newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

5జీతో సమస్తం మారిపోతాయా?

30-05-201930-05-2019 15:36:22 IST
2019-05-30T10:06:22.327Z30-05-2019 2019-05-30T10:05:52.485Z - - 23-04-2021

5జీతో సమస్తం మారిపోతాయా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2జీ.. 3జీ.. 4జీ. ఇప్పుడు 5 జీ టెక్నాలజీ కూడా వచ్చేసింది. ఒకప్పుడు టెలిఫోన్ కనెక్టివిటీ లేని ప్రాంతాలు ఇప్పుడు 4జీ స్థాయికి చేరాయి. గ్రామాలు 2జీ నుంచి 3జీకి అప్‌డేట్ అయ్యాయి. నగరాల్లో 3జీ నుంచి 4జీలోకి మారిపోతున్నాయి. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 5జీ చర్చ నడుస్తోంది. 2035 నాటికి దీనివల్ల 12 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు నిపుణులు. సూపర్‌ఫాస్ట్ 5జీ మొబైల్ ఇంటర్నెట్ వచ్చే ఏడాది రంగంలోకి దిగబోతోంది. అది ఇప్పుడున్న డౌన్‌లోడ్ స్పీడ్ కన్నా 10, 20 రెట్లు అధికంగా ఉంటుందని చెప్తున్నారు. 5జీ ఇండియాని ఎలా మార్చేయబోతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2030 నాటికి 125 బిలియన్ డివైజ్‌లు హై స్పీడ్ నెట్‌కు కనెక్ట్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల మీరు దేశంలో ఎక్కడ వున్నా.. ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఇంట్లోని కంప్యూటర్‌ను, ఏసీని, ఇతర డివైజెస్ కూర్చుని నియంత్రించవచ్చు.

మీరు మాట్లాడితే చాలు సూపర్ మార్కెట్ల నుంచి సామాన్లు మీ ఇంటికి వచ్చేస్తాయి. మీరు డ్రైవ్ చేయాలంటే మంచి డ్రైవర్ కావాలి. మనదేశంలో నిపుణులైన డైవర్లకు కొరత ఉంది. అదే 5జీ టెక్నాలజీ అందుబాటులో వస్తే మాత్రం డ్రైవర్ లెస్ కార్లకు గిరాకీ పెరిగిపోతుంది. అలాగే రెప్పపాటు వ్యవధిలో డేటాను ప్రాసెస్ చేసి తక్షణ నిర్ణయాన్ని సదరు వెహికల్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కమర్షియల్‌గా డ్రైవర్ లెస్ కార్లను చూడలేకపోతున్నాం. రాబోయే రోజుల్లో కార్లు, ట్రక్కులు, ట్రాక్టర్లు, బస్సులు, ట్యాక్సీలు కూడా డ్రైవర్లు లేకుండానే రోడ్లపై పరుగులు తీస్తాయి. 

అలాగే వైద్యం కోసం మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది.  రొటీన్ అకౌంటెంట్ జాబ్స్, క్లరికల్ జాబ్స్‌కు 5జీ చరమగీతం పాడుతుంది. ఫ్యాక్టరీల్లో కూడా ఆటోమేషన్ పెరిగిపోతుంది. మనుషుల కంటే టెక్నాలజీని నమ్మేందుకే సంస్థలు ఎక్కువగా మొగ్గుచూపిస్తాయి. ఎందుకంటే ప్రొడక్టివిటీ పెంచుకునేందుకు ఇవి ఎక్కువగా దోహదపడతాయి. అలా కాని పక్షంలో రియల్ టైం డేటాను ఎనలైజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి.. స్మార్ట్‌గా, వేగంగా పనిచేసే వాళ్లకే ఫ్యూచర్ ఎక్కువ.

మరోవైపు వివిధ ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్ పెరిగి జనం అవసరం తగ్గిపోతుంది. వివిధ కంపెనీలు ప్రొడక్టివిటీ పెంచుకునేందుకు వీటిపై ఆధారపడతాయి. మొత్తం మీద 5జీ టెక్నాలజీ వల్ల దేశం స్వరూపమే మారిపోతుంది. సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవాలంటే నిముషాలు చాలు. 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   a day ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle