newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

Airtel వినియోగదారులకు శుభవార్త..

06-09-202006-09-2020 15:16:37 IST
2020-09-06T09:46:37.859Z06-09-2020 2020-09-06T09:45:32.077Z - - 19-04-2021

Airtel వినియోగదారులకు శుభవార్త..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తన ఖాతాదారులు జియోకు మారకుండా ఉండేందుకు పకడ్బందీ ప్రణాళికలు అల్లుతున్న ఎయిర్ టెల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్‌ శుభవార్త ప్రకటించనుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు అయిన బేసిక్, ఎంటర్‌‌టైన్‌మెంట్, ప్రీమియం, తదితర వాటికి డేటా పరిమితిని తొలగించనుంది. ప్రస్తుతం అన్ని ప్లాన్ల వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్‌ ఇవ్వనుంది. 

అయితే తమ ఖాతాదారులు జియోకు మారకుండా  ఉండే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొబైల్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రూ. 299 అన్‌లిమిటెడ్  డేటా యాడ్ ఆన్ ప్యాక్‌ను తొలగించింది. అయితే అపరిమిత డేటా ప్రయోజనం 3300 జీబీ ఎఫ్‌యూపీ క్యాప్‌తో అందుబాటులోకి రానుంది.

ఎయిర్‌టెల్‌ తాజా ఆఫర్‌కు సంబంధించిన వివరాలు ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌, మై ఎయిర్‌టెల్‌ యాప్‌లో పెట్టనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. కాగా రిలయన్స్‌ జియోతో పోటీని తట్టుకోవడానికి ఈ ఆఫర్‌ ప్రకటించిందని మొబైల్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎయిర్‌టెల్‌ తాజా నిర్ణయంతో తమ వినియోగదారులు జియోకు మారకుండా ఉండేందుకు దోహదం చేస్తుందని ఎయిర్‌టెల్‌ భావిస్తుంది. ఇదివరకే ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్ సర్కిళ్లలో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై అపరిమిత డేటాను అందిస్తున్న విషయం తెలిసిందే.

చిప్స్ కొంటే..2 జీబీ ఉచిత డేటా : ఎయిర్‌టెల్

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఆకట్టుకునేందుకు, ఉచిత ఇంటర్నెట్ డేటాను అందించేలా కొత్త మార్గాలతో వస్తోంది. తాజాగా లేస్ చిప్స్, కుర్ కురే, అంకుల్ చిప్స్ తదితర చిరుతిండి  ప్యాకెట్లు కొంటే ఉచితంగా డేటాను అందిస్తోంది. 10 రూపాయల ప్యాకెట్‌తో 1 జీబీ ఉచిత ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం పెప్సికో ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది

లేస్ చిప్స్, కుర్ కురే, అంకుల్ చిప్స్ డోరిటో ఇతర తినదగిన వస్తువుల ప్యాకెట్ కొనుగోలు చేసిన ప్రతిసారీ వారికి ఉచిత ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. ఈ ఉచిత ఇంటర్నెట్ డేటాను పొందాలంటే  ప్యాకెట్ వెనుక భాగంలో ఉన్న ఉచిత రీఛార్జ్ కోడ్ కోసం వెతకాలి. ఆతరువాత ఈ కోడ్‌ను ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి,ఆపై మైకూపన్‌ల విభాగంలో నమోదు చేయాలి. 

అంటే ఎయిర్‌టెల్ వినియోగదారులు చిప్స్ కొనుగోలు చేసినప్పుడు, ప్యాకెట్ తో పాటు కూపన్‌ను తీసుకోవడం మర్చిపోకూడదు. 10 రూపాయల విలువైన చిప్స్ కొనుగోలు చేస్తే, ఒక జీబీ ఉచితం. అదే  20 రూపాయలు కొనుగోలు చేస్తే, 2 జీబీ ఉచిత ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. అయితే  రీడీమ్ చేసిన తేదీ నుండి మూడు రోజులు మాత్రమే ఈ ఉచిత డేటా చెల్లుతుంది.

వినియోగదారులకు ఉత్తమ నెట్‌వర్క్ అనుభవాన్ని అందించేందుకు పెప్సికో ఇండియాతో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని ఎయిర్‌టెల్  చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశ్వత్ శర్మ తెలిపారు. డిజిటల్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పోకడలను సరిపోలే  కొత్త వ్యూహాలను తాము అభివృద్ధి చేస్తామనీ, ఇందులో భాగంగానే ఎయిర్‌టెల్ తో భాగస్వామ్యం అని  పెప్సికో ఇండియా సీనియర్ డైరెక్టర్  కేటగిరీ హెడ్ ఫుడ్స్ దిలేన్ గాంధీ  తెలిపారు. వినియోగదారులు డిజిటల్ కంటెంట్  చూస్తూ, తమ ఉత్పత్తులను ఎంజాయ్ చేస్తారన్నారు.

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle