newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్వైపింగ్ దోపిడీ.. కమిషన్ పేరుతో వ్యాపారుల దందా

04-03-202004-03-2020 14:51:05 IST
2020-03-04T09:21:05.533Z04-03-2020 2020-03-04T09:21:00.423Z - - 11-04-2021

స్వైపింగ్ దోపిడీ.. కమిషన్ పేరుతో వ్యాపారుల దందా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. అయితే కొంతమంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా అదనపు కమీషన్‌ వసూలు చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. రూపేకార్డుకు రూ.2వేల లోపు కమీషన్‌ లేదు కానీ ఏపీలోని వివిధ జిల్లాల్లో స్వైపింగ్‌ యంత్రాల ద్వారా కొందరు వ్యాపారులు దోపిడీ పరంపర కొనసాగిస్తున్నారు. వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్నారు.

నగదు రహిత లావాదేవీలకు ప్రజలు మొగ్గు చూపటంతో స్వైపింగ్‌ మిషన్ల ద్వారా చెల్లింపులు పెరిగాయి. కొందరు ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకెళ్లలేక, ఏటీఎంకార్డు ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. దీని ఆసరాగా కొందరు వ్యాపారులు వినియోగదారుల నుంచి స్వైపింగ్‌ కమీషన్‌ పేరుతో దోచుకొంటున్నారు. బ్యాంకులకు తాము కమీషన్‌ చెల్లించాలని చెబుతున్నారు. 100 రూపాయలకు 2 రూపాయలు అంటూ దోపిడీ చేస్తున్నారు.

ఈ స్వైపింగ్‌ లావాదేవీలు ఏర్పాటు చేసిన దగ్గర కమీషన్‌ ఎంత చెల్లించాలని తెలిపే బోర్డులు ఉండవు. వ్యాపారులు చెప్పిందే కమీషన్‌ అవుతోంది. దిక్కుతోచని వినియోగదారుడు జుట్టు పీక్కుంటున్నారు. పెట్రోలు పోయించుకోడానికి, రేషన్‌ సరకులు తీసుకోడానికి, బంగారం కొనడానికి ఇలా ప్రతి కొనుగోలుకు స్వైపింగ్‌ మిషన్ల ద్వారా డెబిట్ కార్డు వినియోగించటం ప్రజలకు అలవాటయింది. నిర్ణీత కమీషన్‌ అనేది ప్రకటించకపోవటంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పటం లేదు.

రూపే డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు ఎక్కువ మంది స్వైపింగ్‌ కోసం వినియోగిస్తున్నారు. చిన్నవ్యాపారి 0.40 శాతం బ్యాంకుకు కమీషన్‌ చెల్లించాలి.  పెద్ద వ్యాపార సంస్థ 0.9 శాతం కమీషన్‌ చెల్లించాలి. చిన్నవ్యాపార సంస్థ అంటే బ్యాంకుల లెక్కలో 20 లక్షల లోపు వ్యాపారం చేస్తున్న సంస్థ. పెద్ద వ్యాపార సంస్థ అంటే రూ.20 లక్షలకు పైబడి వ్యాపారం చేస్తున్న సంస్థ. ఈ సంస్థలు పైవిధంగా స్వైపింగ్‌ మిషన్‌ ద్వారా లావాదేవీలు చేసినందుకు ఆయా శాతాలలో బ్యాంకులకు చెల్లించాలి.

కానీ చిన్న వ్యాపార సంస్థ 0.40 శాతం స్వైపింగ్‌ వినియోగ కమీషన్‌ తీసుకోవాల్సి ఉంటే 2 నుంచి 3 శాతం కమీషన్‌ను వినియోగదారుని నుంచి ఆ సంస్థ వసూలు చేస్తోంది. ఈ స్వైపింగ్‌ కమీషన్‌ను మర్కంటైల్‌ డిస్కౌంట్‌ రేటుగా పిలుస్తున్నారు. క్రెడిట్‌ కార్డు వినియోగానికి  సంబంధించి స్వైపింగ్‌ కమీషన్‌గా బ్యాంకులు వ్వాపారినుంచి 1.5 శాతం కమీషన్‌ వసూలు చేస్తాయి. ఫారిన్‌కార్డు వినియోగానికి సంబంధించి 2.5 శాతం కమీషన్‌ను వ్యాపారి బ్యాంకుకు కట్టాల్సి ఉంది. ఇలా స్వైపింగ్‌ వినియోగానికి నిర్దిష్ట కమీషన్‌ లేకుండా కొందరు వ్యాపారులు వినియోగదారులను దోచేస్తున్నారు. 

గతంలో కంటే ఈమధ్య రూపేకార్డు స్వైపింగ్‌ వినియోగం బాగా పెరిగింది. రెండు వేల రూపాయల లోపు వస్తు కొనుగోళ్లకు ఎటువంటి కమీషన్‌ లేదు. కొందరు వ్యాపారులు రెండు వేల లోపు వస్తువు కొన్నా స్వైపింగ్‌ కమీషన్‌ వసూలు చేస్తున్నారు. బార్లలో మందుబాబుల నుంచి ఇష్టారాజ్యంగా స్వైపింగ్‌ కమీషన్‌ దండుకోవడంతో వారికి ఎంతతాగినా కిక్కు ఎక్కడం లేదంటున్నారు.

రూ.2వేలకు మించి మందు ప్రియులు కొనరనేది వాస్తవం. బ్యాంకు అధికారులు స్వైపింగ్‌ కమీషన్‌ విషయమై ఒక స్పష్టమైన బోర్డు వ్యాపార సంస్థల్లో ఏర్పాటు చేయించి వినియోగదారులు మోసపోకుండా చూడాల్సిన అవసరం ఉంది. స్వైపింగ్‌ మిషన్ కమీషన్‌ గురించి వినియోగదారులు ముందుగా వ్యాపారిని అడిగి తెలుసుకోవాలి. ఎక్కువగా వసూలు చేస్తే ప్రశ్నించాలి. రూ. 2వేల లోపు వస్తు కొనుగోలుకు రూపేకార్డు స్వైపింగ్‌కు ఎలాంటి కమీషన్‌ లేదు. స్వైపింగ్‌ కమీషన్‌ అంటే వ్యాపారి స్వైపింగ్‌ మిషన్‌ వినియోగానికి సంబంధించి బ్యాంకు చెల్లిస్తున్న ఎండీఆర్‌ మాత్రమే. ఈ విషయంలో బ్యాంకు అధికారులు ఒక ఛార్ట్ ఆయా సంస్థల్లో ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలి. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle