newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

5జీ నెట్‌వర్క్ సపోర్ట్‌తో తొలి స్మార్ట్‌ఫోన్

09-10-201809-10-2018 15:06:15 IST
Updated On 09-10-2018 15:06:15 ISTUpdated On 09-10-20182018-10-09T09:36:15.753Z09-10-2018 2018-10-09T09:36:15.753Z - 2018-10-09T09:36:15.787Z - 09-10-2018

5జీ నెట్‌వర్క్ సపోర్ట్‌తో తొలి స్మార్ట్‌ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెక్నాలజీ రంగంలో అత్యంత వాయువేగంగా వృద్ధి చెందుతున్న విభాగం ఏదైనా ఉందంటే... అది మొబైల్ రంగమే! స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయినప్పటి నుంచి వినియోగదారుల్ని ఆకర్షించడం కోసం కొత్తకొత్త ఫీచర్స్‌తో సరికొత్త ఫోన్లను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా 4G ఫోన్ల హవానే! ఈ ట్రెండ్‌లో మొబైల్ సంస్థలు ఒకదానికి మించి మరొక ఫీచర్లతో నమ్మశక్యంకాని ఫోన్లను తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా వీటన్నింటికీ షాకిస్తూ లెనోవా అనుబంధ సంస్థ మోటోరోలా మరో అడుగు ముందుకేసి... ఏకంగా 5జీ నెట్‌వర్క్ సపోర్ట్‌తో తొలి స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. చికాగో మోటో జెడ్ పేరిటన విడుదలైన ఈ ఫోన్‌ను 5జీ నెట్‌వర్క్‌కి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం వుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌‌‌సెట్‌ ప్రాసెసర్‌ను ఈ ఫోన్ కలిగివుంటుంది. అలాగే... వినియోగదార్లకు కావాల్సిన అద్భుతమైన ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. 2 TB వరకూ మొమెరీ కార్డు పెంచుకునే సౌకర్యం కలిగిన ఈ ఫోన్ వెనుక భాగంలో రెండు 12 /12 మెగాపిక్సల్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. అలాగే ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1080x2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, టర్బో పవర్ సపోర్ట్‌తో కూడిన 3000ఎంఏహెచ్ బ్యాటరీని ఇది కలిగివుంటుంది. ఈ ఫోన్ ధర మనదేశంలో దాదాపు రూ.33వేల వరకు వుంటుందని సంస్థ వెల్లడించింది. భారత్ మార్కెట్లోకి ఈ ఫోన్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle