newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్మార్ట్ ఫోన్లలో టైపింగ్ వేగం.. అదరగొడుతున్న నవతరం

03-10-201903-10-2019 11:33:40 IST
2019-10-03T06:03:40.202Z03-10-2019 2019-10-03T06:03:31.357Z - - 11-04-2021

స్మార్ట్ ఫోన్లలో టైపింగ్ వేగం.. అదరగొడుతున్న నవతరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
21వ శతాబ్దం ప్రారంభ కాలం నుండి జన్మించిన నవతరం బాలబాలికలు స్మార్ట్ ఫోన్లను టైప్ రైటర్లుగా వాడటంలో నిష్ణాతులవుతున్నారని ఒక అంతర్జాతీయ సర్వే పేర్కొంది. వీరి వేగానికి సాధారణ కీ బోర్డులకు, మొబైల్ ఫోన్లకు మధ్య టైపింగ్ స్పీడ్ విషయంలో అంతరం తొలగిపోతోందని సర్వే తెలిపింది. 10 నుంచి 19 ఏళ్ల వయస్సులో ఉన్న పిల్లలు నిమిషానికి 10 పదాలను స్మార్ట్ పోన్లలో టైప్ చేస్తూ తమ తల్లితండ్రులనే మించిపోతున్నారని సర్వే తేల్చింది.

ఆధునిక తరంలో పుట్టి పెరుగుతున్న వేలాది స్మార్ట్ ఫోన్ వినియోగదారుల టైపింగ్ వేగాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సీటీ, ఆల్టో యూనివర్సిటీ, ఈడీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు అధ్యయనం చేయగా షాక్ తగిలే వాస్తవాలు వెలికి వచ్చాయి. 37 వేలమంది వినియోగదారుల టైపింగ్ అలవాట్లను అధ్యయనం చేసిన ఈ సర్వే రానురానూ మామూలు కీబోర్డులకు, మొబైల్ ఫోన్ కీబోర్టులకు మధ్య టైపింగే వేగంలో కొనసాగుతున్న అంతరం కాస్తా తొలగిపోతోందని తేల్చి చెప్పింది.

తన తల్లిదండ్రుల కంటే కొత్తగా పుట్టుకొచ్చిన నవతరం మొబైల్ ఫోన్లలోనే నిమిషానికి 10 పదాలు టైప్ చేస్తూ వేగంవిషయంలో పాతతరాన్ని అధిగమిస్తున్నారని సర్వే స్పష్టం చేసింది. స్మార్ట్ ఫోన్లనే టైప్ రైటర్లుగా వాడదలుస్తున్నవారు ఫిజికల్ కీబోర్డుల కంటే మించిన వేగాన్ని ప్రదర్శిస్తూ టైపింగ్ విషయంలో అదరగొడుతున్నారు. ఇది పాత తరంపై కొత్త తరం సాధించిన సాంకేతిక విజయంగా కూడా చెప్పవచ్చు.

అయితే స్మార్ట్ ఫోన్లలోనే టైపింగ్ వేగంగా చేయాలనుకుంటే యూజర్లు రెండు బొటనవేళ్లను ఉపయోగిస్తూ పదాల ఆటో-కరెక్షన్‌ను ఎనేబుల్ చేయాల్సిఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా రెండు బొటన వేళ్లను ఉపయోగించేవారు సగటున నిమిషానికి 38 పదాలు టైప్ చేస్తుండం చూసి నివ్వెరపోయామని వీరంటున్నారు. ఇది సాదారణ టైపింగ్ స్పీడ్ కంటే 25 శాతం మాత్రమే తక్కువ అన్నమాట.

సాధారణ కీబోర్డుపై నిమిషానికి 100 పదాలను కొట్టేవారు ఉంటుండగా,  ఆ స్థాయిని అందుకుంటున్నవారు తగ్గిపోతున్నారని, చాలామంది ఇప్పుడు నిమిషానికి 35-65 పదాల మధ్యన టైప్ చేయగలుగుతున్నారని పరిశోధకులు తెలుపుతున్నారు. రానురానూ మామూలు కీబోర్డుతో నైపుణ్యాలను ప్రజలు కోల్పోతుండగా, స్మార్ట్ ఫోన్లలో టైప్ చేసేవారు ఆటో కరెక్షన్, టచ్ మోడల్స్ వంటి ఆప్షన్ల సహాయంతో తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నారట. ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు ఈ అంతరం కూడా తొలిగిపోతుందట.

తమ పరిశీలనలో స్మార్ట్ ఫోన్ యూజర్ ఒకరు నిమిషానికి 85 పదాలను టైప్ చేశారని, ఏరకంగా చూసినా ఇది స్మార్ట్ పోన్లపై గణనీయమైన స్పీడ్ అని వీరు తెలిపారు. ఆన్ లైన్ టైపింగ్ టెస్ట్ ద్వారా 37వేలమంది వలంటీర్లను ఈ సర్వేలో పరీక్షించారు.  TypingMaster.com అనే టైపింగ్ స్పీడ్ టెస్ట్ సర్వీస్‌ను ఈ సర్వేకోసం తీసుకున్నారు. దాదాపు 160 దేశాలనుంచి విభిన్న వయస్కులవారు ఈ సర్వేలో పాల్గొన్నారని, వీరిలో ఎక్కువమంది 20 ఏళ్లలోపు యువతులే ఉన్నారని సర్వే తెలిపింది.

సర్వేలే పాల్గొన్నవారిలో ఎక్కువమంది రోజుకు తాము కనీసం 6 గంటలపాటు మొబైల్ పోన్లను వాడుతుంటామన్నారు. స్మార్ట్ ఫోన్లలో టైప్ చేసేవారిలో 74 శాతం మంది రెండు బొటనవేళ్లను ఉపయోగించి టైప్ చేస్తున్నారు. అందుకే వీరి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటోందని సర్వేలో తేలింది.  టచ్ స్క్రీన్ డివైస్‌లను వాడే నవ తరానికి  పాత మొబైల్స్ వాడే పాతతరానికి మధ్య తేడా స్పష్టంగా కనబడుతోందని సర్వేలో పాల్గొన్న ప్రొఫెసర్ అట్టి ఓలస్విర్త పేర్కొన్నారు

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle