newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

17న నుబియా కొత్త గేమింగ్‌ ఫోన్‌.. ధర 40K లోపే

15-10-201915-10-2019 16:35:56 IST
2019-10-15T11:05:56.866Z15-10-2019 2019-10-15T11:05:46.569Z - - 23-04-2021

17న నుబియా కొత్త గేమింగ్‌ ఫోన్‌.. ధర 40K  లోపే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం ఇండియాలో గేమింగ్‌ ఫోన్లకు మంచి డిమాండ్‌ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గేమింగ్‌ ఫోన్ల తయారీ సంస్థలు భారత మార్కెట్‌ లోకి వరుసగా గేమింగ్‌ ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఆసుస్‌ ఇటీవల ఆర్‌వోజీ సిరీస్‌లో మొబైల్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు నుబియా వంతు వచ్చింది. నుబియా నుంచి వచ్చిన సక్సెస్‌ అయిన రెడ్‌ మ్యాజిక్‌ సిరీస్‌లో మరో మొబైల్‌ను లాంచ్‌ చేయబోతోంది. ఈ నెల 17న ఈ మొబైల్‌ మన మార్కెట్‌ లోకి తీసుకురానుంది. 

నుబియా ఈ ఏడాది జూన్‌లో రెడ్‌ మ్యాజిక్‌ 3 పేరుతో ఒక మొబైల్‌ను  లాంచ్‌ చేసింది.  ఇప్పుడు దానికి కొనసాగింపుగా కొన్ని మార్పులు చేసి రెడ్‌ మ్యాజిక్‌ 3 ఎస్‌ను తీసుకురాబోతోంది. కొత్త మొబైల్‌లో క్వాల్‌కోమ్‌ సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్లస్‌ ఉంటుందని తెలుస్తోంది. 8 జీబీ, 12 జీబీ ర్యామ్‌తో రెండు వెర్షన్లు రావొచ్చు. యూఎఫ్‌ఎస్‌ 3.0 సాంకేతికత ఉన్న 256 జీబీ అంతర్గత మెమొరీ ఉంటుంది. దీంతోపాటు గేమింగ్‌లో సరికొత్త అనుభూతి కోసం దీనిలో సరికొత్త యాక్టివ్‌ కూలింగ్‌ సిస్టం కూడా తీసుకొస్తున్నారు. 

ఈ మొబైల్‌లో 6.65 అంగుళాల అమోలెడ్‌ హెచ్‌డి+ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో పని చేస్తుంది. ముందువైపు రెండు స్టీరియో స్పీకర్స్‌ ఉంటాయి. దీంతోపాటు వెనుకవైపు రెండు కెమెరాలున్నాయి. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వెనుకవైపు ఉండే ప్రధానమైన కెమెరా  48 మెగాపిక్సెల్‌ కెమెరాతో హెచ్‌డిఆర్‌ వీడియోలను రికార్డ్‌ చేయొచ్చు. 8కే వీడియోలను కూడా రికార్డ్‌ చేయొచ్చట.

ఈ మొబైల్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వెనకవైపున గేమింగ్‌ కోసం రెండు బటన్స్‌ ఉన్నాయి. దీని ధర: రూ. 40,000. ఫ్లిప్‌  కార్ట్‌  ద్వారా ఈ ఫోన్‌ సేల్‌ నిర్వహిస్తారు. 

Nubia Red Magic 3S to Launch in India on October 17, Will Be Available Exclusively via Flipkart

 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle