newssting
BITING NEWS :
*దిశ ఘటన మరువక ముందే మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి*హైదరాబాద్‌ టీ-20లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన భారత జట్టు *హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలన్న హైకోర్టు... 9న ఉదయం 10.30 గంటలకు విచారణ *కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.*నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: వైకాపా నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి*చింతపల్లిలో దారుణం.. కుక్కలకు బలయిన శిశువు *కర్నూలు: ఉల్లి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన*ఇవాళ జార్ఖండ్ లో రెండవ విడత పోలింగ్ *దిశ నిందితులు కరుడుగట్టిన నేరస్తులు : సీపీ సజ్జనార్

సెల్లులో సొల్లు కబుర్లకు ఇక చెల్లుచీటీ

02-12-201902-12-2019 13:52:54 IST
Updated On 02-12-2019 13:52:47 ISTUpdated On 02-12-20192019-12-02T08:22:54.810Z02-12-2019 2019-12-02T08:22:13.175Z - 2019-12-02T08:22:47.451Z - 02-12-2019

సెల్లులో సొల్లు కబుర్లకు ఇక చెల్లుచీటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇక జాగ్రత్తగా మాట్లాడండి... లేదంటే వాలెట్ ఖాళీ

ఇక మాటే భారమా? 

ఆచితూచి మాట్లాడాల్సిన టైం వచ్చిందా?

గంటలకు గంటలు మాట్లాడడం కుదరదా?

సెల్లులో సొల్లు కబుర్లు కుదరవా

బాదుడుకు రెడీ అయిన సెల్యూలార్ ఆపరేటర్లు

వొడాఫోన్, ఎయిర్ టెల్, జియో.. ఇంకా మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి. నిన్నమొన్నటివరకూ ఎడాపెడా ఆఫర్లు ఇచ్చిన ఈ సెల్ కంపెనీలు ముట్టుకుంటే షాక్ కొట్టేలా తమ టారిఫ్ లను మార్చడానికి రెడీ అవుతున్నాయి. మొబైల్‌ ఛార్జీలను భారీగా పెంచుతూ టెలికాం కంపెనీలు వినియోగదారుల్లో గుబులు పుట్టించనున్నాయి.

కాల్‌, డేటా చార్జీలను డిసెంబర్‌ మూడు నుంచి 42 శాతం పెంచుతోంది వొడాఫోన్‌ ఐడియా. ఈ విషయం ఇప్పటికే ఇవి ప్రకటించగా.. అందరికీ ఉచిత తాయిలాలు ఇచ్చి.. ప్రత్యర్థి కంపెనీలకు నష్టాలు మిగిల్చిన రిలయన్స్‌ జియో కూడా అదే బాట అనుసరించబోతోంది. 

జియో కూడా 40 శాతం టారిఫ్‌ పెంపుతో న్యూ ఆల్‌ ఇన్‌ వన్‌ ప్లాన్‌లను ప్రకటించింది. డిసెంబర్‌ 6 నుంచి నూతన ప్లాన్‌లు అమల్లోకి వస్తాయని జియో పేర్కొంది. మొబైల్‌ చార్జీలను 40 శాతం పెంచినా వినియోగదారులకు 300 శాతం ప్రయోజనాలను వర్తింపచేస్తామని జియో చెబుతోంది. తమ వినియోగదారులకు ఈ ఛార్జీల పెంపు భారం కాబోదని జియో అంటోంది.  వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు నూతన ప్లాన్‌లను ఆఫర్‌ చేస్తోంది.

Image result for cell phone talking"

టెలికాం టారిఫ్‌ల సవరణకు చేపట్టిన సంప్రదింపుల ప్రక్రియలో ప్రభుత్వంతో జియో కలిసి పనిచేస్తుందని పేర్కొంది. మొబైల్‌ కాల్స్‌, డేటా చార్జీలను వొడాఫోన్-ఐడియా పెంచింది. ప్రీపెయిడ్‌ విభాగంలో రెండు రోజులు, 28, 84, 368 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్‌లపై చార్జీలను పెంచనుంది. గత ప్లాన్‌లతో పోలిస్తే తాజా ప్లాన్‌లు దాదాపు 42 శాతం మేరకు భారం కానున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle