newssting
BITING NEWS :
*దిశ ఘటన మరువక ముందే మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి*హైదరాబాద్‌ టీ-20లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన భారత జట్టు *హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలన్న హైకోర్టు... 9న ఉదయం 10.30 గంటలకు విచారణ *కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.*నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: వైకాపా నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి*చింతపల్లిలో దారుణం.. కుక్కలకు బలయిన శిశువు *కర్నూలు: ఉల్లి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన*ఇవాళ జార్ఖండ్ లో రెండవ విడత పోలింగ్ *దిశ నిందితులు కరుడుగట్టిన నేరస్తులు : సీపీ సజ్జనార్

అక్క ప్రమాదంలో ఉందని అస్సలు ఊహించలేదు.. సోదరి వ్యథ

02-12-201902-12-2019 10:31:57 IST
2019-12-02T05:01:57.941Z02-12-2019 2019-12-02T05:01:55.926Z - - 07-12-2019

అక్క ప్రమాదంలో ఉందని అస్సలు ఊహించలేదు.. సోదరి వ్యథ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని ఏమాత్రం ఊహించినా మా అక్కను ఎలాగోలా కాపాడుకుని ఉండేదాన్నని శంషాబాద్ సమీపంలో దారుణ అత్యాచారానికి గురై బలైన వెటర్నరీ డాక్టర్ సోదరి భవ్య తెలిపారు. ''నాకు భయంగా ఉంది పాపా కాస్సేపు మాట్లాడు'' అంటూ అక్క చివరి క్షణాల్లో ఫోన్‌లో మాట్లాడిన మాటలను తాను సీరియస్‌గా పట్టించుకోలేదని, అక్క చెప్పే మాటల్ని చాలా మామూలుగా తీసుకున్నాను కాబట్టే ఆమెను పోగొట్టుకున్నామని భవ్య విచారం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అక్క చిక్కుకుని ఉందో తనకు తెలియలేదని, అలాంటి పరిస్తితుల్లో ఎవరైనా మామూలుగా ఉండటం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోందని భవ్య చెప్పారు.

(ఇకనుంచి మీడియాతో సహా ప్రతి ఒక్కరూ బాధితురాలి పేరును వాడకుండా జస్టిస్ ఫర్ దిశ అనే పిలవాల్సి ఉంటుంది. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ బాధితురాలి కుటుంబాన్ని కూడా ఒప్పించి యావత్ సమాజానికి పిలుపునిచ్చారు.)

ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవ్య.. ఏమరుపాటు వల్లే అక్కను పోగొట్టుకున్నానని తెలిపారు. అక్కను వాళ్లు ఘోరంగా చంపారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఉండకూడదు. అలాంటి పరిస్థితి ఎవరికీ ఎదురు కాకూడదు అని నేను కోరుకుంటున్నా. ఇంత క్రూరమైన ప్రపంచంలో మనం ఉంటున్నామన్న ఊహే ఆ క్షణంలో తట్టలేదు. జరిగిన ఘటన దురదృష్టకరం. ఏదీ తిరిగి రాదు ఇప్పుడు. ఇలా ఎవరికీ జరగకూడదని నేను ఆశిస్తున్నా. అందరూ అన్ని వేళలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఏమీ అవదులే అని ఎప్పుడూ అనుకోవద్దు అని సూచించారు.

సంఘటన జరిగిన రోజు అక్కతో నేను చాలా మామూలుగా మాట్లాడాను. భయపడుతున్నా అని ఆమె చెప్పినప్పటికీ.. నాకు మాత్రం నిజంగా ఆ సీరియస్‌నెస్ తెలియదు. ఆమె చెప్పే మాటల్ని నేను చాలా మామూలుగా తీసుకున్నాను. ఇలా చాలా మందికి జరుగుతుంది. ఇలాంటివి మామూలుగా జరుగుతాయిలే, పట్టించుకోనక్కర్లేదు అనే నిర్లక్ష్యం వదలాలి. ఎందుకంటే, జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం ఏదీ ఊహించలేం. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎంత చిన్న విషయమైనా సరే. తెలిసిన వాళ్లైనా సరే, వారితో కూడా జాగ్రత్తగా ఉండండి అని భవ్య సలహా ఇచ్చారు.

నేను కూడా విషయాలను సీరియస్‌గా తీసుకోను. అలా సీరియస్‌గా తీసుకుని ఉండుంటే మా అక్క ప్రాణం కాపాడి ఉండేదాన్ని. ఎవరినీ నమ్మకండి. తెలిసిన వాళ్లైనా సరే కూడా.. నమ్మకండి. నేను ఇలా చెప్పకూడదేమో. కానీ, బర్త్‌డే పార్టీకని వెళ్లిన అమ్మాయిని కూడా రేప్ చేసి, చంపేశారని నాకు తెలిసింది. ఆ సంఘటనే నాతో ఇలా మాట్లాడిస్తోంది. మీరు జాగ్రత్తగా ఉండండి.. తెలిసిన వాళ్లైనా సరే, వారితో కూడా జాగ్రత్తగా ఉండండి. తర్వాతి క్షణం ఏం జరుగుతుందో మనం ఊహించలేం కదా. పార్టీలైనా, మరొకటైనా రాత్రిపూట మానేయండి. ఒకవేళ రాత్రి సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే.. స్నేహితులకు చెప్పండి. వెళ్లే ముందు ఎవరో ఒకరికి నిజం చెప్పండి. ఎక్కడకి వెళ్తున్నా, ఏం జరుగుతుందో చెప్పండి.

నేను కానీ, అక్క కానీ 100కి కాల్ చేసి ఉండాల్సింది అని అందరూ అంటున్నారు. కానీ ఆ సమయంలో అక్క 100కి కాల్ చేసుండాల్సింది అని నేను అనుకోలేదు. ఎందుకంటే మనమెవరం అటువంటి పరిస్థితుల్లో లేం. తను ఉంది ఆ పరిస్థితుల్లో. తను అప్పటికే చాలా భయపడి ఉంది. కంగారు పడి ఉంది. అభద్రతతో ఉంది. బాధతో ఉంది. అది మాకెవరికీ  తెలీదు. అందుకే ఆ సమయంలో ఆమె 100కి కాల్ చేయాల్సింది అని నేను అనుకోలేదు. కానీ ప్రజలు, ఏదైనా కాస్త తేడా ఉందని అనిపిస్తే.. వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి. ఒకవేళ విషయం ఇంత సీరియస్ అని నాకు తెలిస్తే నేనే ఫోన్ చేసేదాన్ని. కానీ ఆ పరిస్థితి అంత సీరియస్ అని నాకు తెలియదు.

అందుకే ఏమీ జరగదులే అనుకోవద్దు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదీ నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ముఖ్యంగా అమ్మాయిలు బయటకు వెళ్లేప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. కనీసం అందరూ అవగాహన పెంచుకోవాలి. మనకు జరిగే వరకూ ఏం జరుగుతుందిలే, ఏమీ జరగదులే అనుకోవద్దు. ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయి. అవి ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకోండి. బయటకు వెళ్లేప్పుడు స్నేహితులో, బంధువులో ఎవరో ఒకరికి చెప్పాలి. ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లొద్దు. ఇలాంటివి చేయవద్దు. ఇలాంటివి మళ్లీ జరగకుండా ప్రభుత్వం ఇంకా కఠిన నిబంధనలు తేవాలి. అని భవ్య చెప్పారు

నా జీవితంలో ఒక దారుణ ప్రమాదం జరిగితే, దాన్నుంచి సమాజం ఏం నేర్చుకోవాలో మీడియా చెప్పాలి. వాస్తవంగా ఏం జరిగిందో మీడియా చెప్పాలి. అంతేగానీ భావోద్వేగపూరితం చేయడం కాదు. అది సరికాదని నాకు అనిపించింది. ఇలాంటి ప్రశ్నల్ని కొందరు నన్ను అడిగినప్పుడు నాకు చాలా బాధేసింది. మీడియా అడగాల్సింది మా ఆత్మీయత గురించి కాదు. జరిగిన దారుణ ఘటన గురించి, దారి తీసిన పరిస్థితులు, కారణాలు చెప్పాలి. దాన్ని బాగా భావోద్వేగపూరితం చేయకూడదు. దానికి ఏం చేయాలి, దాని నుంచి సమాజం ఏం నేర్చుకోవాలో చెప్పాలి. అంతేకానీ, నాకూ మా అక్కకూ ఉన్న ఆత్మీయత గురించి కాదు మాట్లాడాల్సింది అని బాధితురాలి సోదరి భవ్య సూటిగా తన అభిప్రాయాలు చెప్పారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle