newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సిటిజప్ ట్రాకింగ్ యాప్.. లాక్ డౌన్ అతిక్రమిస్తే బుక్కైపోతారు

12-04-202012-04-2020 09:22:16 IST
Updated On 12-04-2020 09:48:28 ISTUpdated On 12-04-20202020-04-12T03:52:16.894Z12-04-2020 2020-04-12T03:52:08.781Z - 2020-04-12T04:18:28.029Z - 12-04-2020

సిటిజప్ ట్రాకింగ్ యాప్.. లాక్ డౌన్ అతిక్రమిస్తే బుక్కైపోతారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్‌డౌన్ రూల్స్ అతిక్రమించేవారిని పోనీలే అని మందలించి, గుంజీలు తీయించి వదిలేవారు. ఇకపై అలాంటి పప్పులేం ఉడకవు. మీరు ఎక్కడ తిరిగినా మీ గుట్టురట్టయిపోవడం ఖాం. మీపై యాక్షన్ తప్పదు అంటున్నారు. ఇందుకోసం ఏకంగా ఓ యాప్‌ సిద్ధమైంది. అదే సిటిజన్ ట్రాకింగ్ కొవిడ్-19 యాప్. ఇకపై రూల్స్‌కి వ్యతిరేకంగా ఎవరైనా బైకులు, కార్లపై 3 కిలోమీటర్లకు మించి తిరిగితే… వెంటనే సిటిజన్ ట్రాకింగ్ కొవిడ్-19 యాప్‌లో కేసు నమోదు చేస్తారు.

ఈ యాప్ తాజాగా అమల్లోకి వస్తోంది. ఈ యాప్‌లో సదరు బండి ఎంత దూరం వెళ్లింది. ఎన్ని కిలోమీటర్లు అదనంగా వెళ్లింది అనేది ఎప్పటికప్పుడు నమోదుచేస్తారు. అందువల్ల… ఎవరైనా పోలీసులకు చిక్కి.. ఇదే మొదటిసారి… ఈసారి వదిలేయండి అంటే పోలీసులు నమ్మరు. యాప్‌లో చెక్ చేసి మరీ యాక్షన్ తీసుకుంటారు. కేసులు రాసేస్తారు. తెలంగాణలోని పోలీస్ అధికారులు, ఇప్పుడు పోలీసులు అందరి దగ్గర ఈ యాప్ ఉంది. లాక్ డౌన్ పొడిగింపు వేళ సీఎం కేసీయార్ కూడా అదే మాట చెప్పారు. 

కరోనా వైరస్ వ్యాపిస్తున్నవేళ తెలంగాణాలో ఇకపై ఎవరైనా రోడ్లపై వాహనాలతో ఎంటరైతే సిటిజన్ ట్రాకింగ్ యాప్‌లో ఆ వాహనం నంబర్ ఎంటర్ చేస్తారు. తద్వారా ఆ వాహనం ఎక్కడెక్కడ తిరిగిందో మొత్తం వివరాలు బయటపెడుతుంది. ఈ విషయం తెలియని బండి వ్యక్తి అలా జాయ్‌గా బండి నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలా ఆ బండి వెళ్తున్న చోట్ల వేర్వేరు ప్రాంతాల్లో దాని నంబర్‌ ఎంటరవుతూ ఉంటుంది. తద్వారా ఆ బండి ఆ రోజు ఎన్ని కిలోమీటర్లు వెళ్లిందే లెక్క తేల్చేస్తుంది. అది 3 కిలోమీటర్లు దాటిందంటే చాలు కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత వాహనాన్ని సీజ్ చేస్తారు.

మీకు ఏ సామాన్లు కావాల్సి వచ్చినా 3 కిలోమీటర్ల లోపు ఉన్న షాపుల్లోనే కొనుక్కోవాలి. మీరు కోరుకున్న సామాను దొరకకపోతే దాని బదులు మరో సామాను కొనుక్కోవాలి. కానీ అదే కావాలని పట్టుపట్టడం ఇక కుదరదు. మందుల విషయంలో మాత్రం కొంత వెసులుబాటు ఉంటుంది. ఆ మందు 3 కిలోమీటర్ల పరిధిలో దొరకకపోతే, అప్పుడు పోలీసులకు విషయం చెప్పాల్సి వుంటుంది.  వారి అనుమతితో చుట్టుపక్కల వేరే మెడికల్ షాపులకు వెళ్లొచ్చు. ఇదంతా ప్రజల మంచి కోసమే అంటున్న పోలీసులు ఈ రూల్స్ కచ్చితంగా పాటించాలని మరీ మరీ కోరుతున్నారు.

లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేసేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో టెక్నాలజీని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. ‘సిటిజన్ ట్రాకింగ్ అప్లికేషన్ యాప్’ తో పకడ్బందీ చర్యలు తీసుకుంటూ అవసరం లేకున్నా బయట తిరిగే వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి నేటి వరకు వరంగల్  పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం  3183 వాహనాలను పోలీసులు స్వాధీనంతో చేసుకోవడంతో పాటు 670 కేసులను నమోదు చేసారు.పోలీస్ చెకింగ్ పాయింట్ వద్దకు వచ్చే ప్రతి వాహన పూర్తి వివరాలను ఈ యాప్ లో నమోదు చేస్తారు.

అక్కడకు వచ్చిన వాహనదారుని పేరు,మొబైల్ నెంబర్, ఆధార్, వెహికిల్ నెంబర్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు తీసుకుంటారు. దీంతో వాహనదారుడు లాక్ డౌన్ ను అతిక్రమించి ఒక చెక్ పాయింట్ నుంచి మరో చెక్ పాయింట్ కు చేరుకున్నప్పుడు ఎన్నిసార్లు రోడ్లమీదకు వచ్చాడో.. ఎంత దూరంనుంచి, ఎన్ని చెక్ పాయింట్లను దాటి వచ్చాడో తదితర సమాచారం అంతా అందులో నమోదు చేస్తారు. సో.. మీ వెహికల్ పోలీస్ పరిధి దాటకుండా చూసుకోండి. మీరు దగ్గరలో ఏమైనా కొనడానికి వెళ్లాలంటే హాయిగా మాస్క్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళండి. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle