newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షియోమీ మరో సంచలనం... ముందు-వెనుక ‘నాలుగు’

22-11-201822-11-2018 17:30:41 IST
Updated On 22-11-2018 17:30:37 ISTUpdated On 22-11-20182018-11-22T12:00:41.474Z22-11-2018 2018-11-22T12:00:37.350Z - 2018-11-22T12:00:37.352Z - 22-11-2018

షియోమీ మరో సంచలనం... ముందు-వెనుక ‘నాలుగు’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్ రంగంలో షియోమీ సంస్థ ఇప్పటికే ఎన్నో సంచలనాల్ని నమోదు చేసింది. అద్భుతమైన ఫీచర్స్‌తో అతితక్కువ ధరలకే స్మార్ట్‌‌ఫోన్స్ అందుబాటులోకి తీసుకొచ్చి... అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇతర కంపెనీల మార్కెట్‌కి గండి కొట్టి... అనతికాలంలోనే తిరుగులేని స్థానం సంపాదించుకుంది. దాన్ని ఎప్పటికీ పదిలపర్చుకోవడం కోసం... మరిన్ని అధునాతనమైన ఫోన్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే గురువారం ‘రెడ్‌మి నోట్ 6ప్రొ’నను విడుదల చేసింది. ఈ ఫోన్‌కి ఉన్న విశిష్టత... ముందు, వెనుక కలిపి నాలుగు కెమెరాలు ఉండడం! చాలాకాలం నుంచి ఎన్నో సంస్థలు ఇలాంటి ఫీచర్ ఫోన్‌ని విడుదల చేయాలని అనుకున్నారు కానీ... వారికంటే ముందు రెడ్‌మి వచ్చేసింది. ‘రెడ్‌మి నోట్‌ 5ప్రొ’లాగే ఇది మొబైల్ మార్కెట్‌లో సరికొత్త సంచనాలకు తెరతీస్తుందని రెడ్‌మి ఇండియా అధిపతి మనుకుమార్‌జైన్ పేర్కొన్నారు. ‘రెడ్‌మి నోట్’ సిరీస్‌లో ‘నోట్‌ 5ప్రొ’ మొబైల్‌కు ఫ్లిప్‌కార్ట్‌లో 8 లక్షలకు పైగా వినియోగదారులు 4.5 పైగా రేటింగ్‌ ఇచ్చారని, ఇది ఒక చరిత్ర అని ఆయన అన్నారు. ఇక ఇప్పుడు ‘నోట్‌ 6ప్రొ’ ఆ చరిత్రను తిరగరాసేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఐడీసీ (ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌) లెక్కల ప్రకారం... భారత్‌లోని స్మార్ట్‌ఫోన్‌ విపణిలో మధ్యశ్రేణి ధరల విభాగంలో ఈ ఏడాది ఎంఐ మొదటి స్థానంలో ఉందని... ఈ స్థానాన్ని చేరుకొనేందుకు నోట్‌ 5ప్రొ ప్రధాన పాత్ర పోషించిందని ఆయనన్నారు. కాగా... భారత్‌లో రెడ్‌మీ నోట్‌ 6ప్రొ ధర రూ.13,999 (4జీబీ+64జీబీ), రూ.15,999 (6జీబీ+64జీబీ)గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌‌లో ఈ ఫోన్‌లు అందుబాటులోకి వస్తాయి. ఎంఐ స్టోర్లలోనూ ఫోన్ ‌అందుబాటులో ఉండనుంది.

రెడ్‌మీ నోట్‌ 6 ప్రొ ఫీచర్లు :
* 6.26 అంగుళాల హెచ్‌డీ తెర (1080x2280 పిక్సల్స్‌)
* 12ఎంపీ+5ఎంపీ (వెనుకవైపు) డ్యుయల్‌ కెమెరాలు, 20ఎంపీ+2ఎంపీ (ముందువైపు)
* ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఓఎస్‌
* ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌
* 4జీబీ లేదా 6జీబీ ర్యామ్‌తో 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ (మెమరీ సామర్థ్యాన్ని 256 జీబీల వరకూ పెంచుకొనే సామర్థ్యం)
* 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* నలుపు, నీలం, ఎరుపు, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో లభ్యం
* ధర : రూ.13,999 నుంచి మొదలు

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle