‘హువావే మేట్ 30’లో ‘గూగుల్’ ఉండదు..!
11-09-201911-09-2019 10:53:32 IST
Updated On 11-09-2019 10:53:30 ISTUpdated On 11-09-20192019-09-11T05:23:32.479Z11-09-2019 2019-09-11T05:21:43.465Z - 2019-09-11T05:23:30.497Z - 11-09-2019

చైనా స్మార్టఫోన్ దిగ్గజం ‘హువావే’ త్వరలో తన మేట్ సిరీస్‌లో కొత్త మొబైల్‌ను తీసుకురాబోతోంది. ‘మేట్ 30’ పేరుతో మరికొద్ది రోజుల్లో మొబైల్స్ మార్కెట్లోకి రానున్నాయి. అయితే ఈసారి ఈ మొబైల్స్‌లో గూగుల్ ప్లేస్టోర్తోపాటు యూట్యూబ్, మ్యాప్స్ లాంటి గూగుల్ యాప్స్ ఉండవు అని తెలుస్తోంది. అలా అని ఇవి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో రావడం లేదు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే ఈ మొబైల్స్ పని చేస్తాయి. ఈ మేరకు హువావే కన్స్యూమర్ సాఫ్ట్వేర్ ప్రెసిడెంట్ డా వాంగ్ చెంగ్లూ IFA కాన్ఫరెన్స్‌లో వెల్లడించాడు. గూగుల్ మ్యాప్స్, క్యాలెండర్, గూగుల్ డ్రైవ్, గూగుల్ అసిస్టెంట్, జీమెయిల్ యాప్స్‌కు బదులు ఆండ్రాయిడ్ ఆధారంగానే నడిచే కొత్త యాప్స్ రూపొందించడానికి హువావే ప్రయత్నిస్తోంది. జీపీఎస్ నేవిగేషన్‌కు కూడా ఆల్టర్నేటివ్ చూస్తున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ కావడం వల్ల గూగుల్ యాప్స్ లేకుండా దానిని మాత్రమే వాడుకునే సౌలభ్యం ఉంది. అందుకే హువావే ఈ దిశగా ఆలోచిస్తోందని తెలుస్తోంది. మరి గూగుల్ యాప్స్ లేకుండా హువావే ఫోన్లు ఎలా నెగ్గుకొస్తాయో చూడాలి. హువావే ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ ‘హువావే X’ను అక్టోబరులో లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. శాంసంగ్ ఫోల్డింగ్ ఫోన్ ఫెయిల్ అయిన నేపథ్యంలో ఈ మొబైల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో సొంత ఓఎస్ ‘హార్మొని’ను తీసుకొస్తున్నారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ కన్నా 60 శాతం వేగంగా ఉంటుందని, సెక్యూరిటీ కూడా మెరుగ్గా ఉంటుందని హువావే ఇప్పటికే వెల్లడించింది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా