సియట్ ఎన్ 95 మాస్క్.. గోసేఫ్
08-07-202008-07-2020 12:07:46 IST
Updated On 08-07-2020 12:31:40 ISTUpdated On 08-07-20202020-07-08T06:37:46.199Z08-07-2020 2020-07-08T06:37:07.732Z - 2020-07-08T07:01:40.157Z - 08-07-2020

కరోనా మహమ్మారి ప్రబలుతున్న వేళ స్వచ్ఛందంగా ఇంట్లో ఉండాలని సూచిస్తున్నా చెవి కెక్కడం లేదు. దీంతో పాటు మరికొందరు విందులు, వినోదాలు. .. ఇలాంటి వాటి వల్ల ఒక్కరికో.. ఇద్దరికో వైరస్ సోకడం లేదు... ఏకంగా పదుల సంఖ్యలో ప్రజలకు వైరస్ అంటుకుంటోంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకున్న నాధుడే లేదంటే నమ్మరు. అందుకే ఇలాంటి వాటిని నిరోధించేందుకు ప్రభుత్వం కొత్త ఏర్పాట్లు చేసింది. మాస్కులు లేకుండా బయటకు వచ్చేవారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. మాస్కుల ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకున్న వివిధసంస్థలు సురక్షితమయిన మాస్కుల తయారీపై ఫోకస్ పెట్టాయి. తాజాగా ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్ సరికొత్తగా ఎన్ 95 మాస్క్ తయారుచేసింది. దీనిని గోసేఫ్ అని పేరు పెట్టింది. ఇప్పటికే అనేక ఆటోమొబైల్ సంస్థలు వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పరికరాలను తయారుచేస్తున్నాయి. ఎన్ 95 మాస్కును మార్కెట్లోకి విడుదలచేసింది. ఆరువరుసల్లో ఈ మాస్క్ తయారుచేశారు. దీనిలో ఒక పొర యాంటీబాక్టీరియల్ వస్త్రంతో తయారుచేశామని సంస్థ తెలిపింది. మూడుపొరల్లో బ్యాక్టీరియాను ఫిల్టర్ చేసే సదుపాయం వుంది. దీని ధర రూ.249 గా నిర్ణయించింది. దీనిని ఎన్నిసార్లయినా ఉతికి మళ్ళీ ఉపయోగించుకునే సౌలభ్యం వుంది. ఈ ఎన్ 95 గో సేఫ్ మాస్క్ భద్రపరుచుకునే అవకాశం కూడా ఉంది. అందుకు ఒక బ్యాగ్ కూడా ఇస్తారు. గోసేఫ్ రేంజ్ లో మరిన్ని ఉత్పత్తులను విడుదలచేయనుంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా