newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హువావే నుంచి మేట్‌ ప్యాడ్‌ ప్రో వచ్చింది... ఎలా ఉందంటే?

28-11-201928-11-2019 09:01:20 IST
2019-11-28T03:31:20.273Z28-11-2019 2019-11-28T03:31:16.561Z - - 15-04-2021

హువావే నుంచి మేట్‌ ప్యాడ్‌ ప్రో వచ్చింది... ఎలా ఉందంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్‌ఫోన్స్‌లో దూసుకుపోతున్న హువావే సరికొత్త ప్యాడ్‌ను లాంచ్‌ చేసింది. మేట్‌ ప్యాడ్‌ ప్రో పేరుతో చైనాలో విడుదల చేసింది. డిజైనర్స్‌, క్రియేటర్స్‌ కోసం దీనిని రూపొందించినట్లు హువావే చెబుతోంది. దీని రూపు చూస్తుంటే ఆపిల్‌ ఐప్యాడ్‌ ప్రోకు దగ్గరగా ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. రౌండెడ్‌ కార్నర్స్‌, స్లిమ్‌ బెజల్స్‌తో ఈ ప్యాడ్‌ అచ్చంగా ఆపిల్‌ ఐప్యాడ్‌ ప్రోను పోలి ఉందంటున్నారు. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఈ ప్యాడ్‌ ప్రత్యేకత. ప్రస్తుతానికి ఇది 4జీ సపోర్టుతో పని చేస్తుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో 5జీ వెర్షన్‌ను విడుదల చేస్తామని హువావే చెబుతోంది. 

ప్రత్యేకతలు ఇవీ...

మేట్‌ ప్యాడ్ ప్రో 7.2 ఎంఎం మందంతో రూపొందించారు. దీని బరువు 460 గ్రామలు వరకు ఉంటుంది. 10. 8 అంగుళాల స్క్రీన్‌ ఉంటుంది. క్వాడ్‌ హెచ్‌డీ ప్లస్‌ (1600 X 2560) పిక్సల్‌ రిజల్యూషన్‌ ఉంటుంది. హువావే కొత్త ఫ్లాగ్‌సిప్‌ ప్రాసెసర్‌ కిరిన్‌ 990 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. హువావే సొంత ఎన్‌ఎం స్టాండర్డ్‌ కార్డు ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.  సాధారణ మెమొరీ కార్డులు పని చేయవు. త్రీడీ స్టీరియో సౌండ్‌ కోసం హర్మన్‌ కార్డన్‌ ట్యూన్డ్‌ స్పీకర్లు ఇస్తున్నారు.  

మేట్‌  ప్యాడ్ ప్రోలో వెనుకవైపు 13 ఎంపీ కెమెరా ఉంటుంది. ఈ ప్యాడ్‌తో గరిష్ఠంగా 4కె రిజల్యూషన్‌ ఉన్న వీడియోలు చిత్రీకరించొచ్చు. ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. దీంతో గరిష్ఠంగా 1080పి వీడియోలు తీయొచ్చు. దీంతోపాటు స్లో మోషన్‌, టైమ్‌ ల్యాప్స్‌, సబ్జెక్ట్‌ ట్రాకింగ్‌ లాంటి అదనపు కెమెరా ఫీచర్లు కూడా ఉంటాయి.  మేట్‌ ప్యాడ్‌ ప్రో ఈఎంయఐ 10 ఆధారంగా పని చేస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా ఈఎంయూఐలో మార్పులు చేశారు. 

ధరలు ఇలా ఉన్నాయ్‌!

మేట్‌ ప్యాడ్‌ ప్రోలో ప్రత్యేకంగా కంప్యూటర్‌ మోడ్‌ను తీసుకొస్తున్నారు. శాంసంగ్‌ డెక్స్‌ తరహాలో ఇది పని చేస్తుంది. దీని ద్వారా ట్యాబ్లెట్‌లో డెస్క్‌టాప్‌ స్టైల్‌ యూజర్‌ ఇంటర్ఫేస్‌ను పొందొచ్చు. ఇందులో 7250 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 40 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. 15 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ చేయొచ్చు. ఈ ట్యాబ్లెట్‌తో 7.5 వాట్‌ రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ చేయొచ్చు. వైఫై తో మాత్రమే పని చేసే 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ ధర సుమారు రూ.33,600. వైఫై తో మాత్రమే పని చేసే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ ధర సుమారు రూ.40,700. 4జీతో మాత్రమే పని చేసే 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ ధర సుమారు రూ.38,700. 4జీతో మాత్రమే పని చేసే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ ధర సుమారు రూ.45,800.

Image result for huawei launches new mate pad pro

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle