MIUI 11... ఫీచర్లు అదిరాయ్!
17-10-201917-10-2019 10:37:44 IST
2019-10-17T05:07:44.645Z17-10-2019 2019-10-17T05:07:36.219Z - - 17-04-2021

షావోమీ తన యూఐలో మార్పులు చేసి కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. రెడ్ మీ నోట్ 8 సిరీస్ మొబైల్స్ తోపాటు వీటిని కూడా మన దేశంలోకి తీసుకొచ్చింది. గతానికి భిన్నంగా లైట్ గా మార్చి .. అదనపు సౌకర్యాల్ని అందించింది. ఆ ఫీచర్లు ఇవిగో!
* నోట్స్ యాప్‌లో టాస్క్ ఎంటర్ చేయడానికి ఇకపై హోం పేజీ టాప్‌లో ఎడమవైపు నుంచి కుడివైపునకు స్వైప్ చేస్తే సరి. మీరు గతంలో రాసిన నోట్స్కనిపిస్తాయి. అలాగే కొత్తగా అక్కడి నుంచే యాడ్ చేసుకోవచ్చు.
* నోట్స్, పీడీఎఫ్, వర్డ్, ఎక్సెల్ షీట్లను వాడుతూ... కాలెక్యులేటర్లో కౌంట్ వేయాలంటే ఇప్పుడు చాలా సులభం. పిక్చర్ ఇన్ పిక్చర్ ఆప్షన్ ద్వారా క్యాలెక్యులేటర్ ఏ డాక్యుమెంట్లోనైనా పక్కన కనిపించేలా వాడుకోవచ్చు.
* వీడియో చూస్తున్నప్పుడు మెసేజ్, వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ లాంటి వాటికి ఏదైనా మెసేజ్ వచ్చిందనుకోండి... ఆ నోటిఫికేషన్‌ను క్లిక్ చేయగానే వీడియో ఆగిపోతుంది. కొత్త వెర్షన్లో స్క్రీన్ మీద పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ ద్వారా ఆ మెసేజ్ అక్కడే ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు వీడియో చూస్తేనే రిప్లై ఇవ్వొచ్చు. గేమ్స్ కూడా దీనిని వాడుకోవచ్చు.
* ఆల్వేస్ ఆన్ డిస్ప్లేను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. మీకు నచ్చినట్లుగా మార్చుకునేలా డైనమిక్ క్లాక్ ఆప్షన్‌ను తెచ్చారు. లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ కూడా ఇస్తున్నారు. దీని సాయంతో మీకు నచ్చిన టెక్స్ట్ లేదా కోట్‌ను స్క్రీన్ సేవర్‌గా పెట్టుకోవచ్చు.
* నోటిఫికేషన్ వచ్చేటప్పుడు కనిపించే లైట్‌ను మార్పు చేశారు. ఇకపై నోటిఫికేషన్ వస్తే స్క్రీన్ అంచుల్లో ఓ మెరుపులా లైటింగ్ వస్తుంది.
* మీరు రోజుకు ఎంత సేపు నడిచారు, ఎన్ని అడుగులు వేశారనేది లెక్క తెలుసుకోవడానికి ఇకపై వేరే యాప్ ఇన్స్టాల్ చేయక్కర్లేదు. మొబైల్లోనే డీఫాల్ట్‌గా ఆ ఆప్షన్‌ను తీసుకొస్తున్నారు.
* మహిళల కోసం ఓ ప్రత్యేక ఆప్షన్ తీసుకొచ్చారు. మెనుస్ట్రువల్ సైకిల్స్ లెక్కించుకునేలా మొబైల్లో ఓ ఫీచర్ తెచ్చారు. ఆ లెక్కల్నిక్యాలెండర్ యాప్‌తో అనుసంధానిస్తున్నారు.
* బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం డైనమిక్ వాల్ పేపర్స్ తీసుకొచ్చారు. దీంతోపాటు చిన్నాపాటి వీడియోలను కూడా వాల్ పేపర్లుగా పెట్టుకునే ఆప్షన్ తెచ్చారు.
* ప్రస్తుతం షావోమీ మొబైల్స్‌లో డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే అది వేరే యాప్‌లో ఓపెన్ అవుతుంది. ఇకపై మీరు ఓపెన్ చేసే డాక్యుమెంట్ ఫైల్ మేనేజర్లోనే ఓపెన్ అవుతుంది. కాబట్టి పీడీఎఫ్, వర్డ్ లాంటివి చూడటానికి వేరే యాప్ అవసరం లేదు. డబ్ల్యూపీఎస్ సహకారంలో ఈ ఆప్షన్ తెచ్చారు.
* గేమ్ ఆడుతున్నప్పుడు ఏదైనా కాల్ వచ్చి అటెండ్ చేస్తే గేమ్ ఆగిపోతుంది. ఇకపై ఎంఐయూఐ 11 లో అలా ఆగదు. గేమ్ రన్ అవుతూనే పైన చిన్న బాక్స్ రూపంలో కాల్ బటన్ కనిపిస్తుంది. అలా గేమ్ ఆగకుండానే మీరు కాల్ మాట్లాడొచ్చు. దీనినే వీడియోలు చూసేటప్పుడూ వాడుకోవచ్చు.
వీటితోపాటు న్యూ గేమ్ టర్బో, ఎంఐ షేర్, నేచురల్సౌండ్, వైర్లెస్ ప్రింట్, గ్యాలరీ మంథ్ వ్యూ, పంచాంగం, కాస్టింగ్, డ్యూయల్ క్లాక్, నేచర్ అలారమ్ లాంటి ఫీచర్లు కూడా తీసుకొచ్చారు. వీటిని త్వరలో సోషల్ మీడియా ద్వారా వివరిస్తారట.




గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా