newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సూపర్‌ఫాస్ట్‌ ‘కిరిన్‌ 990’భారత్‌కి వస్తోంది... ఎలా ఉండబోతోందో?

18-09-201918-09-2019 18:31:20 IST
2019-09-18T13:01:20.333Z18-09-2019 2019-09-18T12:58:11.817Z - - 17-04-2021

సూపర్‌ఫాస్ట్‌ ‘కిరిన్‌ 990’భారత్‌కి వస్తోంది... ఎలా ఉండబోతోందో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్నాప్‌డ్రాగన్‌కు 800 సిరీస్‌ ఎలాగో... కిరిన్‌కి 900 సిరీస్‌ అలాగా. ఫ్లాగ్‌షిప్‌ మొబైల్స్‌ని ఈ సిరీస్‌లోనే తీసుకొస్తుంటారు. 900 సిరీస్‌లోని లేటెస్ట్‌ ప్రాసెసర్‌ 990ని హువావే సిద్ధం చేసింది.  IFA2019లో కొత్త ప్రాసెసర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త తరం మొబైళ్లు మేట్‌ 30 లో ఈ ప్రాసెసర్‌ ఉండబోతోందని సమాచారం. ఈ నెల 19న జర్మనీలోని మ్యూనిచ్‌లో కిరిన్‌ 990ని లాంచ్‌ చేస్తారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 మించిన వేగంతో పని చేస్తుంది.ఈ ప్రాసెసర్‌ గురించి మరిన్ని వివరాలు గురువారం బయటికొస్తాయి.

మేట్‌ 30 మొబైల్‌ భారత్‌ మార్కెట్‌లోకి కూడా రానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని హువావే స్పష్టం చేసింది. అంతేకాదు హువావే 30... కిరిన్‌ 990లోని 5జీ వెర్షన్‌తో తీసుకురానున్నారు. మేట్‌ 30కి ప్రో వెర్షన్‌ను కూడా హువావే విడదల చేస్తోంది. మేట్‌ 30 ప్రో పేరుతో వస్తున్న ఈ మొబైల్‌లో కర్వ్‌డ్‌ ఎడ్జ్‌ డిస్‌ప్లే ఉండబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా బయటికొచ్చాయి. కర్వడ్‌ డిస్‌ప్లే ఉండటం వల్ల మేట్‌ 30 ప్రోలో ఫిజికల్‌ బటన్స్‌ ఉండవు. దానికి బదులు హాప్టిక్‌ ఫీడ్‌బ్యాక్‌ ఆప్షన్‌ను తీసుకొస్తున్నారు. ఇలాంటి ఆప్షన్లతో వీవో నెక్స్‌3 ఇటీవల మార్కెట్‌లోకి వచ్చింది. 

కిరిన్‌ 990 నుంచి రెండు వెర్షన్లు వస్తున్నాయనే విషయం తెలిసిందే. ఒకటి 4జీ వెర్షన్‌ కాగా, మరొకటి 5 జీ వెర్షన్‌. ఈ రెండింటినీ భారత్‌కు తీసుకురావడానికి హువావే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. భారత్‌లో ఇంకా 5జీ అందుబాటులో లేకపోయినా 5జీ మొబైల్స్‌ మాత్రం క్యూ కట్టడానికి సిద్ధమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం భారత్‌లోకి 5జీ 2020 మధ్యలో వస్తుందని తెలుస్తోంది. హవావే అయితే దేశంలో తొలిసారి 5 జీ ఫోన్‌ తీసుకొచ్చే సంస్థ అవ్వాలని బలంగా కోరుకుంటోంది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle