newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

స్మార్ట్ ఫోన్ కొంటే కిలో ఉల్లిపాయలు ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

07-12-201907-12-2019 15:49:18 IST
Updated On 07-12-2019 15:49:33 ISTUpdated On 07-12-20192019-12-07T10:19:18.769Z07-12-2019 2019-12-07T10:19:14.559Z - 2019-12-07T10:19:33.119Z - 07-12-2019

స్మార్ట్ ఫోన్ కొంటే కిలో ఉల్లిపాయలు ఫ్రీ.. ఎక్కడో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉల్లిపాయల ధరలు జనాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. బిర్యానీతో పాటు ప్రతిరోజూ ఉల్లిపాయలు లేకపోతే ముద్ద దిగదు. అలాంటిది 100 రూపాయలు.. 150 రూపాయలకు చేరువ కావడంతో ఇటు మహిళలు వంటింట్లో ఉల్లి వినియోగాన్ని బాగా తగ్గించేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్మార్ట్‌ఫోన్ల షాప్ వినూత్నమయిన పథకాన్ని అమలుచేస్తోంది. ఈ ఆఫర్ కి భారీ స్పందన లభిస్తోంది. 

సెల్‌ఫోన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ అని బోర్డ్ పెట్టింది. ఈ బోర్డు చూసిన జనం ఎగబడి సెల్‌ఫోన్లు కొనేసుకుంటున్నారు. మిగతా రాష్ట్రాల్లోలాగే యూపీలోనూ ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తక్కువ ధరకు ఉల్లిపాయలు సరఫరా చేయడం కుదరక ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం అమలు చేస్తోంది.

అయినా ఉల్లి ధరలు దిగిరావట్లేదు. వారణాసిలో కేజీ ఉల్లి రూ.150  వరకూ ఉంది. అక్కడి లాగురాబిర్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్ యజమాని ఓ స్మార్ట్‌ఫోన్ కొంటే కేజీ ఉల్లిపాయలు ఫ్రీ అని బోర్డ్ పెట్టేశారు.

ఈ బోర్డు పెట్టిన తర్వాత... అక్కడకు కస్టమర్ల రాక బాగా పెరిగిందని, మొబైల్ కొనుక్కోవాలనుకునేవాళ్లంతా... తమ షాపుకే వచ్చి కొనుక్కుంటున్నారని యజమాని చెబుతున్నారు. తమకు వచ్చే లాభాన్ని తగ్గించుకుని మరీ ఉల్లిపాయల్ని అందిస్తున్నారు. ఈ ఐడియా భలేగా ఉంది కదూ. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle