సెల్‌ఫోన్ బానిసత్వం.. సరికొత్త డిజిటల్ బాంబ్
19-04-202019-04-2020 13:52:54 IST
Updated On 19-04-2020 14:00:35 ISTUpdated On 19-04-20202020-04-19T08:22:54.227Z19-04-2020 2020-04-19T08:22:50.198Z - 2020-04-19T08:30:35.947Z - 19-04-2020

కరోనా వైరస్ నియంత్రణ కోసం దేశాలకు దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. వందలకోట్లమంది ప్రజలు పనులు మాని ఇళ్లకు పరిమితం కావడంతో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సెల్ ఫోన్ బానిసత్వం సమాజంపై సరికొత్త డిజిటల్ బాంబ్లా విస్ఫోటించనుంది. స్మార్ట్ ఫోన్ లేకుంటే వెర్రెత్తిపోతున్న జనం లాక్ డౌన్ కాలంలో అటు స్మార్ట్ ఫోన్లు, లేక ల్యాప్ టాప్‌లు, లేదా కంప్యూటర్లకు అతుక్కుపోయి ఉంటున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా వాటిని వినోద సాదనాలుగా ఉపయోగిస్తున్నారు. కానీ వారంలో ఒకరోజైనా ఫోన్ ఫ్రీడేగా పాటించకుంటే ఫోన్‌కు దూరంగా ఉండకపోతే సమాజం కొత్త ఉపద్రవం బారిన పడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నరు. మన నెత్తిపై వేలాడుతున్న డిజిటల్ బాంబును నిర్వీర్యం చేయకపోతే పర్యవసానాలను కనీసం ఊహించలేమని వీరంటున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లతో ఎక్కువసేపు కాలక్షేపం వద్దన్నది నిపుణుల మాట. వారంలో ఒకరోజు ఫోన్ఫ్రీ డే’ పాటించాలని, పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇవ్వాలనీ, కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవాలనీ నిపుణుల సూచిస్తున్నారు. ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో మనమంతా కొన్ని అలవాట్లకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా రోజువారీ జీవన విధానంలో భాగమైన డిజిటల్ సాధనాలకు బానిసలుగా మారిన మనం.. దాన్ని దూరం చేసుకునేందుకు వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కండిషన్‌ని నిపుణులు డిజిటల్ డిటాక్స్ అని పిలుస్తున్నారు. అంటే ఎలక్ట్రానిక్ పరికరాలను నిర్ణీత సమయంపాటు వాడకుండా ఉండటం. దీనివల్ల మానసిక, శారీరక ఒత్తిళ్లు తగ్గడంతోపాటు ఇతర అంశాలపై మనం దృష్టి పెట్టేందుకు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. డిజిటల్ విరామం పాటించకపోతే మనిషి మానసిక స్థితిగతులను అది ధ్వంసం చేసిపడేస్తుందని వీరు హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా అధిక శాతం మంది స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు లేదా టీవీలకు అతుక్కుపోయి కనిపిస్తున్నారు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా వాటిని వినోద సాధనాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పద్ధతి సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, డిజిటల్ సాధనాలను ఎక్కువ గంటలు వాడరాదని సూచిస్తున్నారు. డిజిటల్ సాధనాలను అవసరం ఉన్నంత వరకే ఉపయోగించుకునేలా ప్రతిఒక్కరూ అలవాటు పడేందుకు ప్రస్తుత లాక్డౌన్, కరోనా వ్యాప్తి పరిణామాలు దోహదపడతాయని అంటున్నారు. ‘ఈ లాక్డౌన్ రోజుల సందర్భంగా డిజిటల్ ప్రపంచం నుంచి ఎప్పటికప్పుడు విరామం తీసుకోవాలి. ముఖ్యంగా రోజంతా మొబైల్స్‌కు అతుక్కుపోవద్దు. పుస్తక పఠనం ద్వారా సమయాన్ని పరిజ్ఞానం పెంచుకునేందుకు ఉపయోగించాలి. కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవాలి’అని ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, యాలైడ్ సైన్సెస్ డైరెక్టర్ డా. నిమేష్ జి. దేశాయ్ తన అధ్యయనంలో వెల్లడించారు. గతంతో పోలిస్తే లాక్డౌన్ సందర్భంగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రజలు రెండింతలకు పైగా సమాయాన్ని గడుపుతున్నట్లు ‘హ్యామర్ కోఫ్ కన్జూమర్ సర్వే’అధ్యయనంలో వెల్లడైంది. ఈ డిజిటల్ సాధనాలన్నింటిలోనూ అత్యధికంగా వినియోగిస్తున్న స్మార్ట్ఫోన్ల నుంచి ‘డీ అడిక్షన్’మొదలుపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. సెల్‌ఫోన్‌కు ఎక్కువగా అలవాటు పడటం, అది లేకుండా ఉండలేమన్నంతగా మారిపోవడాన్ని ‘రోగంగా’పరిగణించకపోయినా, దానితో వెళ్లబుచ్చే సమయాన్ని మాత్రం గణనీయంగా తగ్గించాలని సూచిస్తున్నారు. స్మార్ట్ఫోన్లతో మనకు విడదీయరాని బంధం ఏర్పడినందున దాని ఉపయోగాలు, అవసరాల దృష్ట్యా వాటికి పూర్తిగా దూరంగా ఉండలేని పరిస్థితి ఏర్పడటంతో కొన్ని పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. నిపుణుల సూచనలు ఇవి. వారంలో ఒకరోజు స్మార్ట్ఫోన్లు లేకుండా గడపాలి. అది ఏ రోజన్నది ఎవరికి వారే ఎంచుకోవచ్చు. మొబైల్స్‌తో ‘ఫిజికల్ డిస్టెన్స్’పాటించాలి. బయటకు వెళ్లినప్పుడు ముఖ్యంగా వాకింగ్‌కు వెళ్తే ఫోన్ తీసుకెళ్లకూడదు. ప్రతిరోజూ కొంత సమయం మొబైల్స్ తాకకుండా ఉండాలి. భోజనాలు చేసేటప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకోకూడదు. సెల్‌ఫోన్‌ను బెడ్రూంలోకి తీసుకెళ్లకూడదు. ఫోన్‌ను చూసే, వాడే సమయాన్ని గణనీయంగా తగ్గించాలి. పుస్తకాలు, పత్రికల పఠనం అలవాటు చేసుకోవాలి. ఫోన్లో నోటిఫికేషన్ బటన్‌ను ఆఫ్ చేసి ముఖ్యమైన వాటికే పరిమితం కావాలి.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా