newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సెల్ కంపెనీల నయా ప్లాన్.. త్వరలో నెలవారీ ఛార్జీల పెంపు?

28-01-202028-01-2020 18:51:42 IST
2020-01-28T13:21:42.224Z28-01-2020 2020-01-28T13:21:31.641Z - - 20-04-2021

సెల్ కంపెనీల నయా ప్లాన్.. త్వరలో నెలవారీ ఛార్జీల పెంపు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సెల్ కంపెనీలు ఈమధ్యకాలంలో భారీగా ధరలు పెంచేశాయి. దీంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. యావరేజ్ రెవిన్యూ పర్ యూజర్ (ఏఆర్‌పీయూ) ద్వారా తమ రెవిన్యూ పెంచుకోవడానికి సిద్ధపడుతున్నాయి. గతంలో తామిచ్చిన లైఫ్ టైం వాలిడిటీకి మంగళం పాడేశాయి. 

తాజాగా తక్కువ కాలపరిమితిలో ఎక్కువ డేటా వాడుకునే అవకాశం కల్పిస్తున్నాయి. కొంతమంది కస్టమర్లు ఎక్కువ కాలపరిమితి గల ప్లాన్లకు వెళుతున్నారు. దీని వల్ల నెలవారి రెవిన్యూ తగ్గిపోతోంది. గతంలో ఏడాదికి ఒకసారి. 84 రోజులకు ఒకసారి ప్లాన్లు అమలులలో వుండేవి. కానీ సెల్ ఫోన్ ప్రొవైడర్లు మూకుమ్మడిగా వీటిని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

చాలామటుకు వినియోగదారులు ఇన్ కమింగ్ కోసం ఫోన్ వాడుతుంటారు. వారిని దృష్టిలో ఉంచుకుని గతంలో ఎయిర్ టెల్ వంటి సంస్థలు 35 రూపాయల ప్లాన్ అమలుచేసేవి. దీని ద్వారా ఇన్ కమింగ్ వచ్చేది. ఇప్పుడు దానిని 45 రూపాయలకు పెంచేసింది. 35 రూపాయల ప్లాన్ లో 28 రూపాయల వరకూ టాక్ టైం లభించేది. 100 ఎంబీ డేటా వచ్చేది. కానీ 45 రూపాయల ప్లాన్ వచ్చాక కస్టమర్ల నుంచి ఆదాయం పెరిగింది. 

తక్కువ కాలపరిమితి అంటే 28 రోజుల ప్లాన్ వైపు కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. నెలకు రూ 200 ప్లాన్ లో 5 జీబీ, నెలకు రూ 300 ప్లాన్ లో 10 జీబీ, నెలకు రూ.400 ప్లాన్ లో 20 జీబీ డేటా అందించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే వీటి ధరను ఒక్కో ప్లాన్ కు రూ.50 పెంచేందుకు రంగం సిద్ధం చేశాయి. ఈ పెంపు ద్వారా అదనపు రెవిన్యూ రానుంది. ఈ ఏడాది చివరినాటికి సెల్ ఫోన్ ఆపరేటర్లు 25 నుంచి 35 శాతం అదనపు ఛార్జీలు పెంచే యోచనలో వున్నాయి.

హై మార్జిన్ కస్టమర్లను అతి ఎక్కువ కాలం వ్యాలిడిటీ ప్లాన్లకంటే తక్కువ వ్యాలిడిటీ ప్లాన్లకు మార్చగలిగితే మరింత ఆదాయం పెరుగుతుందంటున్నారు. 28 రోజుల ప్లాన్ వల్ల కంపెనీలకు ఆదాయం బాగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తమ ప్లాన్ల ద్వారా జీవిత బీమాతో పాటు నెట్ ఫ్లిక్స్ వంటి సబ్ స్క్రిప్షన్లు అందిస్తున్నాయి. తాజాగా పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఎయిర్ టెల్ షాకిచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఈ ప్యాక్ నుంచి తొలగించింది. మూడునెలల రీఛార్జి చేసుకున్న వారికి అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఎలాగూ ఉంది. 

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle