90 లక్షల వీడియోలు తొలగించిన గూగుల్
18-06-201918-06-2019 14:01:22 IST
2019-06-18T08:31:22.230Z18-06-2019 2019-06-18T08:31:20.327Z - - 12-04-2021

సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిపోయింది. ఫేక్ న్యూస్ కూడా బాగా వ్యాప్తి చెందుతున్న రోజులివి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వీడియోలు చూసే యూట్యూబ్‌లోనూ అభ్యంతరకరమయిన, విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోలు విచ్చలవిడిగా అందుబాటులోకి తెస్తున్నారు కొంతమంది వ్యక్తులు. వీటిని నియంత్రించే వ్యవస్థ సరిగా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో యూట్యూబ్‌లో విద్వేష ప్రసంగాల వీడియోలపై తమ విధానంలో కీలక మార్పులు చేసింది ప్రముఖ సెర్చింజన్ గూగుల్. గడచిన మూడునెలల కాలంలో 90 లక్షలకు పైడా ఈతరహా వీడియోలను తొలగించినట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇప్పటితో తమ పని అయిపోలేదని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని ఆయన అన్నారు. విద్వేషపూరిత, వివాదాస్పద ధోరణితో ఉన్న వీడియోలను తొలగించేందుకు యూట్యూబ్ ప్రయత్నించినప్పటికీ, ఆ వీడియోలు మళ్లీ మళ్లీ కనిపించడంతో ఆందోళన కలిగించిందనే చెప్పాలి. ఇలాంటి విపత్కర పరిస్థితిని చక్కదిద్దేందుకు తమ టీం ఎంతో కష్టపడిందని. వారి కృషి కారణంగా యూట్యూబ్ వాడకంలో మార్పులను తెచ్చామన్నారు. అందుకే విద్వేష పూరిత వీడియోలపై కఠిన వైఖరి అనుసరించాం. దీంతో లక్షలాది వీడియోలు తొలగించగలిగాం అని సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. ఈ విధానం ద్వారా ఒక కాలపరిమితిని నిర్దేశించుకుని ముందుకు సాగుతామని గూగుల్ అధినేత చెప్పారు.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా