120 Hz రిఫ్రెష్ రేట్‌తో ఐఫోన్ 2020
29-10-201929-10-2019 09:58:15 IST
2019-10-29T04:28:15.359Z29-10-2019 2019-10-29T04:28:13.255Z - - 15-04-2021

ఫ్లాగ్షిప్ ఫోన్స్‌లో ఇప్పుడు రిఫ్రెష్‌రేట్ యుద్ధం జరుగుతోంది. వన్ ప్లస్ 7 ప్రో వచ్చిన తర్వాత ఇప్పుడు ఫీచర్ల పోలికల్లోకి రిఫ్రెష్ రేటు వచ్చింది. ఆ మొబైల్‌ను 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో తీసుకొచ్చారు. ఎంత రిఫ్రెష్ రేటు ఎక్కువుంటే మొబైల్ అంత స్మూత్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఆసుస్ కూడా ఈ వార్‌లోకి దిగింది. ఇప్పుడు ఐఫోన్స్ కూడా రిఫ్రెష్ రేటు నామ జపం చేస్తున్నాయా... తాజా లీక్‌ల ప్రకారం చూస్తే అదే అనిపిస్తోంది. వచ్చే ఏడాది వచ్చే కొత్త తరం ఐఫోన్లలో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేటు ఉండబోతోందని సమాచారం. దీనికి సంబంధించి అంతర్జాతీయ టెక్ వర్గాల్లో కొంత సమాచారం లభించింది.
ఐఫోన్ 2020 మోడళ్ల కోసం ఆపిల్ ఇప్పటికే OLED ప్యానళ్లను ఆర్డర్ పెట్టిందట. అవి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేటు ఉంటాయట. రెండేళ్ల క్రితం వచ్చిన ఆపిల్ ప్రో మోషన్ ఐప్యాడ్ ప్రోలో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేటు ఉన్న డిస్ప్లే ఉంది. ఇది చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇప్పటివరకు ఆపిల్ నుంచి వచ్చిన డిస్ప్లేల్లో ఇది బెస్ట్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి అనుభూతి కోసమే ఐఫోన్స్‌కు ఆ డిస్ప్లే తీసుకొస్తున్నారని సమాచారం.
అన్నీ అనుకున్నట్లు జరిగి ఐఫోన్స్ కి తీసుకొస్తే ఇదే తొలిసారి అవుతుంది. అన్నట్లు గేమింగ్ ఫోన్‌గా వచ్చిన ఆసుస్ ఆర్వోజీ ఫోన్ 2లో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ఉంది. ఇటీవల విడుదలైన పిక్సెన్ 4, వన్‌ప్లస్ 7టిలో 90 హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో డిస్ప్లే తీసుకొచ్చారు.
ఇప్పటివరకు యాపిల్ నుంచి వచ్చిన మొబైల్స్ అన్నీ 60 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలతోనే వచ్చాయి. త్వరలో 5జీ ఫోన్లు రానున్న తరుణంలో రిఫ్రెష్ రేటు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నెట్వర్క్ వేగం పెరినప్పుడు మొబైల్ వేగం తక్కువగా ఉంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అంతగా బాగుండదనేది వారి అభిప్రాయం.
మరోవైపు యాపిల్ స్క్రీన్ రిఫ్రెష్ రేటు విషయంలో కాకుండా డిజైన్ విభాగంలోనూ కొత్త మొబైల్స్‌లో మార్పులు చేస్తోందని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఐఫోన్ 4లో ఉన్న మెటల్ ఫ్రేమ్ డిజైన్‌ను 2020 ఐఫోన్లలో తీసుకొస్తారు. ఐఫోన్ 8 స్టైల్లో ఈ మెటల్ ఫ్రేమ్ కొత్తగా ఉండబోతోందని చెబుతున్నారు. దీంతోపాటు వీటిలో 5జీ నెట్వర్క్ ఉంటుందని కొత్తగా చెప్పక్కర్లేదు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా