newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

5జీ స్మార్ట్‌ఫోన్‌ను ముందు ఎవరు తీసుకొస్తారో?

11-09-201911-09-2019 17:49:33 IST
2019-09-11T12:19:33.178Z11-09-2019 2019-09-11T12:07:02.421Z - - 17-04-2021

5జీ స్మార్ట్‌ఫోన్‌ను ముందు ఎవరు తీసుకొస్తారో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
4 జీ యుగం చివరి దశకు వచ్చేసింది. ఇక రాబోయే రోజులన్నీ 5 జీ వే. అందుకే స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు 5 జీ మొబైల్స్‌పై దృష్టి పెట్టాయి. ఫ్లాగ్‌షిప్‌ మొబైల్‌ కంపెనీలతోపాటు కొత్త సంస్థలు కూడా 5జీ మొబైల్స్‌ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బడ్జెట్‌ మొబైల్స్‌ విభాగంలో కొత్త సంచలనం రియల్‌ మి కూడా 5జీ ఫోన్లు తెచ్చేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ మొబైల్స్‌ గురించి కొంత సమాచారం బయటకు వచ్చింది.

రియల్‌ మి 5 జీ మొబైళ్లు స్నాప్‌డ్రాగన్‌ 7 సిరీస్‌ ప్రాసెసర్లతో రన్‌ అవుతాయి. దీనికి తగ్గట్టుగా ఆయా ప్రాసెసర్లను సిద్ధం చేశారు. త్వరలో జరగనున్న IFA 2019 ఎగ్జిబిషన్లో వీటిని ఆవిష్కరిస్తారని సమాచారం. ఇప్పటికే ఈ చిప్‌సెట్లను మొబైల్స్‌ తయారు చేసే OEMలకు అందజేశారట. ఈ మొబైల్స్‌లో కొత్త తరం ఆర్టిఫిషియల్‌ ఇంజిన్‌, సరికొత్త గేమింగ్‌ అనుభూతి ఉంటుందని రియల్‌మి చెబుతోంది.

రియల్‌మి ఇండియా సీఈఓ మాధవ్‌ సేథ్‌ ‘ఈ ఏడాదిలో కచ్చితంగా భారత్‌కు 5 జీ ఫోన్‌ తీసుకొస్తాం’ అమని ఇదివరకే చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం 5జీ సేవలు స్నాప్‌డ్రాగన్‌ 8 సిరీస్‌ ప్రాసెసర్లకే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి  7 సిరీస్‌ ప్రాసెసర్లకు కూడా ఎంత త్వరగా 5జీ కంపాటబిలిటీ తీసుకొచ్చి... విడుదల చేస్తారేమో చూడాలి. మరోవైపు మేం కూడా 5 జీ ఫోన్లు తీసుకొస్తామంటూ మోటొకోలా, ఎల్‌జీ, నోకియా, రెడ్‌మి కూడా ప్రకటించాయి. వచ్చే ఏడాది తీసుకొస్తామని నోకియా చెబితే... రెడ్‌మి K30 సిరీస్‌తో 5జీ అందుబాటులోకి తెస్తామని రెడ్‌మి చెప్పింది.  ఎవరు ముందు వస్తారో చూడాలి.

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle