+92,+01 నెంబర్ల నుంచి కాల్స్ వస్తే ...జాగ్రత్త !
14-08-202014-08-2020 10:10:40 IST
2020-08-14T04:40:40.452Z14-08-2020 2020-08-14T04:40:24.821Z - - 11-04-2021

ఈరోజుల్లో మోసగాళ్ళు అన్నిచోట్ల పొంచి వున్నారు. చిన్న అవకాశం దొరికితే అందినంత నొక్కేస్తున్నారు. తాజాగా కేంద్ర సైబర్ సెక్యూరిటీ, టెలికాం శాఖ మొబైల్ యూజర్లను అలర్ట్ చేసింది. ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న వేళ వినియోగదారులు అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుంది. మొబైల్ ఫోన్ కాల్ మోసాలు పెరిగిపోవడం, బ్యాంకు అకౌంట్ల నుంచి లక్షల రూపాయలు మాయం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీచేస్తోంది. హోంశాఖకు చెందిన సైబర్‌దోస్ట్ ట్విట్టర్ హ్యాండిల్ సైబర్ సెక్యూరిటీ తాజాగా ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. మోసపూరిత కాల్స్ ఎక్కువగా +92 నెంబర్‌తో ప్రారంభమయ్యే నెంబర్ల నుంచే వస్తున్నాయి. సాధరణ కాల్స్ మాత్రమే కాకుండా వాట్సాప్ కాల్స్ కూడా వస్తున్నాయి. మోసగాళ్లు ఈ కాల్స్ ద్వారా యూజర్లకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఈ నెంబర్ ఒక్కటి మాత్రమే కాకుండా +01 నెంబర్‌తో ప్రారంభమయ్యే కాల్స్ ద్వారా కూడా ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఈ నెంబర్ల నుంచి మీకు కాల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని లిఫ్ట్ చేసి మాట్లాడవద్దని, మీకు తెలియని నెంబర్లు వచ్చిన వాటిని లిఫ్ట్ చేయవద్దని చెబుతోంది. ఎవరైనా ఫోన్ చేసి మీ బ్యాంకు వివరాలు అడిగినా వాటికి సమాధానం ఇవ్వవద్దు. బ్యాంకు సిబ్బంది ఎవరూ మిమ్మల్ని అకౌంట్ వివరాలు, ఓటీపీ, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ అడగరు. ఒకవేళ ఎవరైనా తెలియక ఫోన్ కాల్ మాట్లాడినా ఎలాంటి వివరాలు తెలియజేయవద్దు. ఫోన్ కాల్ చేసిన వారు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, డెబిట్ కార్డు వివరాలను తెలుసుకుంటారు. ఈ వివరాల కోసం మోసగాళ్లు మీకు లాటరీ వచ్చిందని, లక్కీ డ్రాలో విజేతగా నిలిచారని చెబుతారు. అవేం నమ్మవద్దు. అలాగే వివిధ యాప్ లు డౌన్ లోడ్ చేసుకోమని చెబుతారు. అలాంటివి చేయవద్దు. మీ బ్యాంకు అకౌంట్ వివరాలు చెబితే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు మాయం కావడం ఖాయం. అంతేకాకుండా క్యూఆర్ కోడ్ వంటి వాటిని పంపిస్తే వాటిని స్కాన్ చేయొద్దు. మీరు కష్టపడి సంపాదించిన, అవసరానికి దాచుకున్న డబ్బుల్ని పరుల పాలు చేయవద్దు.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా