newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

5జీ మొన్నే వచ్చింది... 6జీ ఆలోచన మొదలైంది

09-11-201909-11-2019 11:24:45 IST
2019-11-09T05:54:45.056Z09-11-2019 2019-11-09T04:39:52.721Z - - 12-04-2021

5జీ మొన్నే వచ్చింది... 6జీ ఆలోచన మొదలైంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనదేశంలో ఇంకా 4జీ మొత్తంగా విస్తరించలేదు. పక్క దేశం చైనా 5జీని తీసుకొచ్చేసింది. మనకు వచ్చే సంవత్సరం వస్తుందంటున్నారు కానీ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ వచ్చినా ఏ ప్రధాన నగరాల్లో మాత్రమే తొలుత తీసుకొస్తారు. దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడానికి ఏళ్లు పట్టే అవకాశం ఉంది.

ఈ క్రమంలో చైనా దూకుడు చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఎందుకంటే 5జీ లాంచ్‌ చేసిన వెంటనే 6జీ పై ప్రయోగాలు చేయడానికి సిద్ధమైపోయింది. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యయాట. వేగవంతమైన మొబైల్‌ డేటాను యూజర్లకు అందించడంలో చైనా ముందుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల 5జీ సేవలను ప్రారంభించింది.

ఇప్పుడు తర్వాతి తరం నెట్‌వర్క్‌ 6జీపై అప్పుడే దృష్టిపెట్టింది.  చైనా 6 జీ టెక్నాలజీ అభివృద్ధికి పరిశోధనలు ప్రారంభించిందని చైనా టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారట. 6జీ అభివృద్ధి పరిశోధనకు రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సరికొత్త వైర్‌లెస్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు జరుగుతాయని చైనా చెబుతోంది. 

‘‘6 జీకి సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి.  త్వరలో పరిశోధనలు ప్రారంభమవుతాయి. సాంకేతికతపరంగా ఆనుసరించాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉన్నాం’’ అని చైనా సైన్స్ అండ్‌ టెక్నాలజీ మంత్రి వాంగ్‌ షీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు 5జీ సాంకేతికతను అందిపుచ్చుకునే పనిలో ఉండగా.. చైనా అప్పుడే 6జీ పరిశోధనలకు రంగం సిద్ధం చేయడం విశేషం. 4జీతో పోలిస్తే డేటా వేగం 5జీలో కనీసం 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఆగ్యుమెంటడ్‌ రియాలిటీ వంటి కొత్త టెక్నాలజీలకు 5జీ ఎంతో ఉపకరిస్తుంది. మరి 6జీ ఇంకెలా ఉంటుందో చూడాలి. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle