newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

11 అంకెలతో ఇక మొబైల్ నెంబర్లు.. ట్రాయ్ ఐడియా

30-05-202030-05-2020 18:23:25 IST
2020-05-30T12:53:25.626Z30-05-2020 2020-05-30T12:53:11.783Z - - 23-04-2021

11 అంకెలతో ఇక మొబైల్ నెంబర్లు.. ట్రాయ్ ఐడియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనదేశంలో మొబైల్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ల కొనుగోలు, డేటా వినియోగంలోనూ వృద్ధి భారీగా కనిపిస్తోంది. ఇకపై దేశంలో 11 అంకెలతో కూడిన మొబైల్  నంబర్లు వుండబోతున్నాయి. మొబైల్‌ నంబర్ల విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) కీలక ప్రతిపాదనలు చేసింది. దేశంలో 11 అంకెల మొబైల్‌ నంబర్‌ను వినియోగించాలని ప్రతిపాదించింది. పలువురితో చర్చల అనంతరం కొన్ని సిఫార్సులను శుక్రవారం విడుదల చేసింది.

దేశంలో ప్రస్తుతం 10 అంకెల మొబైల్‌ నంబర్లు ఉన్నాయి. ఇకపై 11 అంకెల మొబైల్‌ నంబర్లను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా కొత్తగా నంబర్ల సంఖ్యను పెంచుకోవచ్చని ట్రాయ్‌ పేర్కొంది. మొబైల్‌ నంబర్లకు ముందు 9 అంకెను కలపడం ద్వారా అవి 11 అవుతాయి. ఫలితంగా టెలికాం ఆపరేటర్లు కొత్తగా మరో 1000 కోట్ల మొబైల్‌ నంబర్లను వాడుకలోకి తీసుకురావచ్చని ట్రాయ్‌ పేర్కొంది.

ఇకపై ల్యాండ్‌లైన్ల నుంచి మొబైల్స్‌కు కాల్‌ చేస్తే వాటి నంబర్ల ముందు సున్నా (0) కలపాలని ట్రాయ్‌ పేర్కొంది. అయితే, ల్యాండ్‌లైన్‌ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్‌ నుంచి ల్యాండ్‌ లైన్‌కు, మొబైల్‌ నుంచి మొబైల్‌కు కాల్స్‌ చేస్తే సున్నా అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం డాంగిల్స్‌కు పదెంకల నంబర్లే ఉన్నాయి. ఇకపై వాటిని 13 అంకెలకు పెంచాలని ట్రాయ్‌ సిఫార్సు చేసింది.

ఇప్పటికే మొబైల్ నెంబర్లు గుర్తుంచుకోవడం కష్టం అవుతుంటే.. మరో నెంబర్ యాడ్ అయితే మరింత కష్టం అవుతుంది. 1 నెంబర్ యాడ్ చేస్తే కోట్లాది నెంబర్లు యాడ్ అవుతాయి. ఇది మొబైల్ కంపెనీలకు పండగ అనే చెప్పాలి. ఏది ఏమైనా మరో నెంబర్ యాడ్ అయితే కొన్నాళ్ళపాటు మొబైల్ నెంబర్లకు ఇబ్బంది ఉండదు. 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   a day ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle