స్విగ్గీ.. జొమాటో.. ఫుడ్డే కాదు లిక్కర్ కూడా డోర్ డెలివరీ
21-05-202021-05-2020 09:29:12 IST
Updated On 21-05-2020 10:29:40 ISTUpdated On 21-05-20202020-05-21T03:59:12.605Z21-05-2020 2020-05-21T03:59:02.272Z - 2020-05-21T04:59:40.940Z - 21-05-2020

మందుకోసం నాలుక ఎండిపోతోంది.. చుక్క దొరక్క చిక్కిపోతున్నారు మందుబాబులు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరిచారు. అయితే భౌతికదూరం మధ్య మందుకొనుగోళ్ళు జరుగుతున్నా.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం మందు కోసం వారంతా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా మందుబాబులకు జార్ఖండ్ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఇక మీదట ఆన్లైన్ ద్వారా ఇంటికే మద్యం హోం డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని రాంచీ, జంషెడ్పూర్, బొకారో లాంటి 9 పట్టణాల్లో లిక్కర్‌ను ఇంటికే డెలివరీ చేసేందుకు స్విగ్గీ, జోమాటోలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది 15 జిల్లా కేంద్రాల్లో ఆన్లైన్ టోకెన్ విధానం ద్వారా షాపుల్లోనూ లిక్కర్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లను తగ్గించేందుకు ఆన్లైన్ డెలివరీకి అనుమతి ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది. కరోనా నేపధ్యంలో మద్యం షాపుల వద్ద సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరి చేసింది. అంతేకాదు స్విగ్గీ, జోమాటో గే డెలివరీ బాయ్స్ కూడా తమ వెంట హ్యాండ్ శానిటైజర్ ఉంచుకోవాలి. మద్యం సరఫరా చేసేముందు చేతులను శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. అంతే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. లాక్ డౌన్ 4.Oలో వివిధ రాష్ట్రాలు మద్యం షాపులు ఓపెన్ చేసుకునేందుకు అనుమతించాయి. అలాగే జార్ఖండ్ సర్కార్ అనుమతులు మంజూరు చేసింది. ఇంతకుముందు వరకూ ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గీ, జోమాటో సంస్థలు లిక్కర్ కూడా డెలివరీ చేసేందుకు రెడీ కావడంతో ఫుడ్ తో పాటు లిక్కర్ కూడా మందుబాబుల చెంతకే రానుంది. ఈనిర్ణయం వల్ల తమ వ్యాపారం పెరుగుతుందని ఈ రెండుసంస్థలు భావిస్తున్నాయి. తమిళనాడులో మద్యం షాపులు తెరవడంపై విమర్శలు వచ్చాయి. ఇటు తెలంగాణలోనూ లాక్డౌన్లో మద్యం షాపులు తెరవడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మే 6 నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మందు బాబులు కరోనా వ్యాప్తికి కారకాలుగా మారే అవకాశముందని.. కరోనా మరంత వ్యాప్తి చెందే ప్రమాదముందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో డోర్ డెలివరీని పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు అప్పటికే ప్రభుత్వాలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ లిక్కర్ సేల్స్ పై తెలంగాణ ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా