newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

64 ఎంపీ కెమెరాతో మొదటి మొబైల్‌

14-09-201914-09-2019 09:21:09 IST
2019-09-14T03:51:09.771Z14-09-2019 2019-09-14T03:49:20.866Z - - 22-04-2021

64 ఎంపీ కెమెరాతో మొదటి మొబైల్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బడ్జెట్‌ మొబైల్స్‌ మార్కెట్‌లో షావోమికి పోటీగా దూసుకొస్తోంది రియల్‌మి.  ప్రతి నెలా ఓ కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేస్తూ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్‌ అందుబాటులోకి వచ్చేలా చూస్తోంది. అదే సమయంలో నాణ్యతను కాస్త పక్కనపెట్టి తక్కువ ధరకే అందిస్తోంది. అలా మంచి స్పెషిఫికేషన్లతో ఇటీవల రియల్‌ మి Xను లాంచ్‌ చేసింది.

ఇప్పుడు దానికి సక్సెసర్‌గా రియల్‌మి  XTని  భారత మార్కెట్లో విడుదల చేసింది. 64 ఎంపీ ప్రధాన కెమెరాతో వస్తున్న తొలి ఫోన్‌ ఇదే కావడం గమనార్హం. ఈ ఫోన్‌ ధర, స్పెసిఫికేషన్స్‌పై ఓ లుక్కేద్దాం..

రియల్‌మీ XT మొత్తం మూడు రకాల్లో లభ్యమవుతుంది. 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధర  రూ 15,999. అదే 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ ఉన్న వేరియంట్‌ ధర రూ 16,999. ఇక ఇందులో హైఎండ్‌  8జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరియంట్‌ ధరను రూ 18,999గానూ నిర్ణయించారు.

ఈ మొబైళ్లు పెరల్‌ బ్లూ, పెరల్‌ వైట్‌ రంగుల్లో లభ్యమవుతాయి. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి.కామ్‌ వెబ్‌సైట్లలో సెప్టెంబర్‌ 16 నుంచి ఈ మొబైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రారంభ ఆఫర్ల కింద పేటీఎం యూపీఐ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.రెండు వేలు క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. దీంతోపాటు మొబైల్‌ను కొనుగోలు చేసి తొలి 64 వేల మందికి ఆరు నెలల ఉచిత స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ వారెంటీ లభిస్తుంది. 

మొబైల్‌ ప్రత్యేకతలు ఇవీ... 

ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ మొబైల్‌ పని చేస్తుంది. ఇందులో  కలర్ ఓఎస్‌ 6.0 ఉంటుంది. మొబైల్‌లో 6.4 ఇంచీల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ స్క్రీన్‌ ఉంటుంది. ఇది  సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే. 

మొబైల్‌ను తొలిసారిగా ముందువెనుకవైపు  గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఉంది. మొబైల్‌ స్నాప్‌డ్రాగన్‌ 712 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో వెనుకవైపు 64ఎంపీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ‘అల్ట్రా 64 ఎంపీ’తో ఫుల్‌ రిజల్యూషన్‌లో ఫొటోలు తీసే సౌలభ్యం ఉంది. 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరాతోపాటు మరో రెండు 2 ఎంపీ కెమెరాలు ఉంటాయి. 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్‌ 3.0 సపోర్ట్‌ చేస్తుంది. 

ఈ మొబైల్‌తోపాటు 10000 ఎంఏహెచ్‌ పవర్‌ బ్యాంక్‌, ఓ బ్లూటూత్‌ వైర్‌లెస్‌ బడ్స్‌ను కూడా రియల్‌మీ విడుదల చేసింది. పవర్‌ బ్యాంక్‌ ధర రూ. 1299.  ఇయర్‌ బడ్స్‌ రూ.1799గా నిర్ణయించారు.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   7 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle