newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

స్మార్ట్ ఫోన్లకు యూత్ ఫిదా.. భారీగా అమ్మకాలు

18-01-202018-01-2020 16:17:27 IST
Updated On 20-01-2020 16:41:16 ISTUpdated On 20-01-20202020-01-18T10:47:27.898Z18-01-2020 2020-01-18T10:45:18.512Z - 2020-01-20T11:11:16.763Z - 20-01-2020

స్మార్ట్ ఫోన్లకు యూత్ ఫిదా.. భారీగా అమ్మకాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు రాజ్యమేలుతున్నాయి.ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లే. 2019 లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని అంతర్జాతీయ సర్వే సంస్థ ఒకటి తెలిపింది. సెకండ్ హ్యాండ్ రీపర్బిషిడ్ ఫోన్లతో పాటు కొత్త స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు దుమ్మురేపాయి. 2019లో మొత్తం 206.7 మిలియన్ల స్మార్ట్ ఫోన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది 2018తో పోలిస్తే 18శాతం పెరుగుదల నమోదవడం విశేషం. 2018లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 175.8 మిలియన్లు వున్నాయని ఇంటర్నేషనల్ డేటా కార్పోరేషన్ (ఐడీసీ) వెల్లడించింది. 

Image result for smart phones youth

ఈ-కామర్స్‌ కంపెనీ స్నాప్‌డీల్‌, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటివి తెచ్చిన ఆఫర్లు స్మార్ట్ ఫోన్ల అమ్మకాలను మరింత పెంచాయనే చెప్పాలి. మెట్రోనగరాలతో పాటు నాన్ మెట్రో నగరాలు, చిన్న పట్టణాల్లో గతేడాదితో పోల్చు కుంటే ఈ ఏడాది చిన్న పట్టణాల నుంచి 69 శాతం మంది ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెరిగాయి. సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 2023 నాటికి 332.9 మిలియన్లకు చేరవచ్చని అంచనా వేసింది. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) ప్రకారం 2018 నుంచి 2023 వరకూ 14 శాతం పెరగనుంది. 

వచ్చే రెండుమూడేళ్ళలో స్మార్ట్ ఫోన్ల డెలివరీ మరింత వేగం కానుంది. ఆర్థికమాంద్యం దెబ్బ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై లేదనే చెప్పాలి. జనం ఒకప్పుడు విలాసంగా వున్న వస్తువుల్ని ఇప్పుడు నిత్యావసరాలుగా మార్చేశారనే చెప్పాలి.

ఫోన్ లేకుంటే ఏదో కోల్పోయినట్టు యువత ఫీలవుతోంది. కొంతమంది కొత్త ఫోన్లు కొనలేనివారు సెకండ్ హ్యాండ్ ఫోన్ల వైపు మొగ్గుచూపుతున్నారు. రీఫర్బిషిడ్ ఫోన్లకు అందుకే గిరాకీ పెరుగుతోంది. యాప్స్, వివిధ సర్వీసులు, యాక్సెసరీస్ బాగా అందుబాటులోకి వచ్చాయి. యూత్ దగ్గరయితే ఆరునెలలకు మించి ఒక ఫోన్ వుండడం లేదు. కొత్త స్మార్ట్ ఫోన్ వైపు వారు అడుగులు వేస్తున్నారు. 

Image result for smart phones youth

ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్లలో న్యూ మోడల్స్ వైపు వారు మొగ్గుచూపుతున్నారు. కంపెనీలు కూడా ఏడాదిలో నాలుగైదు రకాల మోడల్స్ అందుబాటులోకి తెస్తున్నాయి. దీంతో ప్రతి ఫోను ఆరేడు నెలలకి మించి యూత్ చేతిలో ఉండడం లేదు.

ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ తేవడం కంపెనీలకు భారంగా మారింది. గతంలో 3జీ నుంచి 4జీ నెట్ వర్క్ కి మారారు స్మార్ట్ ఫోన్ వినియోగదారులు. తాజాగా 5 జీ నెట్ వర్క్ సందడి చేస్తోంది. దీంతో 4జీ ఫోన్లను పక్కనపడేసి 5 జీ ఫోన్ల వైపు చూస్తోంది యూత్. దీంతో స్మార్ట్ ఫోన్లకు గిరాకీ పెరిగింది. రానున్న కాలంలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉంది. 

చదవండి : అమ్మాయిలు ఇష్టపడే ఐదు బెస్ట్ ఫోన్లు ఇవే! 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle