newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్మార్ట్ యుగంలోనూ వైర్ లెస్ టెక్నాలజీకి దూరంగా ఉన్న సిటీ.. ఎక్కడో తెలుసా ?

20-09-202020-09-2020 20:08:52 IST
Updated On 20-09-2020 20:11:43 ISTUpdated On 20-09-20202020-09-20T14:38:52.925Z20-09-2020 2020-09-20T14:38:49.710Z - 2020-09-20T14:41:43.365Z - 20-09-2020

స్మార్ట్ యుగంలోనూ వైర్ లెస్ టెక్నాలజీకి దూరంగా ఉన్న సిటీ.. ఎక్కడో తెలుసా  ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కలియుగం కాస్తా.. స్మార్ట్ యుగమైంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ 4జీ నెట్ వర్క్ నడుస్తోంది. మారుమూల పల్లెల్లో సైతం సెల్ టవర్ లు వచ్చేశాయి. నెలల పిల్లల నుంచి వృద్ధుల వరకూ..ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. నిజానికి అవసరమైన దానికన్నా స్మార్ట్ ను వాడుతున్నాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్మార్ట్ కు ఇంత బానిసైన ఈ ప్రపంచంలో వైర్ లెస్ టెక్నాలజీకి ఒక సిటీ దూరంగా ఉంది. ఆహా.. అంతలేదులే.. స్మార్ట్ యుగంలో అలాంటి ఊరేమీ ఉండదని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా ఉంది. 

వెైర్ లెస్ టెక్నాలజీకి దూరంగా ఉన్న ఆ పట్టణం మరెక్కడో లేదు.. ఉరుకుల పరుగుల జీవితంలో.. నెట్ వర్క్ తో నడుస్తున్న అమెరికాలోనే ఉంది. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో గ్రీన్ బ్యాంక్ పట్టణం ఇప్పటికీ టెక్నాలజీకి దూరంగానే ఉంది. ఎందుకు అంటారా ? అక్కడున్న టెలిస్కోపే ఇందుకు కారణం. టెలిస్కోప్ ఉన్నంత మాత్రాన టెక్నాలజీకి దూరమవ్వాలా ? అలా అయితే చాలా ప్రాంతాల్లో టెలీస్కోప్ లు ఉంటాయి. అవన్నీ టెక్నాలజీకి దూరంగానే ఉన్నాయా  అన్న అనుమానం రావొచ్చు. నిజమే కానీ.. ఇక్కడున్న టెలీస్కోప్ సమర్థవంతంగా పనిచేయాలంటే వైర్ లెస్ టెక్నాలజీ ఉండకూడదు. 

1950వ దశకంలో అప్పటి అమెరికా ప్రభుత్వం ఖగోళ పరిశోధన నిమిత్తం.. అంతరిక్షం నుంచి వెలువడే తరంగాలను సేకరించి వాటిప పరిశోధన చేసేందుకు ఒక ప్రాజెక్టును చేపట్టింది. ఆ ప్రాజెక్టులో భాగంగానే భారీ రేడియో టెలిస్కోప్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇక్కడే ఒక సమస్య వచ్చింది. భారీ టెలిస్కోప్ ఏర్పాటు చేయాలంటే మానవ నిర్మిత వస్తువుల నుంచి రేడియో తరంగాలు వాటికి అడ్డుపడుకుండా ఉండే ప్రాంతం కావాలి. అలాంటి ప్రాంతం కోసం వెతుకగా వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్యాంక్ పట్టణం కనిపించింది. 

1958లో అక్కడ టెలీస్కోప్ ను ఏర్పాటు చేసి గ్రీన్‌ బ్యాంక్‌ అబ్జర్వేటరీని స్థాపించారు శాస్త్రవేత్తలు. అంతరిక్షం నుంచి ఏవైనా రేడియో తరంగాలొస్తే వాటిని గుర్తించేందుకు ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుంది. అప్పటి నుంచి ఆ ప్రాంతం నేషనల్ రేడియో క్విట్ జోన్ గా ఉంది. అమెరికా ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రీన్ బ్యాంక్ చుట్టుపక్కల సుమారు మూడున్నర కిలోమీటర్ల వరకూ ఎవరూ వైర్ లెస్ గ్యాడ్జెట్లు, వైఫైని వాడటం నిషేధం. ఒకవేళ ఎవరైనా వాడినట్లైతే అంతరిక్షం నుంచి వచ్చే తరంగాలకు అవి ఆటంకాలు కలిగిస్తాయి. 

అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకూ అక్కడ ఇంకా ల్యాండ్ లైన్ ఫోన్లు, కేబుల్ ఇంటర్నెట్ నే వాడుతున్నారు ప్రజలు. కాగా.. ఈ స్మార్ట్ యుగంలోనూ అక్కడ సరైన సదుపాయాలు లేక, అక్కడి నిబంధనలు భరించలేక చాలా మంది ఆ ఊరు వదిలి వెళ్లిపోయారని తాము మాత్రం స్వస్థలాన్ని వదులుకోలేక ఇంకా అక్కడే ఉన్నట్లు చెప్తున్నారు స్థానికులు. 

 

 

 

 

 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle