అమ్ముకుంటున్న.. అగ్రిగోల్డ్‌ జెఎండి అవ్వాజ్‌ హేమ సుందర వర ప్రసాద్‌ ను సిఐడి గుర్తించి అరెస్ట్‌ చేసింది. మరో వైపు.. ఇదే అగ్రిగోల్డ్‌ విలువైన భూములన్నీ తనకు ఇవ్వాలని సిఐడి ముందు.. అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ అవ్వాజ్‌ సీతా రామారావు ప్రపోజల్‌ పెట్టాడు. వీరిద్దరూ బెయిల్‌ పై బయటకు వచ్చిన సోదరులే. బెయిల్‌ పై వచ్చి మళ్లీ ఆస్తులపై హేమ సుందర వర ప్రసాద్‌ కన్నేశాడు.అగ్రి గోల్డ్‌ కేసులో వర ప్రసాద్‌ ఆరో నిందితుడు.

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

గూగుల్ కి షాక్... పోర్న్ వెబ్ సైట్లపై హైకోర్టు ఫైర్

   14 hours ago


మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

మెట్రోలో పాము.. ఎన్ని ట్రిప్పులు తిరిగిందో తెలుసా?

   18 hours ago


వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

వాయుసేన వీరోచిత సేవలకు జనం సెల్యూట్

   19-08-2019


నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

నర్సరీ మేళా.. అరుదైన పూలు, పండ్ల మొక్కలకు కేరాఫ్ అడ్రస్

   19-08-2019


బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

బాలికపై పాశవిక దాడి: గ్రామపెద్దపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు

   17-08-2019


రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

రైతులకు కొండంత అండ... కేఎం ఫామ్స్, బయోసైన్సెస్

   17-08-2019


వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

వర్షంలోనూ వెల్లివిరిసిన దేశభక్తి. వీడియో వైరల్

   16-08-2019


రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

రెండవ వసంతంలోకి న్యూస్ స్టింగ్ .. మీ ఆదరణకు శతసహస్ర ప్రణామాలు!

   16-08-2019


చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

చెరిగిపోని బంధానికి ప్రతీక.. రక్షాబంధన్

   15-08-2019


జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అప్పుడలా..ఇప్పుడిలా?

   14-08-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle