newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో... సూపర్‌ ఆమోలెడ్‌ అందం

18-09-201918-09-2019 15:48:07 IST
Updated On 18-09-2019 15:48:43 ISTUpdated On 18-09-20192019-09-18T10:18:07.892Z18-09-2019 2019-09-18T10:18:05.517Z - 2019-09-18T10:18:43.036Z - 18-09-2019

6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో...  సూపర్‌ ఆమోలెడ్‌ అందం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏదైనా నేను దిగనంత వరకే.. వన్స్‌ ఐ స్టెప్‌ఇన్‌.. హిస్టరీ రిపీట్స్‌...

అదేదో సినిమాలో హీరో చెప్పినట్లు.. శాంసంగ్‌ ఇప్పుడు అదే పనిలో ఉంది. బడ్జెట్‌ ధరలో బడ్జెట్‌లో ఫోన్ల విభాగంలోకి శాంసంగ్‌ ఏ ముహూర్తాన దిగిందో కానీ... వరుస మొబైళ్లతో హోరెత్తిస్తోంది. ఈ జోరులో మరో మొబైల్‌ను లాంచ్‌ చేసింది. అదే శాంసంగ్‌ గెలాక్సీ M30s. 4000 ఎంఏహెచ్‌, 5000 ఎంఏహెచ్‌ అంటూ మొబైళ్లు క్యూ కడుతున్న రోజుల్లో ఈ మొబైల్‌ ఏకంగా 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వచ్చింది. అంతేకాదు ఇందులో సూపర్‌ ఆమెలెడ్‌ డిస్‌ప్లే కూడా ఉంటుంది. శాంసంగ్ ఈ మొబైల్‌తోపాటు శాంసంగ్‌ గెలాక్సీ M10sను కూడా లాంచ్‌ చేసింది. 

శాంసంగ్‌ గెలాక్సీ ఎం30ఎస్‌ ప్రత్యేకతలివీ...

ఈ మొబైల్‌లో 6.4 అంగుళాల ఇన్ఫినిటీ ‘యు’ డిస్‌ప్లే ఉంటుంది. సూపర్‌ ఆమోలెడ్‌ ప్యానల్‌ ఉన్న ఈ మొబైల్‌ వైడ్‌వైన్‌ ఎల్‌1ను సపోర్ట్‌ చేస్తుంది. అంటే నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ లాంటి వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసులను హెచ్‌డీలో చూడొచ్చు. శాంసంగ్‌ కొత్త యూజర్‌ ఇంటర్ఫేస్‌ ‘వన్‌ యూఐ’తో ఈ మొబైల్‌ పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆధారంగా ఈ మొబైల్‌ పని చేస్తుంది. ఇందులో వెనుకవైపు మూడు కెమెరాలు ఉంటాయి. 48 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 5 ఎంపీ డెప్త్‌సెన్సర్‌ ఉంటాయి. ఇందులో ఎక్సినోస్‌ 9611 ప్రాసెసర్‌, ఏఆర్‌ఎం మాలి జీ72 ఎంపీ3 జీపీయు ఉంటుంది. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ  వెర్షన్‌ ధర రూ.13,999. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ధర రూ.16,999. 256 జీబీ ఇంటర్నల్‌ మెమొరీతో మరో వెర్షన్‌ కూడా ఉంది. అయితే దాని ధర ప్రకటించలేదు. అమెజాన్‌, శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో ఈ నెల 29 నుంచి ఈ మొబైళ్లు అందుబాటులో ఉంటాయి. 

శాంసంగ్‌ గెలాక్సీ ఎం10ఎస్‌ స్పెసిఫికేషన్లు...

ఆశ్చర్యకరంగా ఎం10ఎస్‌లోనూ శాంసంగ్‌ సూపర్‌ ఆమెలెడ్‌ డిస్‌ప్లేని తీసుకొచ్చింది. రూ.10 వేలలోపు ధరలో ఈ తరహా డిస్‌ప్లే ఉన్న మొదటి మొబైల్‌ ఇదేనని శాంసంగ్‌ చెబుతోంది. ఈ మొబైల్‌లో 6.4 ఇంచ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఈ మొబైల్‌ ఎక్సినోస్‌ 7884B ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇందులో 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఎం10ఎస్‌ 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేసింది. వెనుకవైపు 13 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 5 ఎంపీ అల్ట్రా వైట్‌ యాంగిల్‌ సెన్సర్‌ ఉంటుంది. 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్‌ ధర రూ.8,999. ఈ మొబైల్‌ కూడా సెప్టెంబరు 29 నుంచి అమ్మకాలు నిర్వహిస్తారు. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle