newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

స్మార్ట్ ఫోన్ కొనడం మేడ్ ఈజీ

16-05-201916-05-2019 13:40:50 IST
Updated On 16-05-2019 13:41:06 ISTUpdated On 16-05-20192019-05-16T08:10:50.311Z16-05-2019 2019-05-16T08:10:48.092Z - 2019-05-16T08:11:06.484Z - 16-05-2019

స్మార్ట్ ఫోన్ కొనడం మేడ్ ఈజీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
షియోమీ దేశీయ మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. మొబైల్ మార్కెట్‌ను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోన్న షియోమీ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేవారికోసం వెండింగ్ మిషన్లు తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లలో ఉండే వెండింగ్ మిషన్ల తరహాలో ఇవి పనిచేస్తాయి. వినియోగదారులు తమకు నచ్చిన స్మార్ట్ ఫోన్లు కొనాలంటే.. మొబైల్ స్టోర్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఆన్ లైన్ స్టోర్లలో కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. . స్మార్ట్ ఫోన్ల సేల్స్ కోసం ఎంఐ ఎక్స్ ప్రెస్ కియోస్క్‌లు అందుబాటులోకి తెచ్చింది.

షియోమీ ఇండియా దేశవ్యాప్తంగా వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ వెండింగ్ మిషన్లలో నుంచి స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు.. యాక్ససిరీస్ కూడా కొనుగోలు చేయొచ్చు. ఎంఐ ఎక్స్ ప్రెస్ కియాస్క్ దగ్గరే నేరుగా తమకు నచ్చిన స్మార్ట్ ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు. ఇలాంటి వెండింగ్ మెషీన్లు తొలిసారిగా ఇండియాలో బెంగళూరులో ఏర్పాటుచేసింది. బెంగళూరులోని మన్యతా టెక్ పార్క్ దగ్గర ఫస్ట్ షియోమీ కియోస్క్ ప్రారంభమయింది. ఏటీఎం మిషన్‌లా ఉండే ఈ వెండింగ్ మెషీన్లు ఎన్నో సేవలు చేస్తాయి. అన్ని రకాల పేమెంట్స్ చేసుకునేలా షియోమీ వీటిని డిజైన్ చేసింది. 

క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, క్యాష్, యూపీఐ పేమెంట్స్ ద్వారా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయొచ్చు. వెండింగ్ మిషన్లలో టచ్ స్ర్కీన్ ద్వారా నచ్చిన స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకోవడం.. పేమెంట్ చేయడం.. అంతే.. క్షణాల్లో మీకు నచ్చిన మోడల్ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ వెండింగ్ మిషన్లను ఇండియాలోని మెట్రో సిటీల్లో ప్రవేశపెడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో ఈ మిషన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. దేశంలోని ఆయా మెట్రో సిటీల్లో ఎక్కడ షియోమీ కియాస్క్ మిషన్లు ఉన్నాయో Mi.com వెబ్ సైట్ ద్వారా యూజర్లు చెక్ చేసుకోవచ్చు.  మొత్తం మీద స్మార్ట్ ఫోన్ల కొనుగోలును మరింత సులభతరం చేసేసింది షియోమీ. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle