newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

సెప్టెంబర్ 17న రెడ్ మి నోట్ 9 సేల్..!

17-09-202017-09-2020 15:39:57 IST
2020-09-17T10:09:57.607Z17-09-2020 2020-09-17T08:53:07.040Z - - 21-10-2020

సెప్టెంబర్ 17న రెడ్ మి నోట్ 9 సేల్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెడ్ మి నోట్ 9 మొబైల్ ఫోన్ భారత్ లో సెప్టెంబర్ 17న మరో సారి అమ్మనున్నారు. ఈ రెడ్ మి మొబైల్ ను జులై నెలలో లాంచ్ చేయగా అమెజాన్, ఎంఐ.కామ్ లో అమ్మకానికి ఉంచనున్నారు. రెడ్ మి నోట్ 9 మొబైల్ ఫోన్ కు ఆకర్షణీయమైన డిస్ప్లే ఉంది. హోల్ పంచ్ డిస్ప్లే తో పాటూ క్వాడ్ రియర్ కెమెరాలు ఉన్నాయి. రెడ్ మి నోట్ 9 మొబైల్ ఫోన్ లో 6జీబీ ర్యామ్ ఉండనుంది. 22.5w ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం11, మోటో జీ9 లకు పోటీగా ఈ మొబైల్ ఫోన్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేశారు.

భారత్ లో 4జీబీ+64జీబీ స్టోరేజీ ఉన్న రెడ్ మి నోట్ 9 మొబైల్ ఫోన్ ప్రారంభ ధర 11999 రూపాయలు. 4జీబీ+128జీబీ స్టోరేజీ ఉన్న వేరియంట్ ధర 13,499.. ఇక 6జీబీ+128జీబీ మోడల్ ధర 14999 రూపాయలుగా నిర్ణయించారు. రెడ్ మి నోట్ 9 మొబైల్ ఫోన్ ఆక్వా గ్రీన్, ఆక్వా వైట్, పెబుల్ గ్రే, స్కార్లెట్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో రానుంది. సెప్టెంబర్ 17 మధ్యాహ్నం 12 గంటల సమయంలో Amazon, Mi.com లలో సేల్ ఉంది.

రెడ్ మి నోట్ 9 స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్(నానో) రెడ్ మి నోట్ 9  MIUI 11 మీద రన్ అవుతుంది.  Android 10, నుండి MIUI 12 వరకూ అప్ గ్రేడబుల్.  6.53ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే (1,080x2,340 pixels) డాట్ డిస్ప్లే . 19.5:9 యాస్పెక్ట్ రేషియో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్. రెడ్ మి నోట్ 9 కు octa-core MediaTek Helio G85 SoC, 4జీబీ 6జీబీ LPDDR4x RAM ఉంది.

క్వాడ్ రియర్ కెమెరా 48-megapixel Samsung ISOCELL Bright GM1 primary sensor,  f/1.79 lens. 8-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా కు f/2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ , 2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్. సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా. 128 జీబీ ఇన్ బిల్ట్ మెమొరీ ఉన్నప్పటికీ మైక్రో ఎస్డీ కెమెరా ద్వారా 512 జీబీ వరకూ పెంచుకోవచ్చు. 4G VoLTE, Wi-Fi, USB Type-C పోర్టు ఉన్నాయి. 5020 ఎంఏహెచ్ బ్యాటరీ కలదు. 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ 9W రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle