newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

అక్రమంగా ఖైనీ రవాణా.. 18లక్షల విలువైన గుట్కా సీజ్

09-07-202009-07-2020 19:39:55 IST
2020-07-09T14:09:55.351Z09-07-2020 2020-07-09T14:09:44.155Z - - 08-08-2020

అక్రమంగా ఖైనీ రవాణా.. 18లక్షల విలువైన గుట్కా సీజ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో అక్రమ మద్యంతో పాటు గుట్కా, ఖైనీ, నిషేధిత మత్తుపదార్ధాల రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా విజయవాడలో భారీ మొత్తంలో ఖైనీ ప్యాకెట్లు సీజ్ చేశారు పోలీసులు. వీటి విలువ రూ.18 లక్షలు వుంటుందని, దీంతో పాటు సుమారు రూ. పది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఖైనీ అమ్మక దార్లపై ఉక్కుపాదంమోపి ఖైనీ అమ్మకాలను నియంత్రించడానికి విజయవాడ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహించడం జరుగుతోంది. ఈ క్రమంలో భాగంగా ఖైనీ తరలిస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులకు సమాచారం అందింది.

దీంతో టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ కె.వి.శ్రీనివాసరావు,  ఏ.సి.పి.లు టి.కనకరాజు, వి.ఎస్.ఎన్. వర్మ, ఇన్ స్పెక్టర్ పి.కృష్ణమోహన్, ఎస్.ఐలు  కె. సేషారెడ్డి,  జి.శ్రీనివాసరావు మరియు వారి సిబ్బందితో  గురువారం విజయవాడ వై.ఎస్.ఆర్. కాలనీ, వై.వి.రావు ఎస్టేట్స్ రింగ్ సెంటర్ వద్ద ఎపి31టిడి 6237 నెంబరు గల లారీని తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా రోడ్డు మార్గం గుండా హైదరాబాద్ నుండి విజయనగరం జిల్లా కొత్తవలస రవాణా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి సుమారు రూ 18లక్షల విలువైన ఖైనీ, గుట్కా ప్యాకెట్లు, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత ఖైనీ వ్యాపారం చేస్తున్నట్టు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. హైదరాబాద్ నుండి విజయనగరం జిల్లా కొత్తవలసకు లారీలో మైదా పిండి లోడులో వీటిని తరలిస్తూ అధిక లాభార్జన గడిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని కమిషనర్ శ్రీనివాసులు అభినందించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle