newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సూపర్ మార్కెట్ వద్దు.. ఆన్‌లైన్ డెలివరీ ముద్దు

08-04-202008-04-2020 15:15:24 IST
Updated On 08-04-2020 15:20:22 ISTUpdated On 08-04-20202020-04-08T09:45:24.323Z08-04-2020 2020-04-08T09:45:22.066Z - 2020-04-08T09:50:22.873Z - 08-04-2020

సూపర్ మార్కెట్ వద్దు.. ఆన్‌లైన్ డెలివరీ ముద్దు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌తో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని తినలేకపోతున్నామనే భావన ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. రెండువారాలు దిగ్భంధంలో గడిపిన తరువాత కూడా పరిస్థితిలో ఏ మార్పు రాకపోవడంతో లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే మనమంతా ఇంట్లోనే ఉంటూ, పరిశుభ్రంగా ఉండడమే ఉత్తమమైన మార్గం అని చాలామంది గ్రహించారు. అంతేగాక ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా రోజువారీ దినచర్యలను మార్చుకున్నారు. వీటిలో ఇంట్లోకి తీసుకువచ్చే బయటి వస్తువులతో పాటు, ఫుడ్‌ డెలివరీ విషయంలో కూడా అదనపు జాగ్రత్త వహించడం కూడా ఒకటి. 

ఈ అసాధారణమైన పరిస్థితులలో బయటి నుంచి తీసుకువచ్చే వస్తువుల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందకుండా వాటిని శుభ్రం చేయడంలో జాగ్రత్త వహించాలి. పలు ఆరోగ్య సంస్థలు నిరంతరం చేతులు కడుక్కోవాలని ప్రజలకు సూచించినప్పటికీ, ఫుడ్‌ డెలివవరీలను ఏ విధంగా నిర్వహించాలనే దానిపై సమాచారం అందుబాటులో లేదు. ఫుడ్‌ డెలివరీ నిర్వహణ విషయంలో అనేక సందేహాలు ఉండడంతో అది అంత సురక్షితం కాదేమోనని ఫుడ్ ఆర్డర్‌ చేయడానికి ప్రజలు భయపడుతున్నారు. 

కానీ ఫుడ్ ఆర్డర్‌ చేయడం సురక్షితం అని మీకు తెలియడానికి ఎటువంటి భద్రతా చర్యలను అనుసరిస్తున్నామనేది ప్రజలకు తప్పకుండా తెలియజేస్తామని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు హామీ ఇస్తున్నాయి. అంతేగాక అన్ని సమయాల్లో సూక్ష్మక్రిములు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న సూపర్‌ మార్కెట్‌కు వెళ్లడం కంటే ఆహారాన్ని మీ ఇంటికే తెప్పించుకోవడం సురక్షితం అని చెబుతున్నాయి కూడా.. అయితే శానిటరీ టెక్నిక్‌లను ఉపయోగించి ఆ ప్యాకేజీలను అన్‌ ప్యాకేజ్‌ చేయడం కూడా అంతే ముఖ్యం.

రెస్టారెంట్లు, హోమ్‌ డెలివరీ విభాగాలు పలు ఆరోగ్య సూత్రాలను అనుసరిస్తూ తమ వినియోగదారులు సురక్షితంగా ఉండడం కోసం ముందడుగు వేశాయి. పరిశుభ్రమైన ఆహారం తయారీ, తాజాగా వండిన భోజనం, చెఫ్‌లు పాటించవలసిన ఆరోగ్య విధానాలు, కాంటాక్ట్‌ డెలివరీ, డోర్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు జాగ్రత్త వహించేలా  రెస్టారెంట్‌ యజమానులు చర్యలు తీసుకుంటారు. కాబట్టి వీటిలో కలుషితానికి తక్కువ ఆస్కారం ఉందని మీకు హామీ ఇస్తున్నామని అంటున్నాయి.

మీరు మీ ఫుడ్‌ ప్యాకేజీలను తీసుకున్నపుడు మీకు, డెలివరీ సిబ్బందితో ఎటువంటి కాంటాక్ట్‌ ఉండదని నిర్ధారించుకోండి. ప్యాకేజీని తీసుకునేటపుడు చేతికి తప్పనిసరిగా గ్లౌజులు ధరించండి. మీరు ప్యాకేజీని టేబుల్‌పై ఉంచే ముందు క్రిమి సంహారక మందుతో ఆ ప్రదేశాన్నిశుభ్రంచేయండి. ప్యాకేజీని కూడా అదే వస్త్రంతో శుభ్రం చేయండి. ఇప్పుడు ప్యాకేజీలోని పదార్థాన్ని శుభ్రం చేసిన పాత్రలోకి మార్చి, ప్యాకేజీని చెత్తకుండీలో పడేయండి. తరువాత ఆ చేతులతో మీముఖాన్ని తాకకుండా 20 సెకన్ల పాటు కడుక్కోవాలి. 

ముందు జాగ్రత్తగా ఆహారాన్ని మీ చేతులతో కాకుండా ఇంటిలోని వస్తువులను ఉపయోగించి తినడం మంచిది. పలు ఫుడ్‌ స్టాండర్డ్‌ ఏజెన్సీలు తాజాగా వండిన, వేడి వేడి ఆహారాన్ని తినడం మంచిదని ప్రజలకు సూచించాయి

మీ ఆహారాన్ని సుమారు 12 నిమిషాలు వేడిచేసుకోవడం మంచిదని కూడా ఇవి సలహాలు ఇస్తూండటం సంతోషకరమే.

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle