newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

హానర్‌ 9ఎ, హానర్‌ 9ఎస్..ధర తక్కువే!

01-08-202001-08-2020 09:45:08 IST
2020-08-01T04:15:08.463Z01-08-2020 2020-08-01T04:15:03.993Z - - 07-08-2020

హానర్‌  9ఎ, హానర్‌  9ఎస్..ధర తక్కువే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెక్నాలజీ విషయంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు బాగా ముందుంటున్నాయి. దేశంలో రాబోయే రోజుల్లో స్మార్ట్ ఫోన్ల సంఖ్య భారీగా పెరగనుంది. కరోనా ఎఫెక్ట్ వల్ల గత మూడునాలుగు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. 30 శాతం వరకూ మార్కెట్ తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. భారీ ధరలకు బదులు తక్కువ ధరలో ఎక్కువ అమ్మకాలు పెంచుకోవాలని అన్ని కంపెనీలు భావిస్తున్నాయి. 

అందులో భాగంగా హానర్ కంపెనీ భారతీయ మార్కెట్ పై ఫోకస్ పెట్టింది. హానర్‌ తక్కువ ధరలో రెండు నూతన  స్మార్ట్‌ఫోన్లను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. బడ్జెట్‌ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో హానర్‌  9ఎ, హానర్‌  9ఎస్ ఫోన్లను హానర్‌ విడుదల చేసింది. ఈ రెండు కొత్త ఫోన్లు కూడా గూగుల్‌ ప్లే స్టోర్‌కు బదులుగా యాప్‌ గాలరీతో లభిస్తుండడం విశేషం.

హానర్‌ 9ఏ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో వస్తుండగా హానర్‌ 9ఎస్‌  సింగిల్‌ వెనుక కెమెరాతో డిజైన్‌ చేశారు. ఆగస్టు 6వ తేదీ ఉదయం 11 గంటల నుండి హానర్ 9ఎ అమెజాన్‌లో  అమ్మకాలు ప్రారంభించనుంది. HDFC  బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు కస్టమర్లు అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు ఆరునెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 

హానర్ 9ఎ, 9ఎస్ ఫోన్ల స్పెసిఫికేషన్లు

*డ్యూయల్ నానో సిమ్

*ఆండ్రాయిడ్ 10 మేజిక్ యుఐ 3.1 

*5.45 అంగుళాల డిస్ ప్లే 720X1440 పిక్సెల్స్

*మీడియా టెక్ ఎంటి6762 ఆర్ ఎస్వీసీ

*8 మెగా పిక్సెల్ కెమేరా సెన్సార్ బ్యాక్

*5 మెగా పిక్సెల్ కెమేరా సెన్సార్ ఫ్రంట్

*వైఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యుఎస్ బి పోర్ట్

*3020 ఎంఎహెచ్ బ్యాటరీ 

* హానర్‌9ఏ 64జీబీ ధర రూ.9,999

*హానర్‌ 9ఎస్‌ 32జీబీ ధర రూ.6,499

* హానర్‌ 9ఏ మిడ్‌నైట్‌ బ్లాక్‌, ఫాంటమ్‌ బ్లూ కలర్‌ 

* హానర్‌ 9ఎస్‌ బ్లూ, బ్లాక్‌ కలర్‌ 

*అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసే అవకాశం

* స్పెషల్‌ ఆఫర్‌లో భాగంగా  హానర్‌ 9ఎస్‌ ధర రూ.5,999

* హానర్‌ 9ఏ ధర కేవలం రూ.8,999

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle