సోషల్ మీడియా మంచికి అటూ ఇటూ
13-09-201913-09-2019 18:06:58 IST
2019-09-13T12:36:58.472Z13-09-2019 2019-09-13T12:36:51.590Z - - 23-04-2021

తెల్లవారి లేచిన దగ్గర నుంచి నిద్రలోకి జారుకునే వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అంతా ఫోన్ ఫోన్ అని ఊగిపోతున్నారు. జియో వచ్చాక నెట్ వాడకం మరీ ఎక్కువైంది. అప్పట్లో సోషల్ మీడియా అంటే సిస్టమ్..లాప్ టాప్ లు ఓపెన్ చేసి చూస్తేగాని తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఎవరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే వారి చేతిలో సోషల్ మీడియా ఉన్నట్టే. దాంతో సినీ తారల పర్సనల్ విషయాలు, విడుదల కాబోయే చిత్రాలు, ఫ్లాప్ అయిన మూవీస్, లవ్ ఫెయిల్యూర్స్.. ఇలా ఒకటేమిటి అన్ని విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఆ విషయాలు కూడా సెకండ్ లో చేరవలసిన వారికి చేరిపోవడం విశేషమే మరి. పాతతరం వాళ్లకి ఐతే ఫోన్స్ లేవు కాబట్టి లెటర్స్ రూపంలో వచ్చేవి. తమ అభిమాన హీరో..హీరోయిన్ ల చిత్రాలు సంవత్సరం తర్వాత తెరపైకి రాలేదంటే అభిమానులు వారిని నిలదీస్తున్నారు కూడా. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం అంతా ఒకే చోట కనిపిస్తుంది. తారల హాట్ హాట్ ఫోటోలు అయితే ఇన్ స్టా గ్రామ్ లో కుప్ప తెప్పలుగా పోస్ట్ అవుతూ ఉంటాయి. ఇది యువతను పక్కదారి పట్టిస్తోందని అంతా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాని మంచికి ఉపయోగిస్తే మంచిగానే ఉంటుంది. అందుకే దర్శక..నిర్మాతలు వారి వారి సినిమా ప్రచారాలకు వేదికగా ఈ సోషల్ మీడియాని ఫుల్గా వాడేసుకుంటున్నారు. దాదాపు అందరు హీరోహీరోయిన్లకి ట్విట్టర్..ఇన్ స్టా..ఫేస్ బుక్ ఖాతాలు ఉన్నాయి. కానీ కొంతమంది తారలు సోషల్ మీడియాతో సంబంధం లేనట్టు ఉంటున్నారు. అలాంటి వారి లిస్టులో ముందుంది మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్. ఈ సుందరి ట్విట్టర్..ఇన్ స్టా..ఫేస్ బుక్ లాంటి వాటికి చాలా దూరంగా ఉంటుంది. ప్రతి మనిషికి ఓ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఈ సోషల్ మీడియా వల్ల మనకి సంబంధించిన ప్రతి విషయం అందరితో షేర్ చేసుకునే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేసింది ఈ బ్యూటీ. వీటి వల్ల కొంతమంచి జరిగినా..కొంత చెడు జరిగే అవకాశాలు ఉన్నాయని. సోషల్ మీడియాలో ఖాతా ఉంటే వాటికి బానిసలుగా మారతామని తన అభిప్రాయాన్ని తెలిపింది. ఏ విషయానైనా కుండబద్దలు కొట్టేటట్టు మాటలాడే బొద్దుగుమ్మ విద్యాబాలన్ సోషల్ మీడియా పట్ల అనాసక్తిని ప్రదర్శించింది. మన విషయాలను ఎవరితోనో ఎందుకు పంచుకోవాలని నాకు అంత అవసరం లేదని తెలిపింది. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ అయితే సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ కాదు కదా..ఫోటో కూడా కనిపించదు. అమ్మాయిలతో ఎపైర్ వార్తలతో నిలిచే రణ్ బీర్ కి తన విషయాలు నలుగురితో పంచుకోవడానికి సిగ్గని తెలిపడం విడ్డూరమే. ఇకపోతే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా సామాజిక మాధ్యమాలకు దూరమే. అంతేనా నా పర్సనల్ విషయాలను నేనే ఎందుకు పబ్లిసిటీ చేసుకోవడం అని ఎదురు ప్రశ్నిస్తుంది. మరో తార కూడా సోషల్ మీడియాకి దూరమేనట. ఆమె నటి రాణీ ముఖర్జీ. వివాహం తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది ఈమె. హిచ్కీ చిత్రం కోసం తప్పని సరై సోషల్ మీడియాని వాడి ఆ తర్వాత అక్కౌంట్ ని వాడటమే మరచిపోయిందట. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ కూడా సోషల్ మీడియాకి దూరమేనట. అయినా ఎవరి ఇష్టాలు వారివి.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
21 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా