108 ఎంపీ కెమెరాతో షావోమీ నుంచి...
03-10-201903-10-2019 16:31:40 IST
2019-10-03T11:01:40.077Z03-10-2019 2019-10-03T11:01:38.196Z - - 20-04-2021

షావోమీ తన అమ్ములపొది నుంచి మరో ఆసక్తికరమైన మొబైల్ ను తీసుకొస్తోంది. 108 మెగాపిక్సల్ కెమెరాతో ఈ మొబైల్ రాబోతోంది. ఈ ఏడాది జూన్ లో షావోమీ చైనాలో సీసీ సిరీస్ మొబైల్ ని తీసుకొచ్చింది. సీసీ9, సీసీ9ఈ, సీసీ9 మిటు ఎడిషన్ ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. సీసీ9ఈ మొబైల్ ను అంతర్జాతీయ మార్కెట్ లో ఎంఐ ఏ3గా తీసుకొచ్చింది. సీసీ9 మొబైల్ ని ఎంఐ9 లైట్ గా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సిరీస్ లో కొత్త మొబైల్ రాబోతోంది. చైనాలో ఎంఐసీసీ9 ప్రోగా తీసుకొస్తున్నారు. మరి అంతర్జాతీయ మార్కెట్ లో ఏ పేరు తీసుకొస్తారో చూడాలి.
ఎంఐసీసీ9 ప్రో లో 108 ఎంపీ కెమెరా ఉండబోతోంది. ఇది శాంసంగ్ 108 ఎంపీ ISOCELL Bright HMX సెన్సర్. దీంతో మెరుగైన ఫొటోలు వస్తాయని షావోమీ చెబుతోంది. ఇందులోని పిక్సెల్ బిన్నింగ్ సాంకేతిక ద్వారా నాలుగు పిక్సల్స్ ఒకటిగా మారి 27 పెద్ద పిక్సల్స్ గా మారుతాయి. దీంతో ఫొటోలో డిటైల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మొబైల్లో నాలుగు కెమెరాలుంటాయని తెలుస్తోంది. అలాగే కొత్త ప్రాసెసర్ క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్ 730 జి ఉంటుంది. ఇది గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించింది.
ఎంఐసీసీ9 ప్రో మొబైల్ ను ఈ నెల 24న చైనాలో లాంచ్ చేస్తున్నారు. అక్కడికి కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మొబైల్ ని లాంచ్ చేస్తారని తెలుస్తోంది. మన దేశంలో ఎంఐ ఏ3 ప్రోగా తీసుకొస్తారని తెలుస్తోంది. ఒకవేళ అదే పేరుతో వస్తే ఆపరేటింగ్ సిస్టమ్ మారబోతోంది.
ఆండ్రాయిడ్ వన్ ఓఎస్ ఉండబోతోంది. ప్రస్తుతం ఎంఐఏ3 మన మార్కెట్ లో మంచి సేల్సే ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఎంఐసీసీ9 ని ఎంఐ9 ప్రోగా తీసుకొస్తారనే వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే ఎంఐ సిరీస్ మొబైల్స్ మన దేశంలోకి రావడం లేదు. కాబట్టి ఈ మొబైల్ ను మనం చూస్తామా లేదా అనేది తెలియాల్సి ఉంది.



వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా