newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

7 వేలకే రెడ్ మీ ఫోన్లు..

12-02-202012-02-2020 17:25:14 IST
2020-02-12T11:55:14.502Z12-02-2020 2020-02-12T11:55:09.535Z - - 11-08-2020

7 వేలకే రెడ్ మీ ఫోన్లు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంతకాలం బడ్జెట్ రేట్లలో స్మార్ట్ ఫోన్లు అంటే కనీసం 10 నుంచి 12 వేల రూపాయల వద్ద లభ్యమయ్యేవి. కానీ మొబైల్ తయారీ కంపెనీల మధ్య తీవ్ర పోటీ కారణంగా మధ్యరకం స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. మార్కెట్లో 10 వేలకు తక్కువ కాకుండా దొరికే షావోమీ స్మార్ట్ ఫోన్లు (వీటికో రెడ్ మీ అని పేరు) ఇప్పుడు 7 వేల రూపాయలకే లభ్యమవడం విశేషం. పైగా దీని ఫీచర్లు అన్నీ తక్కువగా మాత్రం లేవు. 

చైనా మొబైల్‌ దిగ్గజం షావోమి మరోసారి బడ్జెట్‌ ధరల ఫోన్లతో భారత మార్కెట్లో సందడి చేస్తోంది. రెడ్‌మి ఏ సిరీస్‌కు కొనసాగింపుగా రెడ్‌మి 8ఏ డ్యూయల్‌ దేశ్‌ కా దమ్‌ దార్‌ స్మార్ట్‌ఫోన్‌ అంటూ మంగళవారం లాంచ్‌ చేసింది. అంతేకాదు మొదటిసారి రెడ్‌మి ఎ సిరీస్‌కు డ్యూయల్ కెమెరాలను జోడించింది. కొత్త ఆరా ఎక్స్‌గ్రిప్ డిజైన్, డ్యూయల్ రియర్ కెమెరాలతో, రెండు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌  ప్రారంభ ధరను రూ. 6499గా నిర్ణయించింది. 

Image result for Redmi 8A Dual, Redmi Power Bank launched in India

దీంతోపాటు రెడ్‌మి 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్, 20,000 ఎంఏహెచ్‌ లను కూడా తీసుకొచ్చింది. వీటి ధరలను వరుసగా రూ .799, రూ .1,499 ధరలతో వినియోగదారులకు  అందిస్తోంది. వైర్‌లెస్‌ ఎంఫ్‌ రేడియో,  పవర్‌ ఫుల్‌  స్పీకర్స్‌  ప్రత్యేక ఆకర్షణగా  రెడ్‌మి వెల్లడించింది. ఎంఐ.కామ్, అమెజాన్, ఎంఐ హోమ్స్‌లో ఫిబ్రవరి 18వ తేదీనుంచి వినియోగదారులకు అందుబాటులో వుంటాయి. 

ధరలు :

  • 2జీబీ ర్యామ్‌ + 32 జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ రూ .6,499 
  • 3జీబీ ర్యామ్‌ + 32 జీబీ  స్టోరేజ్‌ రూ .6,999
  • రెడ్‌మి 8 ఏ డ్యూయల్‌  ఫీచర్లు 
  • 6.2 అంగుళాల  డాట్‌నాచ్‌ డిస్‌ప్లే
  • 1520x720  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 ఆక్టా-కోర్ చిప్‌సెట్
  • 13+2 ఎంపీ రియర్‌ కెమెరా
  • 8 ఎంపీ సెల్పీ కెమెరా
  • 5000 ఎంఏహచ్‌  బ్యాటరీ
  • టైప్-సి పోర్ట్ ద్వారా రివర్స్ ఛార్జింగ్‌
భారత్‌లో తాజాగా విడుదల చేస్తున్న తమ స్మార్ట్ ఫోన్లను, ఇతర ఉత్పత్తులను వినియోగదారులు, అభిమానులు తప్పక ఇష్టపడతారని విశ్వసిస్తున్నామని షావోమి ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుజ్ శర్మ అన్నారు. స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో కనీ వినీ ఎరుగని చౌక ధరలకు తెరతీసిన షావోమీ ప్రముఖ అంతర్జాతీయ మొబైల్ కంపెనీల వాటాను మరింతగా చేజిక్కించుకునే అవకాశాలు కనబడుతున్నాయని మార్కెట్ వర్గాల అభిప్రాయం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle